హిందు మహాసభ 1914 సంవత్సరములో స్థాపించబడింది. భారతదేశములో హిందుమత పరంపరాగతను సంరక్షించుట ముఖ్య లక్ష్యము కలిగియుండిన సంస్థ. 1909 సంవత్సరంలో అమలుచేయబడిన రాజ్యాంగ చట్ట ఫలస్వరూపముగా బ్రిటిష్ ప్రభుత్వము వారు ముస్లిం లీగు వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నందున ఆ సంస్ధకు పోటిగానుండుటకు నెలకొల్పబడింది. తదుపరి బ్రిటిష్ ఇండియా చరిత్రలో స్వతంత్రపోరాటముకొరకు 20 వశతాబ్దారంభమునుండి జోరుగా జరుగుచున రాజకీయాందోళన కాలమందు రాజకీయపార్టిగా కూడా అవతరించిన సంస్థ. రాజకీయ పార్టీగా ఎక్కువ ఆధిక్యత కలిగియుండకపోయినప్పటికిని జాతిమత ధర్మ విషయములలో హిందవుల హితముకోరిన సంస్థగా ప్రాముఖ్యతగైకొనియుండి జాతీయ కాంగ్రెస్సు పార్టీవారి మహాసభలలో చేయు తీర్మానములసైతము సమీక్షించి పరివర్తనచేయకలిగే స్తోమతకలిగియన్నట్టి ప్రముఖ సంస్థ. మహావీర దళమనెడి ఉపసంస్థ హిందు మహాసభవారి శాఖ. చిరకాలమునుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోనుండి అనేక సార్లు కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్ష్యునిగా నుండి అనేక విద్యాసంస్థలను స్థాపించిన పండిత మదన్ మోహన్ మాలవ్యా గారు కాంగ్రెస్ వదలి హిందు మహాసభకు వ్యవస్థాపకుడై 1922 సంవత్సరమున ఆ సభకు అధ్యక్షుని గానుండెను. "హిందు రాష్ట్ర" ( హిందు దేశము) అను మరాఠీ భాషలోని హిందు మహాసభవారి వారపత్రిక పూనా (పునే Pune) పట్టణమునుండి ప్రచురించబడేది. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే ఆ వారపత్రికకు 1948 లో సంపాదకుడుగా నుండెను.[1]

పూర్వోత్తర చరిత్ర మార్చు

మొగల్ సామ్రాజ్యఅస్తమించిన తరువాత 18 వ శతాబ్దారంభమునుండి బ్రిటిష్ వారి పరిపాలన ప్రారంభమైనది. 1757 నుండి 1878 దాకా వ్యాపార సంస్థ రాజ్యాధికారముతో భారతదేశమును పరిపాలించింది. 1878 నుండి లండన్ లోనున్న బ్రిటిష్ ప్రభుత్వము ఇంగ్లండు రాణీగారి పేరట పరిపాలన మొదలైనది. వివిధజాతి మత కులములు కలిగిన భారతదేశమును బ్రిటిష్ వారు నిరంకుశముగా పరిపాలించిరి. క్రమేణా ఇంగ్లీషు భాష, రాజకీయ పరిజ్ఞానము వృధ్దిచెంది మేధావులైన భారతీయులు కులమత భేదములు తలుపక భారతదేశమును బ్రిటిష్ పరిపాలననుండి విముక్తిచేయుటయే ప్రప్రథమముగా సర్వసమ్మతమైన లక్ష్యము కలిగియుండిరి. కాని కుటిల రాజ్యతంత్రములనవలంబించిన బ్రిటిష్ సార్వభౌములు భారతదేశమును విడుచుటకిష్టములేక భారతీయుల మధ్య విభేదాలు పెంచి విభజించి పరిపాలించమన్న సూత్రము పాటించారు. 1909 సంవత్సరమున మింటో-మార్లే సంస్కరణలు ఆదిశలో ప్రథమమెట్టు. అటుతరువాత 1919వ సంవత్సరపు రాజ్యాంగ చట్టము మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము, 1932వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన అల్పసంఖ్యాక నిబంధనము (1932 MacDonald Communal Award), అటుతరువాత 1935 వ సంవత్సరపు ఇండియా రాజ్యాంగ చట్టముఇత్యాదులు. ముస్లిములకు ప్రత్యేక నియోజక వర్గములేర్పచబడటమే గాక వారి సభ్యులు ఎన్నికలలోనిలబడుటకు అర్హత, ఓటువేసే హక్కుకు నిర్ణయించబడ్డ లక్షణములు హిందువులకు నిర్ణయించిన వాటికన్నా చాల తేలికపాటి నిర్భందనములు కలిపించి నందువల్ల కొన్ని ముఖ్యమైన రాష్ట్రస్థాయి శాసనసభలలో (పంజాబు, బెంగాలు) హిందువులకన్నా ముస్లిమ్ సభ్యుల సంఖ్య దాదాపుగా సరిసమానమో కొంచం అధికమవటమో జరిగింది. 