నార్కోండం ద్వీపం
నార్కోండం అండమాన్ సముద్రంలో ఉన్న ఒక చిన్న అగ్నిపర్వత ద్వీపం. ద్వీపం శిఖరం సగటున సముద్ర మట్టానికి 710 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఇది ఆండసైట్‌తో ఏర్పడింది. ఇది అండమాన్ దీవులలో భాగం, వీటిలో ప్రధాన భాగం సుమారు దీవులకు పశ్చిమాన 124 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ద్వీపం విస్తీర్ణం సుమారు 6.8 చదరపు కిలోమీటర్లు.[6] జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ఒక నిద్రాణ అగ్నిపర్వతంగా వర్గీకరించింది.
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | బంగాళాఖాతం |
అక్షాంశ,రేఖాంశాలు | 13°27′N 94°16′E / 13.45°N 94.27°E |
ద్వీపసమూహం | అండమాన్ నికోబార్ ద్వీపాలు |
ప్రక్కన గల జలాశయాలు | హిందూ మహాసముద్రం |
మొత్తం ద్వీపాలు | 1 |
ముఖ్యమైన ద్వీపాలు |
|
విస్తీర్ణం | 7.63 కి.మీ2 (2.95 చ. మై.)[1] |
పొడవు | 4 km (2.5 mi) |
వెడల్పు | 3.0 km (1.86 mi) |
తీరరేఖ | 12.22 km (7.593 mi) |
అత్యధిక ఎత్తు | 710 m (2,330 ft)[2] |
నిర్వహణ | |
District | ఉత్తర, మధ్య అండమాన్ |
ద్వీప సమూహం | అండమాన్ దీవులు |
ద్వీప ఉప సమూహం | ఈస్ట్ వొల్కానో ఐలాండ్స్ |
తహసీల్ | దిగిలిపూర్ తహసీల్ |
అతిపెద్ద ప్రాంతము | నార్కోండం పోలీసు స్టేషన్ (pop. 16) |
జనాభా వివరాలు | |
జనాభా | 16 (2016) |
జన సాంద్రత | 2.1 /km2 (5.4 /sq mi) |
జాతి సమూహాలు | హిందూ, అండమానీయులు |
అదనపు సమాచారం | |
సమయం జోన్ | |
PIN | 744202[3] |
Telephone code | 031927 [4] |
ISO code | IN-AN-00[5] |
అక్షరాస్యత | 84.4% |
Avg. summer temperature | 30.2 °C (86.4 °F) |
Avg. winter temperature | 23.0 °C (73.4 °F) |
లింగ నిష్పత్తి | 1.2♂/♀ |
Census Code | 35.639.0004 |
Official Languages | Hindi, English |
పేరు వ్యుత్పత్తి
మార్చునార్కోండం అనే పేరు నరక కుండం (తమిళ పదం నరక కుండ్రం [7],[7] ) అనే పేరు నుండి ఉద్భవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే బారెన్ ద్వీపం అనే పేరుకు దీనికీ మధ్య ఉన్న తికమక వలన కూడా ఈ పేరు వచ్చి ఉండవచ్చు.
చరిత్ర
మార్చు1986 వరకు బర్మా ఈ ద్వీపంపై సార్వభౌమాధికారం ఉన్నట్లు ప్రకటించుకునేది. అండమాన్ సముద్రం, కోకో ఛానల్, బంగాళాఖాతాల్లో భారత, మయన్మార్ దేశాల మధ్య సరిహద్దును ఇరుదేశాలూ గుర్తించినపుడు, మన్మార్ ఈ వాదనను వదులుకుంది.[8][9] నార్కొండం లోని వాలులపై ఒక లైట్ హౌస్ ఉంది, దీన్ని 1983 లో స్థాపించారు.[10]
భౌగోళికం
మార్చుఈ ద్వీపం పోర్ట్ బ్లెయిర్ నుండి ఈశాన్యంగా 256 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుండి నైౠతి దిశలో సుమారు 150 కి.మీ.దూరంలో చురుకైన అగ్నిపర్వత ద్వీపం, బ్యారెన్ ద్వీపం ఉంది. నార్కోండం ద్వీపం బర్మా నుండి 160 మైళ్ళ దూరంలో ఉంది, విశాఖపట్నం నుండి దాదాపు 800 మైళ్ళ దూరంలో ఉంది. ఇది తూర్పు అగ్నిపర్వత దీవులకు చెందినది. ఈ ద్వీపం విస్తీర్ణం 7.63 కి.మీ2 (2.95 చ. మై.) . ఈ ద్వీపంలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంది. ఇది అగ్నిపర్వతం నుండి ఏర్పడింది. ఇది 2005 జూన్ 8 వరకు చురుకుగా లేదు. ఆ రోజున అగ్నిపర్వతం నుండి "మట్టి, పొగ" బయటకు వచ్చినట్లు నివేదికలు వచ్చాయి. 2004 హిందూ మహాసముద్రం భూకంపం కారణంగాశిలాద్రవం భూగర్భంలోకి వెళ్ళి ఉంటుంది. ప్రస్తుత కార్యకలాపాలకు దానికీ సంబంధముందని భావిస్తున్నారు. ఈ నివేదికలు సరైనవే అయితే నార్కోండం అగ్నిపర్వత స్థితిని క్రియాశీలంగా మారుస్తుంది. నార్కొండం ద్వీపం అండమాన్ నికోబార్ దీవుల తూర్పు కొనన ఉంది.
