నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26
నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26 ఒక పాయింట్ అండ్ షూట్ కెమెరా. వాడుక సులభంగా ఉండటం వలన ఫోటోగ్రఫీని మొదలుపెట్టిన వారికి ఈ మోడల్ చాల ఉపయోగకరం. ఇది నికాన్ సంస్థ రూపొందించు కాంపాక్ట్ డిజిటల్, లైఫ్ సిరీస్ శ్రేణికి చెందిన కెమెరా.
రకం | కాంపాక్ట్ డిజిటల్ కెమేరా |
---|---|
కెమేరా సెన్సార్ | సీసీడీ |
గరిష్ఠ రిసల్యూషన్ | 230 కే |
కటకం | 5x Optical Zoom, నిక్కర్ లెంస్ |
ఫ్లాష్ | బిల్ట్ ఇన్ |
షట్టర్ | మెకానికల్, ఛార్జీ కపుల్డ్ ఎలక్ట్రానిక్ షట్టర్ |
ఫోకస్ ప్రాంతాలు | సెంటర్, ఫేస్ డిటెక్షన్ |
ఫిల్మ్ వేగం అవధి | 1/2000 - 1 సెకను |
Custom WB | ఆటో/క్లౌడీ/డేలైట్/ఫ్లాష్/ఫ్లోరోసెంట్/ఇన్ క్యాండిసెంట్/మ్యానువల్ |
నిల్వ | ఎస్ డీ, ఎస్ డీ హెచ్ సీ, ఎస్ డీ ఎక్స్ సీ |
బ్యాటరీ | AA NiMH (2) batteries |
బరువు | 164 గ్రా |
ఈ కెమెరాలో గల 21 షూటింగ్ మోడ్ లు ఛాయాచిత్రాలని చక్కగా బంధించటానికి అనుకూలిస్తాయి. ఎలెక్ట్రానిక్ వైబ్రేషన్ రిడక్షన్ ఫోటోలు నిలకడగా రావటానికి దోహదపడుతుంది. ఫేస్ డిటెక్షన్ ఫీచర్ ముఖాలని గుర్తిస్తుంది. స్మైల్ టైమర్ ఫంక్షన్ తో చిరునవ్వు కనబడగానే ఫోటో తీసేలా ఉపయోగించవచ్చును. బ్లింక్ ప్రూఫ్ మోడ్ తో రెప్ప వేసినప్పుడు ఫోటో తీయకుండా నిరోధించవచ్చును.
10 సెకన్ల వ్యవధి గల సెల్ఫ్ టైమర్ ఇందులో గలదు. కంటిన్యువస్ షూటింగ్ మోడ్ తో ఒకే సెకనులో వరుసగా నాలుగు ఫోటోలు తీయవచ్చును.
షూటింగ్ ఫీచర్లు
మార్చుఈజీ ఆటో మోడ్
మార్చుకెమెరాని పాయింట్ చేసినప్పుడు ఇమేజ్ అనుసారం ఆటోమాటిక్ గా మోడ్ ని ఎంపిక చేసుకొంటుంది
సీన్ మోడ్ సెటింగ్‌లు
మార్చు- పోర్ట్రెయిట్ - మనుషుల చిత్రాలని తీసేందుకు ఉపయోగించవచ్చును. డిజిటల్ జూంని వాడలేము
- ల్యాండ్ స్కేప్ - ప్రకృతి దృశ్యాలని చిత్రీకరించవచ్చును
- స్పోర్ట్స్ - క్రీడలలో ఫోటోలని తీయుటకు ఉపయోగపడుతుంది. షట్టర్ రిలీజ్ బటన్ ని నొక్కిపట్టినంతసేపూ కెమెరా ఫోటోలని తీస్తూనే ఉంటుంది
- నైట్ పోర్ట్రెయిట్ - రాత్రి సమయాలలో మనుషులను ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. మనుషుల వెనుక వేరే ఆబ్జెక్టులు గనక ఉంటే వాటి పైన వెలుతురు పడుతుండాలి. కెమెరా యొక్క ఫ్లాష్ ముందున్న మనుషులకి మాత్రమే పరిమితం. డిజిటల్ జూం వాడలేము.
