నాథూరామ్ గాడ్సే

మహాత్మా గాంధీ హంతకుడు

నాథూరామ్ గాడ్సే (మే 19, 1910 - నవంబరు 15, 1949) గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా అతను ప్రసిద్ధి పొందాడు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.[1] ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయాడు. 1948లో పూనా నుండి ప్రచురించబడిన హిందు మహాసభ వారి హిందూ రాష్ట్ర అనే వారపత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు.

నాథూరామ్ గాడ్సే
నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హ్యత్య చేయుట కొరకు ట్రయల్ వద్ద చిత్రం
జననం(1910-05-19)1910 మే 19
మరణం1949 నవంబరు 15(1949-11-15) (వయసు 39)
మరణ కారణంఉరితీత
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మహాత్మా గాంధీ హత్య

గాంధీ హత్య

మార్చు

భారత్-పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకించాడు. ఆ సమయంలో గాంధీ భారత్ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే, గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యానాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.[2]

మూలాలు

మార్చు
  1. Devare, Aparna (2013-04-03). History and the Making of a Modern Hindu Self. Routledge. ISBN 978-1-136-19708-6.
  2. Bandyopadhyay, Sekhar (2009-06-03). Decolonization in South Asia: Meanings of Freedom in Post-independence West Bengal, 1947–52. Routledge. ISBN 978-1-134-01824-6.

వెలుపలి లింకులు

మార్చు