నిక్ వాలెండా

నిక్ వాలెండా (జననం: 1979 జనవరి 24) ఒక అమెరికన్ ఆక్రోబాట్, ఏరియలిస్ట్, డేర్డెవిల్, హై-వైర్ కళాకారుడు, రచయిత. ఇతను భద్రతా వలయం లేకుండా తన హై-వైర్ ప్రదర్శనల ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఇతను తొమ్మిది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కలిగి ఉన్నాడు, ముఖ్యంగా 2012 జూన్ 15 న నయాగరా జలపాతంపై నేరుగా కట్టబడిన టైట్‌రోప్‌పై నడిచిన మొదటి వ్యక్తి, అయితే చట్టం సూచించిన మేరకు భద్రత కొరకు జాగ్రతలు తీసుకున్నాడు. ఇతను 2014 నవంబరు 2న 454 అడుగుల ఎత్తయిన రెండు భవంతుల మధ్య వేలాడదీసిన తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా నడిచి చరిత్ర సృష్టించాడు. షికాగో నదికి ఒకవైపునున్న భవంతి నుంచి మరొకవైపున ఉన్న భవంతికి ఆరున్నర నిమిషాల వ్యవధిలో చేరుకుని నేరుగా, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూస్తున్న ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తాడు. ఈ సాహసానికి ముందు మెరీనా సిటీ టవర్స్ మధ్యలో 1.17 నిమిషాల వ్యవధిలో కళ్లకు గంతలు కట్టుకుని తాడుపై నడిచి మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు.

నిక్ వాలెండా
Nik-Wallenda-Skyscraper-Live.jpg
నవంబరు 2, 2014న చికాగో లో ఆకాశహర్మ్యం వద్ద ప్రత్యక్ష విలేకరుల సమావేశంలో వాలెండా
జననం (1979-01-24) 1979 జనవరి 24 (వయస్సు 43)
సారాసోటా, ఫ్లోరిడా, యు.ఎస్.
ఇతర పేర్లుద కింగ్ ఆఫ్ ద వైర్ (మారుపేరు)[1]
వృత్తిశ్రమజీవి, డేర్డెవిల్ (ముందు వెనుకలు ఆలోచించకుండా సాహసం చేయుట), హై వైర్ కళాకారుడు
క్రియాశీల సంవత్సరాలు1992-ప్రస్తుతం
సుపరిచితుడువల లేకుండా హై-వైర్ చర్య
జీవిత భాగస్వామిఇరేందిర (1999-ప్రస్తుతం)
తల్లిదండ్రులుడేలిలా వాలెండా, టెర్రీ ట్రోఫ్ఫర్
బంధువులుకార్ల్ వాలెండా (ముత్తాత)
వెబ్‌సైటుnikwallenda.com

నయాగరా జలపాతంపైసవరించు

 
టైట్ రోప్ పై నడుస్తూ నయాగరా జలపాతాన్ని దాటుతున్న నిక్ వాలెండా

2012 జూన్ 15న హై వైరు కళాకారుడు నిక్ వాలెండా 116 సంవత్సరాల తరువాత రెండు ప్రభుత్వాల నుండి అనుమతి తీసుకుని ఈ విన్యాసం ద్వారా నయాగరా జలపాతం దాటిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆయన టైట్ రోప్ పొడవు మొత్తం 1,800 అడుగులు. వాలెండా బ్రింక్ సమీపంలో హార్స్ షూ జలపాతం వద్ద ఈ విన్యాసం ప్రదర్శించాడు.

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

  • సాక్షి దినపత్రిక - 04-11-2014
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Today అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; prepares అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు