నాగలక్ష్మి ఒక అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి. 2012లో తొలిసారి జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో ఈమె సభ్యురాలు, తమ జట్టు గెలుపునకు ఈమె కీలక పాత్ర వహించింది. ఈమె ప్రకాశం జిల్లా వాసి. ఈమె తల్లిదండ్రులు అరుణకుమారి, శ్రీమన్నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈమెను మొదట కోచ్ అమ్మయ్య చౌదరి గుర్తించి శిక్షణ నిచ్చింది, తరువాత ఈమె కోచ్ పద్మజా బాల వద్ద శిక్షణ పొందింది.

ప్రోత్సాహక బహుమతిసవరించు

2012 మహిళల కబడ్డీ ప్రపంచకప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన భారత జట్టులోని సభ్యురాలైన ఈమెను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించి 11-08-2012న రూ.25 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు.

మూలాలుసవరించు

  • సాక్షి దినపత్రిక - 12-08-2014 స్పోర్ట్స్ పేజీలో