20 వ శతాబ్దారంభమములో భారతదేశమున గల అనేక హిందుమత ప్రయోజక సంఘములు, సభలు వేరు వేరు సిధ్దాంతములు కలిగి యుండెడివి. హిందు సనాతన ధర్మముల సంరక్షించుకొనుటకే గాక హిందువులపాలిట జరుగుచున్న అత్యాచారములనరికట్టుటకు, హిందు మతము, సంస్కారమునకు పరిరక్షణ, అభివృద్ధిని లక్ష్యముగాపెట్టుకుని కృషి సలిపెడివి. బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజము, సనాతన ధర్మసభ, భారత ధర్మమహా మండలం, హిందుసభ, మహావీర దళం (హిందు మహాసభ వారి శాఖ) మొదలగునవి. ఆవిధముగా విశాల భారతదేశము నలుమూలలనున్న హిందుమత సంబంధిత సంఘములకు వేరు వేరు సిధ్దాంతములు (ideologies)కలిగి యుండెను. ప్రముఖమైన అట్టి సంఘములలో ఆర్యసమాజ్ యొక్క సిధ్ధాంతము మూఢనమ్మకములను విడనాడుట. 1922-23 సంవత్సరములో ఆ సంస్థవారు సల్పిన సుధ్ధి అనే ఉద్యమము వల్ల హిందు ముస్లిం సంఘర్షణలింకా పెరిగినవి. బ్రిటిష్ ప్రభుత్వపు నిరంకుశత్వమును ప్రతిఘటించుటకు రాజకీయ సంస్థగా 1885 లో కాంగ్రెస్సు పార్టీ స్థాపింబడింది. రాజకీయకారణములకు పాటుబడిన ఆ పార్టితో వివిధ హిందు మతసంఘములే కాక ముస్లింసంస్థలైన ముస్లిం లీగు, ఖిలాఫత్ ఉద్యమ సంస్థ కూడా సహకరించుతూ బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలన తీరు మార్పచుటకు సర్వసమ్మతమైన కృషి జరిగెను. 1906 సంవత్సరములో స్వరాజ్యము కావలెనన్న దృఢనిశ్చయమును దాదాభాయి నౌరోజీ నాయకత్వములో కాంగ్రెస్ వారు వెల్లడించిరి. అటుతరువాత 1929 డిశెంబరు 31తేదీన కాంగ్రెస్సు మహాసభలో పూర్ణస్వరాజ్యము కావలెనన్న తీర్మానముచేసిరి. అప్పటినుండి బ్రిటిష్ ఇండియా చరిత్ర చాల చిత్రమైన మలుపులు తిరిగినది. కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వములో 1920లో ప్రవేశపెట్టిన సహాయవిరాకణోద్యమము మొట్టమొదట అలి సోదరలు (జవర్ అలి, షౌకత్ అలి) మొదలుపెట్టిన ముస్లిమ్ సంస్థ అయిన ఖిలాఫత్ నకు మదత్తుగా ప్రారంభించి తదపరి స్వరాజ్యముకోసము సహాయనిరాకణ ఉద్యమమును సాగించారు. కానీ ఆ ఉద్యమకారణంగా 1922 లో చౌరాచౌరీలో జరిగిన హింసాత్మక చర్యలవల్ల గాందీ ఆ సహాయనిరకరణోద్యమమును ఆపేశారు. ఆ సందర్భములోనే కొందమంది కాంగ్రెస్సునాయకులు గాంధీయెక్క అహింసా సిద్దాంతముతో విభిన్నులై కాంగ్రెస్సునుంచి విడిపోయారు. అంతకు ముందే (గాందీ నాయకత్వమునకుముందే) 1916 లో ఒకసారి కాంగ్రెస్సులో తీవ్రజాతీయవాదులు, మితవాదులు వేరు పడుటజరిగింది. 1920 దశాబ్దములో గాంధీ అహింసా సిధ్దాంతమును విముఖతచూపివేరు వేరు సంస్థలు, ఉద్యమాలు చేపట్టిరి. అట్టి ప్రముఖులలోమదన్ మోహన్ మాలవ్య ఒకరు. అయన హిందుమహసభలో చేరెను. దాదాభాయి నౌరోజి శిష్యడుగానుండిన ముహమ్మద్ అలీ జిన్నా కూడా చాలా కాలము కాంగ్రెస్సుతో సహకరించాడు. కానీ అతనుకూడా తదుపరికాలములో కాంగ్రెస్సును విడిచి 1919 సంవత్సరములో ముస్లిం లీగు సంస్దకు అధ్యక్షుడైనాడు. 1920 దాకా జరిగిన బ్రిటిష్ ఇండియా చరిత్రలో భారతదేశమున కల వివిధ మతసంబంధిత సంఘములు మతప్రయోజక, విద్యావిషయములలో నే కృషిసలిపెడివి. రాజకీయ ప్రయోజనం కోసము ప్రయత్నించినటలు కనుబడుటలేదు. కాల క్రమేణా జరిగిన రాజకీయ మలుపులలో ముస్లింనాయకులకు కలిగిన రాజకీయఆదిక్యతా కాంక్షవల్ల బ్రిటిష్ వారు భారతదేశమును విడిచి పెట్టిన తరువాత స్వపరిపాలనములో ముస్లిములకు ప్రధాన్యత, ఉన్నత స్థానముకోసము ముస్లిం లీగు జిన్నా నాయకత్వములో రాజ్యతంత్రముల చేయసాగెను. ముస్లిముల విద్యాభివృధ్దికి 1875 లో సర్ సయ్యిద్ అహమద్ ఖాన్ చే స్థాపించబడిన“మొహమడన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజి” అను సంస్థ 1906లో ఆల్ఇండియా ముస్లింలీగు అను సంస్థగా మారినది. జిన్నా కార్యకాలము (1914 నుంచి) పూర్తి రాజకీయ సంస్థగా కార్యనిర్వహించింది. మహమ్మద్ అలి జిన్నా ప్రవేశపెట్టిన సిధ్దాంతము: బ్రిటిష్ నిరంకుశ పరిపాలనపోయి స్వతంత్ర భారతదేశములో హిందునిరంకుశ పరిపాలనప్రారంభమగునని అందుచే హిందువులను, ముస్లిములను వేరు వేరు దేశములుగా భావించి (హిందు-ఇండియా, ముస్లిం-ఇండియా) విభజించవలెనన్న సిధ్ధాంతము ప్రవేశపెట్టి తదుపరి ముస్లిం-ఇండియాకు పాకిస్తాన్ అను నామకరణంచేసెను. అటువంటి ఆందోళన కార్యాచరణయెక్క విస్తృత పర్యావసానమును హిందుమహ సభవారు దృష్టిలో పెట్టుకుని తగినట్టుగానే కార్యాచరణచేపట్టిరి. హిందు మహాసభ వారిపై హిందూ ఉగ్రవాద ఆరోపణలున్నప్పటికినీ అటువంటి మతావేశక హింసాఖాండక చర్యలు 1946 -47 లో జరిగుచున్నకాలమందు జాతీయకాంగ్రెస్సు వారు నియంత్రణ చేయకలిగిరి. కాని ముస్లిం ఉగ్రవాదక చర్యలను ముస్లింలీగు నియంత్రించలేక విఫలమైనది.[1][2][3],[4]

మతప్రయోజిత సంస్థలు, హిందు-ముస్లిముల ఘర్షణలు మార్చు

1915 లో ప్రవేశించి 1920 నుంచీ కాంగ్రెస్సుకు నాయకత్వము వహించిన గాంధీ మతము రాజకీయము వేరుచేయలేమని చెప్పినా రాజకీయకారణములవల్ల ఈ రెండుమతస్తుల మద్య ఘర్షణలు తీవ్రమగుటచూసి హిందు-ముస్లిమ్లుల సఖ్యతకోసము జీవితాంతము కృషిసలిపిన సంగతి తెలిసినదె. గాంధీ ప్రచురించిన పత్రిక యంగ్ ఇండియాలో 1924 సంవత్సరము మే 29 తారీకున హిందు-ముస్లిముల ఘర్షణలు వాటి ఉపశమనకు సమాధానముల అని ప్రచురించారు. 20వ శతాబ్దారంభమున భారతదేశములో హిందు-ముస్లిముల ఘర్షణలకు, వైరములకు అనేక పరిస్థితులు ముఖ్యముగా రాజకీయప్రయోజన విషయములు కారణములైయుండినవి. 1921 లో మలబారులో జరిగిన మొప్లహాస్ అను ముస్లింతెగ హిందువులతోను, బ్రిటిష్ పరిపాలకవర్గముతోను వ్యతిరేకించి చేసిన తిరుగుబాటు మొప్లహాస్ తిరుగుబాటుగా చాల తీవ్రమైన ముస్లిమ్-హిందు ఘర్షణ. బ్రిటిష్ పరిపాలకుల రాజ్యతంత్రములవల్ల 1920నుండి రాజకీయకారణములు దోహదమైనవి. బ్రిటిష్ ప్రభువుల దృష్టిలో హిందు-ముస్లిముల ఘర్షణలు మొదటినుండి వున్నవేనని వారిపరిపాలన వలన కాదని వెల్లడించారు. 1923-24 లో కలకత్తా, ముల్తాన్, కొహాట్ ( North-west Frontier Provinceకొహాట్ కనుమల ప్రాంతములలో పెద్దపెట్టున జరిగిన హిందు-ముస్లిము ఘర్షణలు ప్రముఖమైనవి . అల్హాబాదు, ఢిల్లీ, గుల్బర్గాలో కూడా జరిగినవి. 1947కు ముందు విశాల రాష్ట్రములుగానున్న బెంగాల్, పంజాబు రాష్ట్రములు, పశ్చమ కనుల ప్రాంతములు (NORTH WESTERN PROVINCE) భౌగోళకముగా పెద్దవగుటయేగాక ఆ రాష్ట్రములలో ముస్లిముల సంఖ్యకూడా ఎక్కువగానుండేది. అందుచే పంజాబు బెంగాలు రాష్ట్రములు మతఘర్షణలు, మతప్రేరిత రాజకీయములలో కూడా చాల ప్రాముఖ్యతగైకొనియుండినవి. 20వ శతాబ్దారంభమములో స్థాపింపబడ్డ హిందు-ముస్లిము మత సంస్థలు రాజకీయప్రయెజనముకోసము పోటీగా ఉద్బవించిన సంస్థలు. ఈ రెండు మతస్థుల సంస్థలు వాటి సిధ్దాంతాలతో ఉద్యమాలు పోటీగా నెలకొల్పటమేగాక పత్రికలు, కరపత్రముల ప్రచురణ ద్వారా కూడా వారి దృష్టికోణములు, విమర్శలు, రాజకీయవిశ్లేషములచే సమ్మతి-వ్యతిరేకతను వ్యక్తపరచచుండుటవలన హిందు ముస్లిమ్లుల ఘర్షణలకుదారితీసేను.