నార్కోండం పర్వతం
మార్చునార్కాండం ద్వీపపు అగ్నిపర్వతం, 710 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది అండమాన్ నికోబార్ దీవుల లోని ఎత్తైన ప్రదేశాల్లో రెండోది. మొదటిది సాడిల్ పీక్, ఉత్తర అండమాన్ ద్వీపం. దాని ఎత్తు 752 మీటర్లు.
అడ్మినిస్ట్రేషన్
మార్చునార్కోండం ద్వీపం ఉత్తర, మధ్య అండమాన్ జిల్లాకు చెందినది. ఇది డిగ్లిపూర్ తాలూకాలో భాగం.[11] గ్రామం పోలీస్ స్టేషనుకు సమీపంలో ఉంది.
జనాభా
మార్చుద్వీపంలో ఒకే ఒక్క గ్రామం ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ ద్వీపంలో ఒకే ఒక్క గృహం ఉంది. అక్షరాస్యత 100%.[12]
మొత్తం | పురుషుడు | స్త్రీ | |
---|---|---|---|
జనాభా | 16 | 16 | 0 |
6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు | 0 | 0 | 0 |
షెడ్యూల్డ్ కులాలు | 0 | 0 | 0 |
షెడ్యూల్డ్ తెగలు | 16 | 16 | 0 |
అక్షరాస్యులు | 16 | 16 | 0 |
కార్మికులు (అందరూ) | 16 | 16 | 0 |
ప్రధాన కార్మికులు (మొత్తం) | 16 | 16 | 0 |
16 మంది నివాసితులు (అందరూ పర్యవేక్షక పోలీసు సిబ్బందే) అందరూ ఈశాన్య మూలలో ఉన్న ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. వారు కొబ్బరికాయలు, అరటిపండ్లను పోస్టు దగ్గరే ఉన్న ఒక చిన్న తోటలో పండిస్తారు.
చిత్ర గ్యాలరీ
మార్చు-
నార్కోండం ద్వీపం దక్షిణ దృశ్యం
-
ద్వీపం స్థలాకృతి
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Islandwise Area and Population - 2011 Census" (PDF). Government of Andaman. Archived from the original (PDF) on 2017-08-28. Retrieved 2020-02-21.
- ↑ మూస:Cite enroute
- ↑ "A&N Islands - Pincodes". 2016-09-22. Archived from the original on 2014-03-23. Retrieved 2016-09-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "code". Archived from the original on 2019-10-17. Retrieved 2020-02-21.
- ↑ Registration Plate Numbers added to ISO Code
- ↑ Yahya, H. S. A.; Zarri, A. A. (2002). "Status, ecology and behaviour of Narcondam Hornbill (Aceros narcondami) in Narcondam Island, Andaman and Nicobar Islands, India". J. Bombay Nat. Hist. Soc. 99 (3): 434–445.
- ↑ 7.0 7.1 Washington, H. S. (1924-06-01). "The lavas of Barren Island and Narcondam". American Journal of Science. s5-7 (42): 441–456. doi:10.2475/ajs.s5-7.42.441.
- ↑ Charney, Jonathan I. & Alexander, Lewis M.; International maritime boundaries, Volumes 2-3; American Society of International Law, Report 6-3, pg. 1329-1336; Martinus Nijhoff Publishers, 1998
- ↑ Book
- ↑ "Government of India, Directorate General of Lighthouses and Lightships". www.dgll.nic.in. Retrieved 2016-10-18.
- ↑ "Tehsils" (PDF). Archived from the original (PDF) on 2017-08-28. Retrieved 2020-02-21.
- ↑ 12.0 12.1 "District Census Handbook - Andaman & Nicobar Islands" (PDF). 2011 Census of India. Directorate of Census Operations, Andaman & Nicobar Islands. Retrieved 2015-07-21.