దేవిక (1943 - మే 2, 2002) ఒక తెలుగు సినిమా నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.[1]

దేవిక
జననం
ప్రమీలా దేవి

(1943-04-25)1943 ఏప్రిల్ 25
మద్రాస్, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం చెన్నై, తమిళనాడు, భారతదేశం)
మరణం2002 మే 2(2002-05-02) (వయసు 59)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయతఇండియన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1954–1986
జీవిత భాగస్వామి
దేవదాస్
(m. 1968; div. 1990)
పిల్లలుకనక (జ.1973)
బంధువులురఘుపతి వెంకయ్య నాయుడు (తాత)

బాల్యం, విద్యాభ్యాసం సవరించు

ఈమె అసలు పేరు ప్రమీలాదేవి. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతానికి చెందినది

సినిమాల్లో సవరించు

ఈమె ఎన్టీ రామారావుతో హీరోయిన్‌గా రేచుక్క అనే సినిమాలో తొలిసారి నటించారు. అత్తా ఒకింటి కోడలే, కంచుకోట, ఆడ బ్రతుకు సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఎన్.టి.రామారావు నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు కనక తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగు సినిమాకు ఆద్యునిగా భావించే రఘుపతి వెంకయ్య బంధువు. 2002 మే 2వ తేదీ తెళ్లవారు జామున మద్రాసులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అస్వస్థతతో మరణించింది.

రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలు పోషించింది. ముక్తా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ముదలలిలో నటించిన తర్వాత దేవిక సినీరంగంలో ప్రాచుర్యం పొందింది.[2]

చిత్ర సమాహారం సవరించు

మూలాలు సవరించు

  1. Blend of grace and charm Archived 2008-02-24 at the Wayback Machine - The Hindu మే 10, 2002
  2. Devika dead[permanent dead link] - The Hindu మే 2, 2002

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దేవిక&oldid=3927891" నుండి వెలికితీశారు