నార్గిస్ మొహమ్మది

ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మది మొహమ్మదికి 2023 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది[1]. ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కోసం కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ 2023 అక్టోబర్ 6వ తేదీన ప్రకటించింది[2]. నోబెల్ బహుమతి గెలిచిన 19వ మహిళ అయిన నార్గిస్ ప్రస్తుతం జైలులో ఉన్నారు[3]. ప్రస్తుతం జైల్లో ఉన్న మొహమ్మది తోటి నోబెల్‌ పురస్కార విజేత షిరిన్‌ ఎబడి నెలకొల్పిన మానవ హక్కుల పరిరక్షకుల కేంద్రానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె 13సార్లు అరెస్టయ్యారు[4]. ఐదుసార్లు శిక్షకు గురయ్యారు[5]. మొత్తం 31 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. మరణ శిక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గాను 2015లో ఆమె మరోసారి అరెస్టయ్యారు. కొద్ది సంవత్సరాలు కారాగారవాసాన్ని అనుభవించారు. కటకటాల వెనుక బందీగా ఉన్నప్పటికీ ఆందోళనలు యధావిధిగా కొనసాగడంలో మొహమ్మది సహకరించారని నోబెల్‌ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.

మూలాలు :

  1. Velugu, V6 (2023-10-07). "జైలులో ఉన్న ఇరాన్ హక్కుల కార్యకర్తకు శాంతి నోబెల్". V6 Velugu. Retrieved 2023-10-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ABN (2023-10-06). "Nobel peace prize: ఇరాన్ మానవహక్కుల పోరాట యోధురాలికి నోబెల్ శాంతి బహుమతి". Andhrajyothy Telugu News. Retrieved 2023-10-10.
  3. "Nobel | ఇరాన్‌ హక్కుల కార్యకర్త నార్గిస్‌కు నోబెల్‌ శాంతి పుర‌స్కారం.. మహిళల అణచివేతపై జైలు నుంచే పోరాటం!". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-10-06. Retrieved 2023-10-10.
  4. Desk 13, Disha Web (2023-10-06). "Nobel Peace Prize 2023: జైల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్తకు నోబెల్." www.dishadaily.com. Retrieved 2023-10-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Sundari, Naga (2023-10-08). "Nobel to Mohammadi Narges: మొహ్మది ..ఇరాన్ మహిళల స్వేచ్ఛా గళం". Telugu Prabha Telugu Daily (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-10-10.