నార్నౌల్

హర్యానా రాష్ట్రం లోని పట్టణం

నార్నౌల్ హర్యానా రాష్ట్రం లోని పట్టణం. ఇది మహేంద్రగఢ్ జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పాలనను పురపాలక మండలి నిర్వహిస్తుంది. నార్నౌల్ భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతంలో ఉంది .

నార్నౌల్
పట్టణం
నార్నౌల్ is located in Haryana
నార్నౌల్
నార్నౌల్
హర్యానా పటంలో నార్నౌల్ పట్టణ స్థానం
Coordinates: 28°02′40″N 76°06′20″E / 28.04444°N 76.10556°E / 28.04444; 76.10556
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యాణా
జిల్లామహేంద్రగఢ్
Elevation
318 మీ (1,043 అ.)
జనాభా
 (2011)
 • Total1,45,897
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+05:30 (IST)
Postal code of India
123001
ప్రాంతపు కోడ్01282
ISO 3166 codeIN-HR
లింగ నిష్పత్తి901 /

భౌగోళికం

మార్చు

నార్నౌల్ 28°02′N 76°07′E / 28.04°N 76.11°E / 28.04; 76.11 నిర్దేశాంకాల వద్ద,[1] సముద్ర మట్టం నుండి 300 మీటర్ల ఎత్తున ఉంది. జిల్లాలో ఇనుప ఖనిజం, రాగి ఖనిజం, బెరిల్, టూర్‌మలైన్, ముస్కోవైట్, బయోటైట్, ఆల్బైట్, కాల్సైట్, క్వార్ట్జ్ వంటి ఖనిజ వనరులు ఉన్నాయి.

చరిత్ర

మార్చు

మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో బ్రిటిషు పాలకులకు భారతీయ స్థానికులకూ మధ్య 1857 నవంబరు 16 న నార్నౌల్ యుద్ధం జరిగింది. దీన్ని నసీబ్‌పూర్ యుద్ధం అని కూడా పిలుస్తారు 1857 లో, ప్రాణ్ సుఖ్ యాదవ్‌తో పాటు రేవారీకి చెందిన రావు తులా రామ్, ఆవాకు చెందిన కుశాల్ సింగ్ బ్రిటిష్ వారితో నార్నౌల్ సమీపంలోని నసీబ్‌పూర్ గ్రామం వద్ద తలపడ్డారు. భారత స్వాతంత్ర్య మొదటి యుద్ధం లోని అత్యంత భయంకరమైన యుద్ధాలలో ఇదొకటి.[2] ఈ యుద్ధంలో బ్రిటిషు వారు 70 మంది సైనికులను వారి కమాండర్లు కల్నల్ గెరార్డ్, కెప్టెన్ వాలెస్‌లను కోల్పోయారు. 40 మంది బ్రిటిషు సైనికులు, అధికారులు కెప్టెన్ క్రెయిజ్, కెప్టెన్ కెన్నెడీ, కెప్టెన్ పియర్స్ గాయపడ్డారు. ఆవాకు చెందిన కుశాల్ సింగ్‌తో చేసిన యుద్ధంలో కల్నల్ గెరార్డ్ గాయపడి మరణించాడు.[3][4] తరువాత, ప్రాణ్ సుఖ్ యాదవ్ నిహల్పురా గ్రామంలో స్థిరపడి, చనిపోయిన సైనికుల బంధువులకు పునరావాసం కల్పించాడు.

గుర్‌గావ్ జిల్లాలోని నంగల్ పఠాని గ్రామానికి చెందిన రావు క్రిషన్ గోపాల్, మీరట్ కొత్వాలుగా ఉండేవాడు. అతడు బల్లభగఢ్‌కు చెందిన రాజా నహర్ సింగ్, ఝజ్జర్ నవాబు, మేవాట్ కు చెందిన రావు షహామత్ ఖాన్ లతో కలిసి దేశభక్తులను సమీకరించి బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో పాల్గొని ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ నసీబ్‌పూర్ యుద్ధంలో అతను, అతని తమ్ముడు రావు రామ్ లాల్‌లు మరణించారు.[5]

జనాభా

మార్చు

2001 జనగణన ప్రకారం,[6] నార్నౌల్ జనాభా 74,581. జనాభాలో పురుషులు 53% స్త్రీలు 47%. నార్నౌల్ అక్షరాస్యత 68%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 76% ఉండగా, స్త్రీలలో 58% ఉంది. నార్నౌల్‌ జనాభాలో 14% మంది 6 సంవత్సరాల లోపు వయస్సు గలవారు.

శీతోష్ణస్థితి

మార్చు

నార్నౌల్‌లో శీతాకాలంలో ఉష్ణోగ్రత -3 °C వరకు పడిపోతుంది. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత 50 °C వరకు వెళ్తుంది [7]

శీతోష్ణస్థితి డేటా - Narnaul (1981–2010, extremes 1965–2005)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 30.6
(87.1)
34.5
(94.1)
41.0
(105.8)
44.0
(111.2)
48.1
(118.6)
48.4
(119.1)
45.0
(113.0)
43.0
(109.4)
41.0
(105.8)
40.5
(104.9)
37.6
(99.7)
30.6
(87.1)
48.1
(118.6)
సగటు అధిక °C (°F) 20.7
(69.3)
24.3
(75.7)
30.7
(87.3)
37.2
(99.0)
40.7
(105.3)
41.3
(106.3)
36.4
(97.5)
34.5
(94.1)
35.4
(95.7)
33.5
(92.3)
28.8
(83.8)
23.2
(73.8)
32.2
(90.0)
సగటు అల్ప °C (°F) 4.8
(40.6)
7.1
(44.8)
12.6
(54.7)
18.9
(66.0)
24.3
(75.7)
26.3
(79.3)
25.4
(77.7)
24.7
(76.5)
23.0
(73.4)
17.4
(63.3)
11.3
(52.3)
6.2
(43.2)
16.8
(62.2)
అత్యల్ప రికార్డు °C (°F) 0.0
(32.0)
0.1
(32.2)
2.0
(35.6)
9.8
(49.6)
11.5
(52.7)
11.0
(51.8)
17.0
(62.6)
18.6
(65.5)
14.3
(57.7)
9.3
(48.7)
0.1
(32.2)
−0.9
(30.4)
−0.9
(30.4)
సగటు వర్షపాతం mm (inches) 13.4
(0.53)
12.2
(0.48)
8.0
(0.31)
4.7
(0.19)
34.0
(1.34)
55.2
(2.17)
149.8
(5.90)
101.3
(3.99)
30.6
(1.20)
11.1
(0.44)
2.3
(0.09)
6.5
(0.26)
429.1
(16.89)
సగటు వర్షపాతపు రోజులు 0.8 1.2 0.6 0.5 2.3 3.3 6.1 4.8 1.9 0.9 0.2 0.4 22.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 47 45 36 33 37 39 55 65 55 55 43 45 46
Source: India Meteorological Department[8][9]

మూలాలు

మార్చు
  1. Falling Rain Genomics, Inc - Narnaul
  2. "Tribune India". Tribune India. 3 December 2007. Retrieved 12 October 2014.
  3. "The Central India Campaign". Archived from the original on 2006-04-04. Retrieved 2020-11-18.
  4. Dr Malti Malik, History of India, p. 356.
  5. 1981, Haryana Review, Volume 15, p. 29.
  6. "Census of India 2001: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  7. http://www.ndtv.com/article/cities/a-town-in-haryana-records-minus-3-degrees-314099
  8. "Station: Narnaul Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 541–542. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 1 March 2020.
  9. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M66. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 1 March 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=నార్నౌల్&oldid=3554681" నుండి వెలికితీశారు