నాగులగుట్టపల్లె

నాగులగుట్టపల్లె కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

నాగులగుట్టపల్లె
—  రెవిన్యూయేతర గ్రామం  —
నాగులగుట్టపల్లె is located in Andhra Pradesh
నాగులగుట్టపల్లె
నాగులగుట్టపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°13′17″N 78°32′12″E / 14.221418°N 78.536571°E / 14.221418; 78.536571
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చక్రాయపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామములోని సురభి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రోదిచేసుకున్నది. ఉపాధ్యాయులు ఐకమత్యంతో విద్యార్థులను తమ స్వంత బిడ్డలలా చూసుకుంటూ వారికి త్రాగునీరూ, మరుగుదొడ్లూ మొదలగు అన్ని వసతులూ కల్పించారు. యోగా నేర్పుచున్నారు. బాలికలకు కుట్లు, అల్లికలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ పాఠశాలలో ఇప్పుడు 384 మంది విద్యార్థులున్నారు. 2008 నుండి ఇప్పటివరకూ, వరుసగా ఈ పాఠశాల విద్యార్థులు "కడప రత్నాలు"గా ఎన్నికైనారు. ఇంకా వీరిలో 5గురు ఐ.ఐ.ఐ.టి.కి ఎంపికైనారు. ఎన్.ఎన్.ఎం.ఎస్.పధకం క్రింద 6 గురికి ఉపకారవేతనాలు వస్తున్నవి. జనవిజ్ఞాన వేదిక, ప్రపంచ తెలుగు మహాసభ, పలు జిల్లా స్థాయి పోటీలలోనూ పాల్గొని బహుమతులు గెల్చుకుంటున్నారు. ఈ గ్రామానికిచెందిన కొవ్వూరు హరనాధరెడ్డి+ప్రమీలమ్మ ల కుమారుడైన గణపతిరెడ్డి ఇప్పుడు డిల్లీలో ఓ.ఎస్.డి.గా పనిచేయుచున్నాడు. వీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉంటారు. వీరీ పదవిలో సెప్టంబరు/2012 నుండి పనిచేస్తున్నారు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు