ప్రధాన మెనూను తెరువు

సత్యం రాజేష్ ఒక తెలుగు సినీ హాస్యనటుడు. సుమారు 350కి పైగా సినిమాల్లో నటించాడు.[1] సుమంత్ నటించిన సత్యం సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్ క్షణం సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన నాయకి సినిమాలో హీరోగా నటించాడు.[2]

సత్యం రాజేష్
జననంరాజేష్ బాబు
వైజాగ్
నివాసంహైదరాబాదు
చదువుఎంబీయే
వృత్తినటుడు
తల్లిదండ్రులు
  • రాజేంద్ర ప్రసాద్ (తండ్రి)
  • మణి కుమారి (తల్లి)

జీవిత విశేషాలుసవరించు

రాజేష్ అసలు పేరు రాజేష్ బాబు. అతని స్వస్థలం విశాఖపట్నం. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రాజేంద్ర ప్రసాద్ టెలికాం ఉద్యోగి. అమ్మ మణి కుమారి గృహిణి. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. నటుడు చిరంజీవి స్పూర్తితో సినిమాల్లో నటించాలనుకున్నాడు. ఎంబీయే చదువుకున్నాడు. వైజాగ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా అతనికి హైదరాబాదుకు బదిలీ అయింది. తరువాత సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు.[3]

సినిమాలుసవరించు

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నీ స్నేహం రాజేష్ నటించిన మొదటి సినిమా. ఈ సినిమాలో రాజేష్ హీరో స్నేహితుడిగా నటించాడు. రాజేష్ రెండో సినిమా నూతన దర్శకుడు సూర్యకిరణ్ దర్శకత్వంలో సుమంత్ నటించిన సత్యం. ఆ సినిమాలో తనది ప్రాముఖ్యమున్న హీరో స్నేహితుడి పాత్ర మరియు మంచి విజయం సాధించడంతో ఆ సినిమా పేరునే తన పేరును సత్యం రాజేష్ గా మార్చుకున్నాడు. ఆ సినిమాలో పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అనే డైలాగుతో ప్రాచుర్యం పొందాడు. తరువాత 250 కి పైగా సినిమాల్లో నటించాడు. హాస్యనటుడిగా గుర్తింపు పొందిన రాజేష్ కు క్షణం సినిమాతో సీరియస్ నటుడిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది.[4] నిజానికి మొదట్లో ఈ పాత్రలో నటుడు సంపత్ రాజ్ ను నటింపజేయాలనుకున్నారు. కానీ చివరికి రాజేష్ కు ఆ పాత్ర దక్కింది. ఈ సినిమా తర్వాత రాజేష్ కు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. త్రిష ప్రధాన పాత్రలో వచ్చిన నాయకి సినిమాతో కథా నాయకుడిగా మారాడు. కానీ ఆ సినిమానే తాను హీరో మొదటి మరియు చివరి చిత్రమని ప్రకటించాడు.[5]

నటించిన చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. పాలపర్తి, శ్రీవిద్య. "Nayaki will be my first and last movie as a hero: Satyam Rajesh". timesofindia.indiatimes.com. Times of India. Retrieved 9 November 2016.
  2. "Comedian Turns Hero With Trisha's Film". gulte.com. Retrieved 9 November 2016.
  3. విలేకరి. "'నీ స్నేహం'తో తెరంగేట్రం". sakshi.com. సాక్షి. Retrieved 9 November 2016.
  4. "'Kshanam' has given me confidence to experiment: Satyam Rajesh". indianexpress.com. Indian Express. Retrieved 9 November 2016.
  5. "Satyam Rajesh's last film as." indiaglitz.com. Retrieved 9 November 2016.
  6. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. మూలం నుండి 9 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 20 June 2019. Cite news requires |newspaper= (help)

బయటి లింకులుసవరించు