అప్పటిలో ముస్లిమ్ లీగు తోపాటుగానున్న ఇతర ముస్లిం సంస్థలు: ఖిలాఫత్ , అలీ ఘోల్, తంజీమ్, తబ్లీఘ్ మొదలగునవి. వీటి ఉద్యమములు: ఖిలాఫత్ అలీఘోల్, తంజీమ్, తబ్లీఘ్ అను ఉద్యమములు. మత ప్రయోజితమైన రాజకీయ సిద్దాంతములతో నెలకొన్న ఉద్యమములు. ఉద్యమసంబంధిత ప్రచురణలేకాక ఆరోజులనాటి ఉర్దూ పత్రికలు; ఖిలాఫత్ ఉద్యమసంస్థాపకుడైన షౌకత్ అలి సంకలించి ప్రచురించిన హమ్ దర్ద (compassion) అను వారపత్రిక, మహమ్మద్ అలి జిన్నా స్థాపించిన డాన్ (Dawn) అను వారపత్రిక (తదుపరి దినపత్రిక) ల ద్వారా కూడా మతప్రేరితమైన రాజకీయ బోధనలు జరిగెను. ఆ రెండేకాక అమ్రుత్సర్ లో ప్రచురించబడిన అలిఘోల్, తంజీమ్ అను పత్రికలు కూడా చెప్పదగ్గవి.
వీటికి పోటీగా యున్న సమకాలీన హిందుమత సంస్థలు: ఆర్యసమాజముతోపాటుగా బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజము, సనాతన ధర్మసభ, భారత ధర్మమహా మండలం, హిందుసభ, హిందు సంఘటన్, మహావీర దళం (హిందు మహాసభ వారి శాఖ) మొదలగునవి. ఈ హిందు సంస్థలు శుధ్ది, హిందు, హిందు సంఘటన్ అను ఉద్యమములు చేపట్టెను . హిందుసంఘటన్ సంస్థ వారు అగ్రణి అను పత్రికను, హిందు మహా సభ వారు హిందు రాష్ట్ర అను పత్రికను సంకలించి ప్రచురించారు. అంతేకాక ఆనాటి తీవ్రజాతీయవాది, హిందుమహాసభ పక్షవాది అయిన లాలాలజపతిరాయ్ తన సిద్దాంతములను, విమర్శలను పంజాబ్ నుండి ప్రచురించబడుచున్న ప్రముఖ పత్రిక ట్రిబ్యూన్ (Tribune)ద్వారా వెల్లడించుచుండెను
రాజకీయ ఎత్తుగడలు, వాగ్వవివాదములు జరుగుచున్న ఆ దశాబ్దపు (1920) తొలిరోజులలో ఆర్యసమాజము వారు శుద్ధి అను అభియోగము ద్వారా మహమ్మదీయులుగా మారిన హిందువులను తిరిగి హిందుమతములోనికి మార్చుటకు కృషి చేశారు. దానికి చేదోడుగా హిందు మహాసభవారు అప్పటివరకూ అంటరానివారనుచుండిన దలిత వర్గములు కూడా హిందువులేననియూ వారి హిందుమహాసభలోని సభ్యత్వమును అధికముచేయుటకు దలితులను పెద్దపెట్టున హిందుమహాసభలో చేర్చుకునటకు అభియోగముచేపట్టిరి. హిందు సంస్థలు చేసిన మతప్రయోజక కార్యచరణ, వారి ఉద్యమములు రాజకీయప్రయోజనములకేనని గ్రహించిన ముస్లింలీగువారు వారి ఆందోళన కార్యక్రమము ఇంకా వుదృతముచేయుచుండిరి. మొదటిలో (1914-1920) మహమ్మదాలి జిన్నా రాజకీయములను మతమును వేరుగనుంచవలెనన్నాక్రమేణా 1920 తరువాత మతప్రేరితరాజకీయములనే చేబట్టి బ్రిటిష్ వారు వదలిపెట్టె సమయానికి విశాల భారతదేశమును మతాధారముపై విభజించుటకు కారణమైనాడు. .[1]

1947కు ముందు హిందు మహసభ నిర్వహించిన పాత్ర మార్చు