- పార్టీ/ఇన్ డోర్ - గదులలో/పార్టీలలో క్యాండిల్ లైట్ ల వెలుతురులో ఫోటోలని తీయటానికి ఉపయోగపడుతుంది. కెమెరా కుదుపుల పట్ల జాగ్రత్త వహించాలి
- బీచ్ - సముద్రపు ఒడ్లపై సూర్యకాంతిలో ఉపయోగపడుతుంది
- స్నో - సూర్యకాంతిలో ప్రకాశించే మంచుని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
- సన్ సెట్ - సూర్యోదయం/సూర్యాస్తమయాలలో ఏర్పడు లోతైన రంగులని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
- డస్క్/డాన్ - సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత తక్కువగా ఉండే సహజమైన వెలుతురులో ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
- నైట్ ల్యాండ్స్కేప్ - షట్టర్ స్పీడ్ వేగాన్ని తగ్గించటంతో రాత్రి వేళల్లో వెలుగుతున్న ఆబ్జెక్టుల ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
- క్లోజ్ అప్ - పూలు, కీటకాలు లేదా ఇతర సూక్ష్మ విషయాలని దగ్గర నుండి ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
- ఫుడ్ - ఆహార వస్తువులని ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. ఫోటో తీసే సమయంలోనే ఆ పదార్థాల రంగులని కావలసినంత పెంచుకోవటం, తగ్గించుకోవటం చేయవచ్చును
- మ్యూజియం - ఫ్లాష్ కాంతిని ఉపయోగించకూడని ప్రదేశాలు (ఉదా: మ్యూజియం/ఆర్ట్ గ్యాలరీల లో) వాడవచ్చును. షట్టర్ రిలీజ్ బటన్ ని నొక్కి పట్టడంతో పది ఇమేజీల వరకు స్టోర్ చేసుకొనవచ్చును. వీటిలో అత్యున్నతమైనది ఆటోమెటిక్ గా (బెస్ట్ షాట్ సెలెక్టర్) ద్వారా ఎంపిక చేసుకొనవచ్చును.
- ఫైర్ వర్క్స్ షో - షట్టర్ స్పీడ్ వేగాన్ని తగ్గించబడి ఉంటుంది.
- బ్లాక్ అండ్ వైట్ కాపీ - వైట్ బోర్డు పై రాయబడిన/అచ్చు వేయబడిన/చిత్రీకరించిన వాటిని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది.
- బ్యాక్ లైటింగ్ - వెనుక నుండి వచ్చే కాంతి వలన ఏర్పడు నీడలని తొలగించటానికి, ఫిల్ ఫ్లాష్ని ఉపయోగిస్తుంది.
- పనోరమా అసిస్ట్ - ఒకే షాట్ లో రాని ఎత్తైన/వెడల్పైన చిత్రాలను ముక్కలు ముక్కలుగా తీసి సీడీలో లభ్యమగు సాఫ్టువేరు ద్వారా వాటిని ఒకే చిత్రంగా అతికించవచ్చును.
- పెట్ పోర్ట్రెయిట్ - పెంపుడు జంతువులని ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది.
స్మార్ట్ పోర్ట్రెయిట్ మోడ్
మార్చుషట్టర్ రిలీజ్ బటన్ నొక్కకుండానే ముఖం చిరునవ్వుతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫోటో తీయవచ్చును.
- ఇమేజ్ మోడ్ (సైజ్) లని మార్చుకొనవచ్చును
- స్కిన్ సాఫ్టెనింగ్ తో ముఖం పై నునుపు తేవచ్చును
- స్మైల్ టైమర్ తో షట్టర్ రిలీజ్ బటన్ నొక్కకుండానే ముఖం చిరునవ్వుతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫోటో తీయవచ్చును
- బ్లింక్ ప్రూఫ్ మోడ్ తో రెప్ప వేసినప్పుడు ఫోటో తీయకుండా నిరోధించవచ్చును. రెప్ప తెరచినప్పుడే ఫోటో వచ్చేట్టు చేయవచ్చును
ఆటో మోడ్
మార్చు- ఇమేజ్ మోడ్ (సైజ్) లని మార్చుకొనవచ్చును
- వైట్ బ్యాలెంస్ కంటి చూపుతో చూసినప్పుడు ఎంత వెలుగుతో కనిపిస్తుందో కచ్చితంగా అంతే వెలుగు (ఆటో, ప్రీసెట్ మ్యానువల్, డే లైట్, ఇన్ కాండిసెంట్, ఫ్లోరోసెంట్, క్లౌడీ, ఫ్లాష్) లో ఫోటో వచ్చేట్టు సరి చేసుకొనవచ్చును
- కంటిన్యువస్ - ఒకే షాట్ లో వరుసగా ఫోటోలు తీయవచ్చును (సింగిల్, కంటిన్యువస్, బీ ఎస్ ఎస్, మల్టీ-షాట్ 16)
- కలర్ ఆప్షంస్ - కలర్ టోన్ లని ఎంపిక చేసుకొనవచ్చును (స్టాండర్డ్ కలర్, వివిడ్ కలర్, బ్లాక్ అండ్ వైట్, సెపియా, సయనోటైప్)
ఫ్లాష్ మోడ్‌లు
మార్చు- ఆటో - కాంతి తక్కువగా ఉంటే, ఫ్లాష దానంతట అదే పనిచేస్తుంది
- ఆటో విత్ రెడ్ ఐ రిడక్షన్ - ఫ్లాష్ వలన ఫోటోల్లో కళ్ళలో అనవసరంగా ఏర్పడే ఎర్రని కాంతివలయాన్ని నిరోధించవచ్చును
- ఆఫ్ - ఫ్లాష్ అవసరము లేనప్పుడు ఉపయోగించవచ్చును
- ఫిల్ ఫ్లాష్ - నీడలను ప్రకాశవంతం చేయటానికి, వెనుక వైపు నుండి వచ్చే కాంతిని కట్టడి చేయటానికి ఉపయోగపడుతుంది.
