నాదిరా బబ్బర్
నాదిరా బబ్బర్ (జననం 1948 జనవరి 20) ముంబాయిలో జన్మించింది. ఆమె ఒక రంగస్థల నటి, దర్శకురాలు. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. 2001 లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. మొదటగా ఆమె నాదిరా అనే థియేటర్ గ్రూపును 1981లో స్థాపించింది[1]
నాదిరా బబ్బర్ | |
---|---|
జననం | |
జాతీయత | భారత దేశం |
వృత్తి | నటి, దర్శకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
పిల్లలు | ఆర్య బబ్బర్ జుహి బబ్బర్ |
తల్లిదండ్రులు | సజ్జద్ జహీర్ (తండ్రి) రజియాఅ సజ్జద్ జహీర్ (తల్లి) |
జీవితం తొలి దశలో
మార్చునాదిరా బబ్బర్ ఢిల్లీ లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి 1971 లో పట్టభద్రురాలైంది.[2]
వ్యక్తిగత జీవితం
మార్చునేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలోనే ఆమె తన భర్త, నటుడు, రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్ ను కలిసింది. వీరి కుమారుడు ఆర్య బబ్బర్ హిందీ సినిమాలో నటుడు, కుమార్తె జూహి బబ్బర్ ఒక ఫ్యాషన్ డిజైనర్ గా నదీరా నాటకాలకు దుస్తులు డిజైన్ చేస్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చుబాహ్య లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నాదిరా బబ్బర్ పేజీ
- 'ఎక్జుటే' యొక్క అధికారిక వెబ్సైట్ Archived 2021-06-02 at the Wayback Machine
- పాకిస్తాన్లో సంధ్య ఛాయ Archived 2005-04-07 at the Wayback Machine
మూలాలు
మార్చు- ↑ "Three decades of drama". Mint. 14 April 2011.
- ↑ NSD Graduates Archived 18 జూలై 2011 at the Wayback Machine