హిందుమహా సభ అను సంస్థ 1914 లో స్థిర రూపములో స్థాపించబడినప్పటికీ 1906 లో ముస్లీంలీగు స్థాపింపబడినప్పటినుండి అంకురించినటుల కనబడుచున్నది. ఆ సంస్థ స్థాపించిన వ్యవస్థాపకులలో మదన్మోహన్ మాలవ్యాగారు ప్రముఖులు. 1922లో హిందుమహా సభ అద్యక్షుడైన మాలవ్య గారు హిందుమతస్తులను మహమ్మదీయులుగా పరివర్తనముచేయబడ్డవారి సంఖ్యనానాటికి ఏవిధముగా పెరుగుచుండినదో సంఖ్యలతో సహా విశదీకరించుతూ అంతకు క్రితసంవత్సరములో ఒక్క గుజరాత్ రాష్ట్రములోనే దాదాపు లక్షమంది హిందువులను మహమ్మదీయ మతమునకు మార్చినట్లుగ చెప్పుతూ ఆర్యసమాజమువారి శుధ్ది ఉద్యమమును సమర్ధించుతూ ఊతపలికారు. అంతేకాక ప్రతి గ్రామంనకో హిందూమహాసభ స్థాపించవలెనని హిందుమహాసభ అధ్యక్షునిగనుండిన రోజులలో మాలవ్యగారు ప్రతిపాదించారు. 1947కు ముందు మహాసభవారి పలుకుబడివల్ల శాసనసభలలో కాంగ్రెస్సుపార్టీటి అధికస్తానములు గెలుపొందుటకు తోడ్పడెను. భారతదేశానికి స్వతంత్రము రాకముందు రాజకీయపార్టీగా ప్రాముఖ్యత లేకపోయినప్పటికిని రాజకీయముగా పలుకుబడిగలిగిన ప్రముఖులైనవారు సభ్యులుగాను, అధ్యక్ష్యునిగా నుండుటచే జాతీయ కాంగ్రెస్సు పార్టీ కార్యాచరణలో ఈ సంస్థవారి అభిప్రాయములను దృష్టిలోనుంచుకుని ముందుకుసాగుచుండెను.1937 సంవత్సరములో జరిగిన జనరల్ ఎన్నికలలో హిందు మహాసభ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన స్థానములో కేవలము నాలుగే అదికూడా కేవలము సింద్ ప్రావిన్సులో (రాష్ట్రము) మరల 1946 ప్రొవెన్సియల్ ఎన్నికలలో కేవలము రెండే రెండు రాష్ట్రములలో (బెంగాలు, బొంబాయి ప్రావిన్సులు) ఒక్కో స్థానము పొందగలిగెను .[2] అయినప్పటికీ హిందుమహాసభ సభ్యులుగానున్నవారు కూడా కాంగ్రెస్సు ప్రవెశపెట్టిన స్వరాజ్యోద్యమములలో బాగస్వాములుగచేరి వాటిని అమలుచేసిరి. చిరకాల కాంగ్రెస్సు వాది, హిందుముస్లిం సఖ్యతకోరినవాడైన మదన్ మోహన్ మాలవ్యా 1922 లో హిందుమహసభ వ్యనస్థాపకునిగా గుర్తింపుపోంది 1923 దాకా ఆ సంస్థకు అధ్యక్షత పదవి వహించెను. 1928 లో సైమన్ కమిషన్ విచారణ సంఘమునకు వ్యతిరేకముగా కాంగ్రెస్సు చేపట్టిన ఆందోళనలోను, 1932 లోసహాయనిరాకరణోద్యమములోను మాలవ్యజీ చేసిన కృషి గణనీయమైనది. మాలవ్య హిందుమహాసభ అధ్యక్షుడుగా హిందు ముస్లిముల సఖ్యతకు ప్రయత్నముచేసెను. హిందు-ముస్లిముల ఘర్షణలు, వైరములు చరిత్రాత్మకముగానెంత ప్రసిధ్ధమైనవో ఈ రెండు మతస్తులమధ్య సఖ్యత కూడా అంతచారిత్రకమైనది[5]. గాందీ నాయకత్వమున నడచిన కాంగ్రెస్సు కూడా హిందు ముస్లిముల సఖ్యతకోరినదైన సిధ్ధాంతము కలిగియుండెను. హిదు మహాసభ సంస్ధలో ప్రముఖులైనమరికొందరు కూడా మొదట కాంగ్రెస్సులోనుండినవారే. కాంగ్రెస్సునుండి హిందుమహాసభలో సభ్యులుగనుండి మరి అక్కడనుండి వేరు వేరు హిందుమత సంభందమైన సంస్థలు స్థాపించారు. అట్టివారిలో కొందరు
(1) బి.యస్ మున్జె (1927-1937 మధ్య అధ్యక్షుడు)
(2) కె.బి హెడ్జవార్ . తదుపరి 1925లో రాష్ట్రియ స్వయం సేవక సంఘమును స్థాపించెను.
(3) వినాయక్ దామోదర్ సావర్కర్ (1937-1943 లో అధ్యక్షుడు) హిందు సంఘటన అను సంస్థతో సంబంధముకలిగియుండెను
(4) శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ ను స్థాపించెను.
(5) నారాయణ భాస్కర ఖరె (1949-51 మధ్య అధ్యక్షుడు).
