నార్త్ మాసిడోనియాలో హిందూమతం

నార్త్ మాసిడోనియాలో హిందూమతం ప్రధానంగా హరే కృష్ణ ఉద్యమం (ఇస్కాన్), సత్యసాయి బాబా సంస్థల ద్వారా ప్రాచుర్యంలో ఉంది. ఇస్కాన్, సత్య సాయి బాబా-సెంటర్ ప్రాచ్య మతంలో భాగంగా మాసిడోనియాలో నమోదయ్యాయి. [1]

నార్త్ మాసిడోనియాలో హరేకృష్ణ ఉద్యమం

మార్చు

ఇస్కాన్ చట్టబద్ధంగా నమోదు చేయబడిన సంస్థ. మాసిడోనియాలో మతపరమైన మైనారిటీగా గుర్తింపు పొందింది. ప్రధాన కేంద్రం స్కోప్యేలో ఉంది. దేశవ్యాప్తంగా దీనికి అనుచరులున్నారు. దీని మొదటి కేంద్రాన్ని 1988లో ప్రారంభించింది. స్థానిక సభ్యులే కాకుండా మాజీ యుగోస్లావ్ దేశాల నుండి కూడా భక్తులు తరచుగా సందర్శిస్తారు. వీరి సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.

మాసిడోనియాలో, వివిధ మత సంస్థలు సమావేశమయ్యే సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు హరేకృష్ణ భక్తులను క్రమం తప్పకుండా ఆహ్వానిస్తాయి. మరణించిన ప్రెసిడెంట్ ట్రాజ్కోవ్స్కీ ఇతర మత సమూహాల నాయకులను కలిసిన ప్రతిసారీ హిందూ సంస్థల సభ్యులను కూడా ఆహ్వానించేవాడు. [2]

మాసిడోనియాలోని సత్యసాయి బాబా సంస్థ

మార్చు

సత్యసాయి బాబా ఆర్గనైజేషన్ కూడా చట్టబద్ధంగా నమోదైన సంస్థ. మాసిడోనియాలో మతపరమైన మైనారిటీగా గుర్తింపు పొందింది. మాసిడోనియన్ సత్యసాయి ఉద్యమం, హరేకృష్ణ ఉద్యమం వలెనే, 1980ల చివరలో ఉనికి స్థాపించుకుంది. ఆ సమయంలో స్కోప్యేలో ఒక సమూహం ఏర్పడింది. ఇప్పుడు సత్యసాయి సంస్థకు స్కోప్యేలో మూడు కేంద్రాలు ఉన్నాయి. స్టిప్‌లో ఒక చిన్న సమూహం ఉంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో సానుభూతిపరులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. facta.junis.ni.ac.rs pdf[dead link]
  2. "WWRNews". Archived from the original on 2007-09-30. Retrieved 2007-02-27.

బాహ్య లంకెలు

మార్చు