నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం

మహారాష్ట్రలోని నాగపూర్ నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం.

నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం మహారాష్ట్రలోని నాగపూర్ నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. ఇది 3780 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగివుంది. ఈ ప్రాంతాన్ని నాగపూర్ మహానగర అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, రవాణా, గృహాల బాధ్యత నిర్వర్తించే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.

నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం
పైనుంచి సవ్యదిశలో: దీక్షభూమి, నాగపూర్ నారింజ, విదర్బ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్ పట్టణం, స్వామి నారయణ్ దేవాలయం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లానాగపూర్
తాలూకా[1]
  • నాగపూర్ గ్రామీణ
  • కంప్టీ
  • హింగనా
  • పర్శివ్ని
  • మౌదా
  • సవ్నీర్
  • ఉమ్రెడ్
  • కల్మేశ్వర్
  • కుహి
విస్తీర్ణం
 • Metro
3,780 కి.మీ2 (1,460 చ. మై)
Time zoneUTC+5:30 (IST)
అభివృద్ధి సంస్థనాగపూర్ మహానగర అభివృద్ధి సంస్థ
చైర్మన్ఉద్దవ్‌ థాకరే, ముఖ్యమంత్రి,
మహారాష్ట్ర ప్రభుత్వం
మెట్రోపాలిటన్ కమీషనర్శ్రీమతి. షీతల్ తేలి-ఉగలే (ఐఏఎస్)

నాగపూర్ నగరం జనాభాలో భారతదేశంలో 13వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం, భౌగోళికంగా భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది. ఈ నగరం మీదుగా ప్రవహించే నాగ్ నది వల్ల దీనికి నాగ్‌పూర్ అనే పేరు పెట్టారు. పాత నాగ్‌పూర్ (నేడు 'మహల్' అని పిలుస్తారు) నగరం, నాగ్ నదికి ఉత్తర ఒడ్డున ఉంది. పూర్ భారతీయ భాషలలో "నగరం" అని అర్ధం.[2]

చరిత్ర

మార్చు

18వ శతాబ్దపు తొలినాళ్ళలో గోండ్ రాజవంశం నాయకుడు బఖ్త్ బులాండ్ షా ఈ నగరాన్ని నిర్మించాడు. ఆ తరువాత, డియోగ రాజ్ చాంద్ సుల్తాన్, కొండల క్రింద ఉన్న దేశంలో నివసిస్తూ నాగపూర్ ను తన రాజధానిగా చేసుకున్నాడు. నాగపూర్ నగరం స్థాపించబడి 300 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 2002లో ఒక పెద్ద వేడుక నిర్వహించబడింది.[3]

1999లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నాగపూర్ పట్టణం, నాగపూర్ గ్రామీణ, హింగనా, పర్శివ్ని, మౌదా, కంప్టీ తాలూకాలోని సవ్నీర్, కల్మేశ్వర్, ఉమ్రెడ్, కుహి తదితరుల ప్రాంతాలతో కలిపి నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఏర్పడింది. నగరపాలక సంస్థ పరిమితుల చుట్టూ ఉన్న మెట్రో ప్రాంత సరిహద్దులు ఏర్పాటుచేయబడ్డాయి. 1999 నోటిఫికేషన్‌కు సంబంధించి, ఎన్‌ఐటి చట్టం -1936 లోని 1 నిబంధన ప్రకారం "నాగ్‌పూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం"[4] కింద ఎన్‌ఎంసి,[5] ఎన్ఐటి[6] వరకు అధికార పరిధి విస్తరించింది. ఇది సుమారు 25 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మెట్రోపాలిటన్ ప్రణాళిక ప్రాంతం

మార్చు
నాగపూర్ ప్రాంతం/జిల్లా ప్రాంతం 9810 కి.మీ.2
మెట్రోపాలిటన్ ప్రాంతానికి ప్రతిపాదించిన ప్రాంతం 25 నుండి 40 వరకు కి.మీ.
నాగపూర్ పురపాలక పరిమితి చుట్టూ ఉన్న ప్రాంతం 3780 కి.మీ.2
ఎన్‌ఎంసి పరిమితిలో ఉన్న ప్రాంతం 216 కి.మీ.2

ప్రతిపాదిత మెట్రోపాలిటన్ ప్రాంత రెండు దశలు

మార్చు

మెట్రోపాలిటన్ ప్రాంత ప్రణాళికను ఎన్‌ఐటి రెండు దశల్లో ప్రతిపాదించింది:

  • మొదటి దశ: ప్రాంతం -1520 కి.మీ.2
  • రెండవ దశ: ప్రాంతం -2260 కి.మీ.2

మెట్రోపాలిటన్ ప్రాంత ప్రణాళిక కోసం ఎన్‌ఐటి విధానాన్ని రూపొందించింది. ప్రణాళిక ఖరారైన తర్వాత, అభివృద్ధి కోసం వివిధ పట్టణ ప్రణాళిక పథకాలు చేపట్టబడుతున్నాయి.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nagpur Metropolitan Region Development Authority - NMRDA". www.nmrda.org. Retrieved 2020-10-08.
  2. "Management of Social Transformations (MOST) Programme – United Nations Educational, Scientific and Cultural Organization". UNESCO. Retrieved 15 October 2020.
  3. "'Model for beautification of Zero Mile to be finalized soon': Patankar". Nagpurtoday.in. Retrieved 2020-10-15.
  4. "Nagpur Metropolitan Area". Archived from the original on 17 ఫిబ్రవరి 2010. Retrieved 8 అక్టోబరు 2020.
  5. "Nagpur Municipal Corporation". Archived from the original on 7 జూన్ 2010. Retrieved 8 అక్టోబరు 2020.
  6. "::Welcome to NIT::". www.nitnagpur.org. Retrieved 2020-10-08.