1909 సంవత్సరపు రాజ్యాంగసంస్కరణల చట్టము ప్రకారము జరిగిన శాసన సభ ఎన్నికలలో ముస్లింలీగు కన్నా కాంగ్రేస్సు వారికి అధికసంఖ్యలో గెలుపొందుటకు కాంగ్రెస్సుకు హిందుమహా సభవారి సహకారము లభించు చుండెను. అటుతరువాత 1919 సంవత్సరపు రాజ్యాంగచట్టము ద్యారా జరిగిన మరికొన్ని సంస్కరణల, 1935రాజ్యాంగచట్టముచేయకమునుపు1932లో బ్రిటి్ష్ ఇండియా రాజ్యాంగమంత్రి సర్ శామ్యుఎల్ హోర్ (Sir Samuel Hoare) భారతదేశములోని దలిత వర్గములకొరకు ప్రత్యేక నియోజకవర్గ ప్రతిపాదన గాందీ తీవ్రముగా ఖండించి ఆపుచేయుటకు నిరాహారదీక్షచేపట్టెను. దలితలు హిందువులనియు వారికి వేరు నియోజగవర్గము పెట్టుట హిందువులను విభజించుటయేనని గాందీ నొక్కి వక్కాణించెను. హిందుమహాసభవారు గాందీజీతో ఆ విషయములో ఏకీభవించిరి. ఆ సందర్భములో డాక్టరు భీంరావ్ రాంజీ అంబేద్కర్ (బబాసాహెబ్ అంబేద్కరు) గాందీ భావములకు వ్యతిరేకతజూపినను చివరకు గాందీనిరాహారదీక్ష మాన్చుటకు గాందీతో వప్పుకుని ప్రత్యెక నియోజకవర్గము బదులు రిజర్వేషన్లు నియమించుట ప్రతిపాదించెను. 1935 సంవత్సరపు రాజ్యాంగచట్టము ద్వారా ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర శాసన సభల ఎన్నికలకు కాంగ్రెస్సు- ముస్లింలీగు పోటాపోటీగా నుండిన కాలములో కాంగ్రెస్సు నాయకులు హిందుమహాసభ మదత్తు కోరుచుండెడివారు. హిందు మహాసభయెక్క ప్రాముఖ్యత తెలుపుటకు చెప్పదగ్గవిశేషములలో
(1) లాలా లజపతి రాయిగారు చేసిన ఒకానొక బహిరంగ ప్రతిపాదన. పంజాబు కేసరి అనిప్రసిధ్దిపొందిన లాలా లజపతిరాయ్ తీవ్రజాతీయవాది. 1920లో కాంగ్రెస్సు మహాసభకు అధ్యక్షుడు. ఆయన 1924 డిసెంబరులో ట్రిబ్యూన్ అను వార్తాపత్రికలో ప్రచురించిన అనేక వ్యాసములలో ముస్లిం లీగు, మహ్మద్ అలి జిన్నాయొక్క రాజకీయ ఎత్తుగడలు, వారి ఆందోళనలను ఖండించుచూ కాంగ్రెస్సుయోక్క మెత్తదనపు ప్రతీకారమును విమర్శించి కాంగ్రెస్సువారు హిందు మహాసభను తమ ప్రతినిధిగా (mouth piece) నియమించవలెనని ప్రతిపాదించెను.
(2) 1928లో మోతీలాల్ నెహ్రూ అద్యక్షతన జరిగిన అఖిలపక్షసమావేశముయొక్క నివేదికను ముస్లిముల నాయకుడైన షౌకత్ అలి వ్యతిరేకించి ఆ నివేదిక హిందు మహాసభవారి అభిమతానుసారము తయారుచేయబడినదని ఆరోపించెను.
1945 దాకా బ్రిటిష్ సార్వభౌములు భారతదేశమునకు స్వరాజ్యమిచ్చుటకు సిధ్ద పడలేదు. (చూడు:భారతదేశపు బ్రిటిష్ సామ్రాజ్యఅస్తమయము) బ్రిటిన్ లో చర్చిల్ (Sir Winston Churchill) తరువాత 1945లో క్లెమెంట్ అట్లీ (Clement Atlee) ప్రభుత్వము అధికారములోకి రాగనే భారతదేశానికి స్వాతంత్ర్యమునిచ్చుటకు నిశ్చయించి క్రిప్సు (Sir Stafford Cripps) అధ్యక్షతన మరిద్దరు సభ్యులతో భారతదేశానికి పంపెను. అప్పటి వైస్రాయి లార్డు వావెల్ ( Archibald Percival Wavell) తో కలసి ఆ క్రిప్సు సంఘము భారతదేశములో అప్పటిలోనున్నటువంటి సకల పక్షములతో సంప్రతింపులు జరిపి దేశమును విభజించమన్న జిన్నా ప్రతిపాదనను తిరస్కరించి విశాల భారతదేశముగనే వుంచి మూడు అరలుగల ఉమ్మడి పరిపాలనా రాజ్యాంగమును రెండు మెలికలగల రాజ్యతంత్రముచే ప్రతిపాదించి సమ్మతమును తెలిపి, సమ్మతమైనచో జిన్నా-నెహ్రూ బృందముతో ప్రభుత్వమునేర్పరచమనిరి. ఆ విధమైన క్రిప్సు సంఘపు తీర్పు (Constitutional award)కు ముస్లింలీగు, కాంగ్రెస్సు పార్టీలు