నాగభరణం 2016లో తెలుగులో విడుదలైన సినిమా. కన్నడలో 2016లో 'నగరహవు' పేరుతో విడుదలైన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదించాడు. విష్ణువర్ధన్‌, దిగంత్, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 14న విడుదలైంది.

నాగభరణం
కన్నడನಾಗರಹಾವು
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనకోడి రామకృష్ణ
నిర్మాతమల్కాపురం శివకుమార్
తారాగణం
ఛాయాగ్రహణంహెచ్.సి. వేణుగోపాల్
కూర్పుజానీ హర్ష
సంగీతంగురుకిరణ్
నిర్మాణ
సంస్థ
సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
విడుదల తేదీ
2016 అక్టోబరు 14 (2016-10-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

సూర్య గ్రహణం రోజున దేవతల శక్తులన్నీ నశిస్తాయి. ఆ రోజున దుష్ట శక్తుల నుంచి భూగోళాన్ని ఆ శక్తి కవచం కాపాడుతూ ఉంటుంది. అంతటి శక్తిగల శక్తి కవచాన్ని శివయ్య (సాయి కుమార్) ఎన్నో యేళ్లుగా కాపాడుతూ వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) శక్తి కవచాన్ని కాపాడే సమయంలో ప్రాణాలు కోల్పోతోంది. శక్తి కవచాన్ని కాపాడటం కోసం మరో జన్మని ఎత్తిన నాగమ్మ మానస (రమ్య) ఎలాంటి పోరాటలు చేసింది. చివరకి శక్తి కవచాని ఎలా కాపాడింది ?? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: మల్కాపురం శివకుమార్[2]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ[3]
  • సంగీతం:గురుకిరణ్
  • ఎడిటర్‌: జానీ హర్ష
  • సినిమాటోగ్రఫీ: హెచ్.సి. వేణుగోపాల్
  • స్టంట్స్‌: రవివర్మ, థ్రిల్లర్‌ మంజు
  • ఆర్ట్‌: నాగరాజ్‌
  • కొరియోగ్రాఫర్‌: చిన్ని ప్రకాష్‌, శివశంకర్‌, ఇమ్రాన్‌ సర్దారియా

మూలాలు మార్చు

  1. The Times of India (12 October 2016). "Nagabharanam" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  2. Sakshi (13 October 2016). "అమ్మోరు... అరుంధతి తరహాలో..." Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  3. Sakshi (9 October 2016). "అప్పుడది దేవుడు లేని గుడితో సమానం!". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగభరణం&oldid=3919067" నుండి వెలికితీశారు