నామకరణము
(నామకరణం నుండి దారిమార్పు చెందింది)
నామకరణము అనగా పుట్టిన బిడ్డకు పేరు (Name) పెట్టడం ఒక శుభకార్యం. దీనిని ఒక ఉత్సవంగా జరిపే సాంప్రదాయం వలన నామకరణోత్సరం అని కూడా అంటారు.
నామకరణ మహోత్సవం
మార్చు- నామకరణ మహోత్సవం సాధారణంగా దేవాలయాలలో జరుపుతుంటారు.
- పళ్లెంలో బియ్యం పోసి వాటిపై బంగారు, వెండి వస్తువు దేనినైనా ఉపయోగిస్తూ, ధర్భగడ్డి చుట్టిన వేళ్ళతో మొదటి సారి పేరు రాస్తారు.
- తండ్రి ఒడిలో కూర్చుండబెట్టుకొని బిడ్డతో మొదటగాపేరు రాయిస్తారు, తరువాత తల్లి మిగిలిన వారు రాయిస్తారు.
- ఇది లగ్నాదుల శుద్ధి ననుసరించి చేయవలయుదురు. జాతాశౌచము పూర్తియైన తరువాత పండ్రెండ్రవ రోజునగాని, పదహారవ రోజున గాని, యిరువది యగు రోజునకాని, యిరువది రెండవ రోజున గాని నామకరణం చేయిస్తారు
- పురుషులకు సరి సంఖ్య, స్త్రీలకు బేసి సంఖ్య గల యక్షరములతో నున్న నామములను నామకరణ మహోత్సవములో ఎక్కువగా వాడుతుంటరు
రాశుల, నక్షత్రాల ద్వారా నామకరణములు
మార్చుఒక్కొక్కరాశియందు తొమ్మిది నక్షత్రచరణముల ద్వారా ప్రతీ నక్షత్ర చరణమునకూ ఒక అక్షరము చెప్పబడింది. ఆ అక్షరము ఆధారముగ పుట్టినవానికి నామకరణము చేయుట అనాదిగ వస్తున్న సంప్రదాయము.దీని ద్వారా ఒక్కోరాశికి నలుగు పాదాలుగా చేసి ఆ కాలమును అనుసరించి పుట్టిన బిడ్డకు ఆయా నక్షత్రములలోని నాలుగు అక్షరములలో ఒకటి ముందు వచ్చునట్టుగా పేరు నిర్ణయము చేస్తారు.
రసాయనశాస్త్రంలో నామకరణం
మార్చురసాయనశాస్త్రంలో IUPAC ప్రకారం మూలకాలకు పేరు పెడతారు.