సమ్మతిని తెలిపాయి గాని కాంగ్రెస్సువారు జిన్నాతో ప్రభుత్వమును నిర్మించుటకు వప్పుకునలేదు. జిన్నాతో అట్టి ఉమ్మడి ప్రభుత్వమేర్పరచుటకు నెహ్రుకు హిందుమాహ సభ వారి సమ్మతి కలిగియుండలేదని తోచుచున్నది. వైస్రాయి వావెల్ కాంగ్రెస్సులేకుండా ముస్లింలీగుని ప్రభుత్వమునడుపమని ఆహ్వానించలేదు. దాంతో జిన్నా ఉగ్రు డై క్రిప్సు సంఘపు తీర్పునకు తమ పార్టీవారిచ్చిన సమ్మతిని ఉపసంహరించి తమ ఆందోళనను మరింతవధృతముచేశాడు. పాకిస్తాన్ అను దేశము ఏర్పడేవరకూ హింసాత్మక చర్యలకు కూడా వెనకాడవలదని ప్రోదల్బించినందున కలకత్తా మహానగరములోను ఇతర నగరములలోను ముస్లిం-హిందు ఘర్షణలు అతితీవ్రముగా చెలరేగినవి. చాల ప్రాణనష్టముసంభవించింది. అట్టి విషమించిన పరిస్థితులలోకూడా దేశ విభజనకు గాంధీజీ ఇష్టపడలేదు. కానీ హిందు ముస్లిముల హింసాకాండలు వదృతముగా చెలరేగినందున నెహ్రూ గాందీని వప్పించటం తదుపరి దేశమును ఇండియా పాకిస్తాన్గా విభజించటము జరిగింది. దేశవిభజనకు గాందీ వప్పుకున్నందుకు హిందుమత తీవ్రవాదులు ఏవరైతే హిందు మహా సభనుండి విడిపడి ఇతర తీవ్రవాదక సంస్థలలో సభ్యులుగానైతిరో వారు గాందీ పై కసి పూనిరి. అంతేగాక అంతకు చాలకాలమునకు ముందు సహాయనిరాకరణోద్యమము ఖిలాఫత్ ఉద్యమదారులకనుగుణముగా ప్రతిపాదించినందులకే గాందీ మీద వీరికి ద్వేషోద్రేకములు ఉత్పన్నమైనవి.[1]

1947 తరువాత హిందు మహా సభకు సంబంధించిన చరిత్రాంశములు మార్చు

1946 సంవత్సరములో బ్రిటిష్ ఇండియా స్వతంత్రభారతదేశముగా మారుదశలో ప్రవేశించినదనవచ్చును. తదుపరి 4 సంవత్సరములలో జరిగిన చరిత్రాంశములు ఉత్తెజమైయున్నవి. భారతదేశ విభజన కేవలము మహమ్మదాలి జిన్నాతీవ్ర ఉగ్రవాదక హెచ్చరికల వలన జరిగింది. మతమే దేశము దేశమే మతమన్న సిద్దాంతమును భారతీయ ముస్లిములకు నూరిపోసెను. అతని చేతిక్రింద సంస్దలైన ముస్లిమ్ లీగు మరియూ ముస్లిం లీగు నేషనల్ గార్డు అను రెండు సంస్థల ద్వారా తీవ్ర ఆందోళన కార్యక్రమములు చేయుదమనియూ, విభజించకుండా బ్రిటిషవారు కనుక రాజ్యాదికారము కాంగ్రెస్సు నాయకులకప్పచెప్పినచో దేశములో అరాజకమును కలుగజేయుదమన్న హెచ్చెరికచేయబట్టి కాంగ్రెస్సు నాయకులు గాందీజీని వప్పించారు. దేశవిభజనకు కాంగ్రెస్సు వప్పుకున్నదనియూ అందుకు తను వ్యతిరేకించి కాంగ్రెస్సు కార్యకాలాపాలకు దూరముగా నుండుట నిశ్చయిచితిననియూ 1947 మే నెలలో ప్రార్థనా సమావేశములో గాందీ వెల్లడించాడు. సర్ సిరిల్ రెడ్ క్లిఫ్ (Sir Cyril Redcliffe) అను బ్రిటిష్ వకీలు అధ్యక్షతన రాష్ట్రవిభజన సరిహద్దుల విచారణ సంఘము (Boundary commission) వారు నిర్మించిన పటలము (Map) సమాచారము ముందుగనే పొక్కినది . పంజాబు బెంగాల్ విశాలరాష్ట్రములు విభజించబడునన్న వార్త పొక్కగనే 1947 ఆగస్టటు 8 తారీఖునాటి నుండి సిక్కు ముస్లిము ల మధ్య పంజాబులోను హిందు ముస్లిముల మద్య బెంగాల్ లోనూ ప్రజ్విరిల్లిన ద్వేష భావములు భీషణ రైలు పట్టాల ప్రేలుడులు మొదలగు హింసాఖాండల వల్ల అనేకులు మరణించారు. సిక్కుమతస్తుల గురు నానాక్ పుట్టిన స్థళము పాకిస్తాన్ లోనిదైన పశ్ఛమ పంజాబులోకి రావటంతో సిక్కులకు తీవ్ర ఆవేశము కలుగచేసింది. అప్పుడు జరిగిన హింసాఖాండలో మతసంస్ధలు పాత్ర వహించినటుల చరిత్రాధారములు లేవు. ఆ సంస్థలు ఉపశమన కార్యక్రమంకూడా చేసినటుల కనబడదు. ఆ రోజులలో