ఉద్ధవ్ ఠాక్రే

(ఉద్దవ్‌ థాకరే నుండి దారిమార్పు చెందింది)

ఉద్దవ్‌ థాకరే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు.అలాగే మహారాష్ట్ర ముఖ్య మంత్రి.

ఉద్ధవ్ ఠాక్రే
ఉద్ధవ్ ఠాక్రే


మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
28 నవంబర్ 2019 - ప్రస్తుతం

శివసేన పార్టీ అద్యక్ష్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 జనవరి 2013

సామ్నా పత్రిక సంపాదకుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
జూన్ 2006
ముందు బాల్ థాకరే

వ్యక్తిగత వివరాలు

జననం 27 జులై, 1960
బొంబాయి, మహారాష్ట్ర
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
జీవిత భాగస్వామి రష్మీ థాకరే
సంతానం ఆదిత్య థాకరే, తేజాస్‌ థాకరే
నివాసం మాతోశ్రీ, బంద్రా, ముంబై

జననంసవరించు

ఉద్దవ్‌ థాకరే 1960, జూలై 27న ముంబైలో జన్మించాడు. ఆయన జేజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఆర్డ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

రాజకీయ ప్రస్థానంసవరించు

1985 బృహన్ముంబై ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1990లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. 2002లో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చాడు. 2003లో శివసేన అధినేత బాల్‌ ఠాక్రే ఆయనను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించాడు. 2004లో శివసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు.[1] 28 నవంబర్ 2019న మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే భాద్యతలు చేపట్టాడు.[2] ఉద్దవ్ థాకరే 14 మే 2020లో శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి, జాతీయం (27 November 2019). "సేనాధిపతి నుంచి రాష్ట్రాధిపతి దాకా..!". www.andhrajyothy.com. Archived from the original on 27 నవంబర్ 2019. Retrieved 27 November 2019. Check date values in: |archivedate= (help)
  2. నమస్తే తెలంగాణ, తాజావార్తలు (28 November 2019). "మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం". ntnews.com. Archived from the original on 28 నవంబర్ 2019. Retrieved 28 November 2019. Check date values in: |archivedate= (help)