- స్లో సింక్ - ఆటో ఫ్లాష్ మోడ్, స్లో షట్టర్ స్పీడ్ ల కలయిక. సాయంకాలం, రాత్రి వేళల్లో నేపథ్యంలో సీనరీలు గల పోర్ట్రెయిట్ లని చిత్రీకరించటానికి ఉపయోగపడుతుంది. ఫ్లాష్ మెయిన్ సబ్జెక్ట్ ని కాంతివంతం చేయగా, స్లో షట్టర్ స్పీడ్ వెనుక (చీకట్లో/తక్కువ కాంతిలో) ఉన్న సీనరీలని బంధించటానికి ఉపయోగపడుతుంది
సెల్ఫ్ టైమర్
మార్చుబటన్ ని నొక్కిన 10 సెకనులకి షట్టర్ రిలీజ్ అవుతుంది. స్వీయ చిత్ర పటాలని తీసుకొనటం కోసం, కెమెరా కదలకుండా ఉండటానికి ఉపయోగించకొనవచ్చును
ఇమేజ్ మోడ్ సెటింగ్స్
మార్చు- 2M 1600 X 1200 - కంప్రెషన్ రేషియో 1:8 ఉంటుంది
- 4M 2272 X 1704 - చాలా సందర్భాలలో ఉత్తమ ఎంపిక. కంప్రెషన్ రేషియో 1:8 ఉంటుంది
- 8M 3264 X 4228 - చాలా సందర్భాలలో ఉత్తమ ఎంపిక. కంప్రెషన్ రేషియో 1:8 ఉంటుంది
- 16M 4608 X 3456 (1) - చాలా సందర్భాలలో ఉత్తమ ఎంపిక. కంప్రెషన్ రేషియో 1:8 ఉంటుంది
- 16M 4608 X 3456 (2) - 16M (1) కంటే ఎక్కువ నాణ్యత గలది. కంప్రెషన్ రేషియో 1:4 ఉంటుంది
- VGA 640 X 480 - TV స్క్రీను పై చూడటానికి, ఈ-మెయిల్ లో పంపటానికి ఉపయోగపడుతుంది. కంప్రెషన్ రేషియో 1:8
- 16:9 12M 4608 X 2952 - కంప్రెషన్ రేషియో 1:8
సాంపుల్ ఫోటోలు
మార్చు-
నెల్లియాంపతికి వెళ్ళే దారిలో మేఘాలను తాకే పర్వత శిఖరాలు
-
నెల్లియాంపతికి వెళ్ళే దారి ప్రక్కనే కనబడు ఎత్తిపోతలలో ఒక భాగము
-
నెల్లియాంపతి లోని గ్రీన్ ల్యాండ్ రిసార్ట్స్ లో విచిత్రమైన మొక్క
-
నెల్లియాంపతిలో సీతరగుండు వ్యూ పాయింట్ కి వెళ్ళే దారిలో నున్న వృక్షాలు
-
కన్యాకుమారిలో తిరువల్లువర్ విగ్రహానికి కుడి ప్రక్కన జరిగే సూర్యోదయము
-
కన్యాకుమారిలో సూర్యాస్తమయము
-
కే ఆర్ పుర (బెంగుళూరు) సస్పెంషన్ బ్రిడ్జి
-
కృష్ణ రాజ పుర రైల్వే స్టేషను వద్ద నుండి సస్పెంషన్ బ్రిడ్జి
-
ఒక ఇంటిలో పూజ గది
-
వైట్ ఫీల్డ్ (బెంగుళూరు) లో ఉన్న ఫోరం వ్యాల్యూ మాల్
-
మహదేవపుర (బెంగుళూరు) లో ఉన్న ఫినిక్స్ మార్కెట్ సిటీ
-
పగటి వెలుగులో ఫినిక్స్ మార్కెట్ సిటీ
-
కొచ్చి లోని పడముగల్ ప్రదేశ పానోరామికి వ్యూ
బాహ్య లంకెలు
మార్చు- నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26 ప్రత్యేకతలు Archived 2016-03-04 at the Wayback Machine