హింసాఖాండ ఆపుచేయుటకు హిందు ముస్లిముల సఖ్యతకలిపించుటకు గాందీ ఆమరణ నిరాహార దీక్షచేపట్టెను. గాంధీ ఆరోగ్యపరిస్థితి తీవ్రరూపముదాల్చుటచే అఖిలమత నాయకులు, వివిధ మతసంస్థల ప్రతినిదుల సమావేశము చేసి ఉమ్మడిగా సకలజన శాంతి ప్రతిపాదనకు వప్పందముచేసుకొని గాందీ నిరాహార దీక్షను సమాప్తిచేయించారు. కాని హిందుమహా సభవారి ప్రతినిధులు ఆ శాంతి ప్రతిపాదననుండి తదనంతరం ఉపసంహరించుకున్నటులగా గాంధీ తన ప్రార్థనా సమావేశములలో తెలిపెను. విభజనకు గాందీ వప్పుకున్నాడనియు, హింసాఖాండ జరుగుచున్నరోజులలో ముస్లిములకు సానుభూతిచూపించాడన్న ఆరోపణవల్లనే గాక గాందీపై హిందు మతసంస్థల ద్వేషపూరిత ఆగ్రహమునకు మరో పెద్ద కారణముకూడా తోడైనది. బ్రిటిష్ వారు రాజ్యాధికారము వప్పచెప్పిననాటికి దేశవిభజనతోపాటు ఆస్తులను కూడా పంపిణిచేసుకునిరి. పాకిస్తాన్ వాటాకుకు వచ్చిన 750 మిలియన్ రూపాయలు (75కోట్ల)లలో 200 మిలియన్ రూపాయలు (20కోట్లు) మొదటి విడుతగా విడుదలచేశారు. దేశ విభజనానంతరము ఏడాదిలోపలనే 1947 అక్టోబరులో పాకిస్తాన్ ప్రేరణ, సహాయముతో జెమ్ము-కాశ్మీర రాష్ట్రమున అరాజకము సృష్టించుటకు ప్రయత్నించబడింది. అప్పడు కాశ్మీర పరిపాలించు స్వతంత్ర మహారాజు సర్ హరి సింహ భారతదేశ సైనిక సహాయంతో పాకిస్తాన్ యొక్క దుష్ట ప్రయత్నమును విఫలముచేయగలిగెను. పాకిస్తాన్ యొక్క దష్పయత్న కారణముగా పాకిస్తాన్ కిఇయ్యవలసిన ఆస్తి వాటా రెండవవిడత 550 మిలియన్ రూపాయలు (55కోట్లు) భారతప్రభుత్వము నిలిపివేశారు. భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగము నిర్మించేలోపల కొంతకాలము బ్రిటిష్ వారి 1935 వ సంవత్సరపు ఇండియా రాజ్యాంగ చట్టము వలన సంక్రమించిన రాజ్యాంగమునే అవలంబించుటవలన భారతదేశమును ఇండియన్ డొమీనియన్ (Indian Dominion) అనబడినది (అధినివేశ స్వరాజ్యము ). అదినివేశ స్వరాజ్యముగానుండిన ఆ రోజులలో మౌంట్‌బాటన్ ( వైస్రాయి పదవి రద్దుచేయబడి) భారతదేశానికి గవర్నరజనరల్ గనే యుండెను. పాకిస్తాన్ కు జిన్నా గవర్నర్ జనరల్ గానుండెను. జిన్నాకోరికపై గవర్నర్ జనరల్ మౌంటు బాటన్ కలుగజేసుకుని నెహ్రూ పటేల్ తో చెప్పినాగాని వారు వప్పుకోలేదు. అంతట మౌంట్ బాటన్ గాందీతో సంప్రతించి జిన్నాకోరిక తెలుపగా సత్యవంతుడు, మాటతప్పని గాందీ మహాత్ముడు భారతదేశ ప్రభుత్వమును వప్పించుటకు నిరాహార దీక్షచేపట్టెను. దాంతో భారత ప్రభుత్వము పాకిస్తాన్ కు ఇయ్యవలసిన వాటా ఆస్తి విలు వ 55 కోట్లను విడుదలచేశారు. 1947 లో భారతదేశమును విభజించుటకు దానితరువాత జెమ్ము-కాశ్మీరాష్ట్రమున అరాజకముసృష్టించుటకు దుండగులను పంపించిన పాకిస్తాన్ కు గాంధీయొక్క ఆ ఉదారచర్య హిందు మత సంస్థలకు మరోసారి ఆగ్రహము కలుగచేయుటకు మరొక కారణమైయున్నది.[1]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "The Longest August" Dilip Hiro (2015) Nation Books pp 39,66,126-127
  2. 2.0 2.1 "The Making of a Nation" B.R. Nanda(2004) pp i-xxxii Harper Collins
  3. "Gandhi & Churchill" Arthur Herman (2008) arrow books
  4. "Jinnah- India-Partition-Independence" Jaswanth Singh(2009) rupa &co pp
  5. "Hindu Moslem Civilization of India" D.V.Siva Rao (1941) Immortal message, Bezwada January 1941