నా మొగుడు బ్రహ్మచారి

(నామొగుడు బ్రహ్మచారి నుండి దారిమార్పు చెందింది)

నా మొగుడు బ్రహ్మచారి 1981 ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు సినిమా. లీలావతి చిత్ర పతాకంపై కె.గురవారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్. కోటరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో చంద్రమోహన్, జయచిత్ర, రావు గోపాలరావు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]

నా మొగుడు బ్రహ్మచారి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎస్.కోటారెడ్డి
తారాగణం చంద్రమోహన్,
జయచిత్ర,
రావు గోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
భాష తెలుగు

ఆడవారిపై మగవారి పెత్తనాన్ని ద్వేషించే గీతకు, భర్త ఇచ్చే స్వేచ్ఛను, గౌరవాన్ని భార్య సద్వినియోగం చేసుకోవాలనే శంకర్‌కు పోటీ పడుతుంది. నీలాంటి వాడిని చస్తే పెళ్లాడనని గీత అంటుంది. నిన్నే పెళ్లాడి తగిన బుద్ధి చెబుతానని అంటాడు శంకర్. దానితో పట్నం అబ్బాయిని ససేమిరా పెళ్లాడనని అంటుంది గీత. వరుడి కోసం పల్లెటూరు వెడుతుంది. ఇది తెలిసి శంకర్ అదే వూరిలో కాశీ అనే అమాయక పల్లె యువకునిగా ప్రత్యక్షమయి గీత అభిమానాన్ని చూరగొంటాడు. గీత కాశీని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తుంది[2].

 
జయచిత్ర

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  1. మనసు చల్లగుండా వయసు వెచ్చగుండా, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  2. హే పిల్లదానా ఈ విస్సన్న చెప్పింది వేదం ఇది వినకుంటే నీ పాపకర్మం, రచన:వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  3. అక్క చాటు బావయ్యో ఒక్క మాటు రావయ్యో, రచన వేటూరి: గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  4. లేతగా ఉన్నది రాతిరి ఘాటుగా ఉంటుంది, రచన: ఆత్రేయ, గానం శిష్ట్లా జానకి, చక్రవర్తి.

మూలాలు

మార్చు
  1. "Naa Mogudu Brahmachari (1981)". Indiancine.ma. Retrieved 2020-09-05.
  2. వి.ఆర్. (21 February 1981). "చిత్ర సమీక్ష: నా మొగుడు బ్రహ్మచారి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 317. Retrieved 5 February 2018.[permanent dead link]

. 3. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.