నాయకి 2016లో తెలుగులో విడుదలైన హర్రర్ కామెడీ సినిమా. గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మించిన ఈ సినిమాకు గోవీ దర్శకత్వం వహించాడు. త్రిష, సత్యం రాజేష్, సుష్మా రాజ్, గణేష్ వెంకట్రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2016 జూలై 15న విడుదలైంది.

నాయకి
దర్శకత్వంగోవర్ధన్ రెడ్డి (గోవి)
రచనడైలాగ్ రాజేందర్ కల్లూరి - హరీష్ నాగరాజ్
స్క్రీన్ ప్లేబృంద రవీందర్
మూర్తి బి. డి
రాజశేఖర్ యాదవ్
నిర్మాతగిరిధర్ మామిడిపల్లి
పద్మజ మామిడిపల్లి
తారాగణంత్రిష
సత్యం రాజేష్
గణేష్ వెంకట్రామన్
సుష్మ రాజ్
ఛాయాగ్రహణంజగదీశ్ చీకటి
కూర్పుగౌతం రాజు
సంగీతంరఘు కుంచే
(రీ-రికార్డింగ్):
సాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
గిరిధర్ ప్రొడక్షన్ హౌస్
విడుదల తేదీs
15 జూలై 2016 (2016-07-15)(తెలుగు)
16 సెప్టెంబరు 2016 (2016-09-16)(తమిళ్)
దేశంభారతదేశం
భాషలుతెలుగు
తమిళ్

సంజ‌య్ (స‌త్యం రాజేష్‌) ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్‌. దుండిగ‌ల్‌లోకి ఓ కోట‌లో ఆత్మ రూపంలో తిరుగుతుంటుంది గాయ‌త్రి (త్రిష‌). సంజ‌య్ ( స‌త్యం రాజేష్‌) త‌న గర్ల్ ఫ్రెండ్‌తో ఆ కోట‌లోకి అడుగుపెడ‌తాడు. సెల్‌ఫోల్ కెమెరాలో మాత్ర‌మే క‌నిపిస్తూ గాయ‌త్రి సంజ‌య్‌ని బాగా భ‌య‌పెడుతుంది. గాయత్రి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటాడు. ఇంత‌కీ గాయ‌త్రి ఎవ‌రు? అసలు గాయత్రి అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి ? గాయత్రి గతం ఏంటి? సంజయ్ అక్కడి నుండి బయటపడ్డా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: గిరిధర్ ప్రొడక్షన్ హౌస్
  • నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోవీ
  • సంగీతం: రఘు కుంచే
  • సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి

మూలాలు

మార్చు
  1. Zee Cinemalu (15 July 2016). "నాయకి రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  2. The Hindu (15 July 2016). "Nayaki: A futile effort" (in Indian English). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.

బయటి లింకులు

మార్చు