నిండు మనసులు 1967లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.డి. లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, దేవిక, రాజనాల, ఎల్.విజయలక్ష్మి, వాణిశ్రీ తదితరులు నటించగా, టి.వి. రాజు సంగీతం అందించారు.

నిండు మనసులు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.డి. లాల్
నిర్మాణం యం. జగన్నాధరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
రాజనాల, ఎల్.విజయలక్ష్మి,
వాణిశ్రీ
సంగీతం టి.వి. రాజు
నిర్మాణ సంస్థ ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్
భాష తెలుగు

రాజు (ఎన్.టి.ఆర్) కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని సహించని వ్యక్తి. అనుకోని పరిస్థితులలో దొంగలతో చేతులు కలిపి దొంగగా మారవలసివస్తుంది. దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆపదలో ఉన్న సుశీలను కాపాడి తన ఆశ్రయము ఇస్తాడు. సుశీల మంచితనముతో మంచి మనిషిగా మారతాడు. తనను చంపాలనుకున్న వారిని కూడా తన ప్రాణాలను లెక్కచేయకుండా కాపాడి అందరికి దేవుడవుతాడు. దొంగలముఠా సుశీలను అపహరించుకుపోతే సుశీలను కాపాడటానికి వెళ్ళినప్పుడు జరిగిన ఘర్షణలో దొంగలముటా నాయకుడు శేషు, అతని సహచరురాలు రోజీ ఇద్దరు హత్యకు గురవుతారు. హత్య జరిగిన స్థలానికి వచ్చి పోలీసులు రాజు చేతిలో ఉన్న రివాల్వర్ చూసి అతనిని నిందితుడుగా భావించి కోర్టుకు హాజరుపరుస్తారు. శిక్ష పడే సమయానికి అసలు నేరస్తుడైన సుశీల తండ్రి రఘుపతి తాను చేసిన నేరాన్ని ఒప్పుకుని తన కూతురిని రాజుకు అప్పగిస్తాడు. రాజు నివసిస్తున్న కాలనీ వాళ్ళందరూ వారికి స్వాగతం పలికి నిండు మనస్సులతో వారిని ఆశీర్వదిస్తారు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: ఎస్.డి. లాల్
  • నిర్మాత: ఎం. జగన్నాథరావు
  • మాటలు: పినిశెట్టి

పాటలు

మార్చు
  1. ఆపద మొక్కులవాడా ఓ శ్రీనివాసా అడుగడుగున కాపాడే తిరుమల గిరివాసా శ్రీనివాసా - పి.సుశీల,రచన: సి నారాయణ రెడ్డి
  2. అయ్యయ్యయ్యో అదిరిపోతున్నాను అమ్మమ్మమ్మో నిన్ను విడిపోలేను - బి.గోపాలం, ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: సి నారాయణ రెడ్డి
  3. నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో - ఘంటసాల - రచన: దాశరథి కృష్ణమాచార్య
  4. చిక్కని చెక్కిలి నీది వెచ్చనికౌగిలి నాది కైపుతో నన్నూగనీ - ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: సి నారాయణ రెడ్డి
  5. లేలే లెమ్మన్నది రా రా రమ్మన్నిది కలలే ఏవొ కవ్వించు చెలి సొగసు - ఎల్. ఆర్. ఈశ్వరి , రచన: సి నారాయణ రెడ్డి
  6. నీవు నేనూ జాబిల్లి , ఘంటసాల, సుశీల,రచన: సి.నారాయణ రెడ్డి
  7. శ్రీశేష శైల సునికేతన దివ్యామూర్తే ,(సుప్రభాతం) పి సుశీల, రచన: ప్రతివాద భయంకర అన్నంగరా చార్య.

ఇతర వివరాలు

మార్చు
  1. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ కు ఒక్క పాట కూడా లేదు.
  2. ఎన్.టి.ఆర్. నడక ఈ చిత్రంలో ఆనాడు తీసిన సినిమాలన్నింటిలోకి వెరైటీగా, స్టైల్ గా ఉంది.

మూలాలు

మార్చు
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)