నారదాసు లక్ష్మణ్‌రావు

నారదాసు లక్ష్మణ్‌రావు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

నారదాసు లక్ష్మణ్‌రావు

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2008 - ప్రస్తుతం
నియోజకవర్గము కరీంనగర్

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబరు 15, 1955
కోతిరాంపూర్ గ్రామం, కరీంనగర్ జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి వర్ష
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

జననం - విద్యాభ్యాసంసవరించు

నారదాసు లక్ష్మణ్‌రావు 1955, సెప్టెంబరు 15 తేదీన కరీంనగర్ జిల్లా, కోతిరాంపూర్ గ్రామంలో కేశవ్ రావు, కమల బాయి దంపతులకు జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ పొలిటికల్ సైన్స్ పూర్తిచేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి చదివాడు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు.

రాజకీయ జీవితంసవరించు

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పిడిఎస్‌యు విద్యార్థి సంఘంలో పనిచేసి ఆర్‌ఎస్‌యులో చేరాడు. 1975లో ఎమర్జెన్సీ విధించడం ద్వారా అజ్ఞాతంలోకి వెళ్లి పీపుల్స్‌వార్ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2001లో కేసీఆర్ టిఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన తరువాత టిఆర్‌ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 2008, డిసెంబరు 18 నుంచి 2013, మార్చి 29 వరకు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా (కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్) పనిచేశాడు. 2015లో కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]

మూలాలుసవరించు

  1. Chauhan, Ramesh (2015-12-07). "లైన్ క్లియర్." మన తెలంగాణ (in ఆంగ్లం). Archived from the original on 2020-07-08. Retrieved 2020-07-08.