నాగభూషణ (కన్నడ నటుడు)
నాగభూషణ ఎన్ ఎస్, భారతీయ చలనచిత్ర నటుడు. ప్రధానంగా కన్నడ సినిమాలలో నటించే ఆయన సంకష్ట కర గణపతితో నాగభూషణ తెరంగేట్రం చేసాడు.
నాగభూషణ | |
---|---|
జననం | నాగభూషణ ఎన్ ఎస్ |
విద్యాసంస్థ | జెసీఈ మైసూర్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
2018లో ఆయన యూ టర్న్ చిత్రంతో తెలుగు, తమిళ చిత్రసీమల్లోనూ అరంగేట్రం చేసాడు.[1]
కెరీర్
మార్చుప్రభుత్వ ఉద్యోగం చేసే నాగభూషణ నటనపై ఉన్న మక్కువతో మైమ్ రమేష్ స్థాపించిన GPIER థియేటర్ గ్రూప్‌లో చేరాడు.
ఆయన చదువుకునే రోజులలోనే తన స్నేహితులతో కలిసి 2016లో ఒక యూట్యూబ్ ఛానెల్, కర్ణాటక ఎంటర్‌టైన్‌మెంట్ బోర్డ్‌ను ప్రారంభించాడు. ఆ ఛానెల్‌లో పలు ఎపిసోడ్‌లలో నటించడంతో పాటు దర్శకత్వం వహించడం, స్క్రిప్ట్ రాయడం కూడా చేసాడు.[2]
ఆయన నటించిన ఒక వీడియో 350,000 కంటే ఎక్కువ వీక్షణలను తెచ్చిపెట్టింది.[3] బద్మాష్ (2016) సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన తర్వాత, సంకష్ట కర గణపతి (2018)లో లికిత్ శెట్టి స్నేహితుడిగా నటించాడు.[4]
ఆయన హనీమూన్ అనే వెబ్ సిరీస్‌కి కథ రాసాడు. అంతేకాకుండా, అందులో సంజనా ఆనంద్ సరసన నటించాడు కూడా.[5][6][7][8] హనీమూన్ వెబ్ సిరీస్‌లోని ఎపిసోడ్‌లు మొదట తెలుగులో ఆహా స్ట్రీమింగ్ సర్వీస్‌లో, తర్వాత కన్నడలో వూట్‌లో విడుదల చేయబడ్డాయి.[9][10] ఆయన కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో వివాహ జంట కష్టాలను చూపించే కామెడీ ఎంటర్‌టైనర్ ఇక్కత్‌లో ప్రధాన పాత్ర పోషించాడు.[11][12][13] ఈ చిత్రం 2021 జూలై 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడింది. ఈ చిత్రం విమర్శకుల సానుకూల సమీక్షలను అందుకుంది.[14][15]
గుర్తింపు
మార్చుఇక్కత్ చిత్రంలో తన నటనకు 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో ఉత్తమ నూతన నటుడు - కన్నడ పురస్కారం అందుకున్నాడు.[16] అంతేకాకుండా, ఆయన ఇక్కత్, బడవ రాస్కెల్ చిత్రాలకు ఉత్తమ సహాయ నటుడుగాను నామినేట్ అయ్యాడు. అలాగే, బడవ రాస్కెల్ చిత్రం 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ లో ఆయన ఉత్తమ సహాయ నటుడుగా కూడా నామినేట్ చేయబడ్డాడు.[17]
మూలాలు
మార్చు- ↑ Aiyappan, Ashameera (22 July 2018). "Samantha Akkineni's U-Turn to release on September 13". The Indian Express. Archived from the original on 23 July 2018. Retrieved 29 July 2018.
- ↑ "KEB — satirically yours". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
- ↑ richabarua. "Lucia director Pawan Kumar suffers from HFPS disease". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
- ↑ Sankashta Kara Ganapathi Movie Review {3.5/5}: Critic Review of Sankashta Kara Ganapathi by Times of India, retrieved 2022-06-02
- ↑ Anandraj, Shilpa (2022-05-31). "Nagabhushan on 'Honeymoon': 'A comedy for the family'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-06-02.
- ↑ Honeymoon Season 1 Review: An endearing tale of an arranged match on their honeymoon, retrieved 2022-06-02
- ↑ "Nagabhushana and Sanjana ready for Honeymoon". The New Indian Express. Retrieved 2022-06-02.
- ↑ "'Honeymoon' is a comic take on newlyweds' lives". Deccan Herald (in ఇంగ్లీష్). 2019-04-09. Retrieved 2022-06-02.
- ↑ Anandraj, Shilpa (2022-05-31). "Nagabhushan on 'Honeymoon': 'A comedy for the family'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-06-02.
- ↑ Ltd, Arha Media & Broadcasting Pvt. "Watch Online Movies | South Indian movies & web series". aha (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-01. Retrieved 2022-06-02.
- ↑ "Pawan Kumar backs 'Ikkat', film about couple in forced". Deccan Herald (in ఇంగ్లీష్). 2021-03-27. Retrieved 2022-06-02.
- ↑ "Pawan Kumar Studios is all set to present Ikkat". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
- ↑ "Nagabhushana and Bhoomi: 'Ikkat' is special for us". Deccan Herald (in ఇంగ్లీష్). 2021-07-16. Retrieved 2022-06-02.
- ↑ "Ikkat movie review: Amazon's Kannada comedy is smart and funny". The Indian Express (in ఇంగ్లీష్). 2021-07-21. Retrieved 2022-06-02.
- ↑ "Nagabhushan and Bhoomi Shetty Make 'Ikkat' A Fun Watchable Drama". BookMyShow (in Indian English). Retrieved 2022-06-02.
- ↑ "SIIMA 2022: ಅಪ್ಪುಗೆ ಅತ್ಯುತ್ತಮ ನಟ- ಆಶಿಕಾ ರಂಗನಾಥ್ಗೆ ಅತ್ಯುತ್ತಮ ನಟಿ ಪ್ರಶಸ್ತಿ; ಇಲ್ಲಿದೆ ಕಂಪ್ಲೀಟ್ ಲಿಸ್ಟ್". ವಿಜಯ ಕರ್ನಾಟಕ. 12 September 2022. Retrieved 14 September 2022.
- ↑ "Filmfare Awards 2022 Kannada Winners". Filmfare. Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.