నారింజ మిఠాయి (సినిమా)
నారింజ మిఠాయి 2019లో తమిళంలో ‘సిల్లు కరుప్పత్తి’ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని 2021 తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సినిమా. సముద్రఖని, సునయన, మణికందన్, కె. నివేదితా సతీశ్ ప్రధాన పాత్రల్లో నటించిన హలిత షమీమ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021, జనవరి 29న ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది.[1]
నారింజ మిఠాయి | |
---|---|
దర్శకత్వం | హలిత షమీమ్ |
రచన | హలిత షమీమ్ |
నిర్మాత | వెంకటేష్ వెలినేని సూర్య |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అబినందన్ రామానుజం మనోజ్ పరమహంస విజయ్ కార్తీక్ కన్నన్ యామిని యజ్ఞమూర్తి |
కూర్పు | హలిత షమీమ్ |
సంగీతం | ప్రదీప్ కుమార్ |
నిర్మాణ సంస్థ | డివైన్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | 2D ఎంటర్టైన్మెంట్ శక్తీ ఫిలిం ఫ్యాక్టరీ |
విడుదల తేదీs | 29 జనవరి, 2021 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ సినిమా నాలుగు జంటల కథ. మురికివాడలో ఉండే పిల్లాడు- ధనవంతుల కుటుంబంలోని బాలిక (పింక్ బ్యాగ్), క్యాన్సర్‌తో బాధపడే యువకుడు- ఫ్యాషన్ డిజైనింగ్ చేసే అమ్మాయి (కాకా గాడి), ఆస్పత్రిలో పరిచయమైన ఇద్దరు వృద్ధులు (టర్టిల్స్), పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్న జంట (హే అమ్ము) అంటూ నాలుగు చిన్న కథల నేపథ్యంలో రూపొందిన సినిమా. వేర్వేరు నేపథ్యాలు కలిగిన నాలుగు జంటల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి ?అనేదే సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- సముద్రఖని
- సునయన
- మణికందన్
- నివేదితా సతీష్
- శ్రీరామ్
- లీలా శాంసన్
- సారా అర్జున్
- రాహుల్
- దీపా శంకర్
సాంకేతిక నిపుణులు
మార్చు- సంగీతం: ప్రదీప్ కుమార్
- సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం, మనోజ్ పరమహంస, వినయ్ కార్తీక్, యామిని యజ్ఞమూర్తి
- ఎడిటింగ్: హలితా షమీమ్
- నిర్మాత: వెంకటేశ్ వెలినేని
- సమర్పణ: సూర్య
- కథ, దర్శకత్వం: హలితా షమీమ్
మూలాలు
మార్చు- ↑ NTV-Telugu News (7 March 2021). "రివ్యూ: నారింజ మిఠాయి మూవీ". NTV-Telugu News. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.