నికోలస్ జేమ్స్ వుజిసిక్ (/ˈvɔɪɪ/ VOY-chitch;[1] జననం: 1982 డిసెంబరు 4)[2][3] ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు. ఇతను ఫొకొమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్ళు, చేతులు లేకుండానే పుట్టాడు.[4]

నిక్ వుజిసిక్
జర్మనీలో ఎరింగ్‌షాన్ చర్చిలో ఉపన్యాసిస్తున్న నిక్ (2011)
జననం
నికోలస్ జేమ్స్ వుజిసిక్

(1982-12-04) 1982 డిసెంబరు 4 (వయసు 42)
మెల్‌బోర్న్, విక్టోరియల్, ఆస్ట్రేలియా
పౌరసత్వంఆస్ట్రేలియా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
విద్యబ్యాచిలర్స్ డిగ్రీ
విద్యాసంస్థగ్రిప్ఫిత్ విశ్వవిద్యాలయం
వృత్తి
  • మత ప్రచారకుడు
  • ప్రాత్సాహం అందిచే వక్త
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
కానే మియహర
(m. 2012)
పిల్లలు4
బంధువులుBR.Aaron vujicic, sis.Michelle vujicic
వెబ్‌సైటుnickvujicic.com

ప్రారంభ జీవితం

మార్చు

వుజిసిక్ 1982 డిసెంబరు 4న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో దుసంక, బోరిస్లావ్ వుజిసిక్ దంపతులకు జన్మించాడు. వారి కుటుంబం యుగోస్లేవియా నుండి సెర్బియన్ వలసదారులు.[5][6] అతను రెండు కాళ్ళు, చేతులు లేకుండా టెట్రా అమీలియా అనే అరుదైన వ్యాధితో జన్మించాడు. అతని జీవిత చరిత్ర ప్రకారం అతను అరుదైన వ్యాధితో జన్మించినందున అతని తల్లి ఆ స్థితిలో అతనిని తీసుకోవడానికి, ఎత్తుకోవడానికి నిరాకరించింది. తరువాత అతని తల్లిదండ్రులు పరిస్థితులను అర్థం చేసుకొని అతనిని తీసుకోవడానికి అంగీకరించారు. ఆ పరిస్థితిని "వారి కొడుకు కోసం దేవుని ప్రణాళిక" గా వారు అర్థం చేసుకొన్నారు.[7]

అతను రెండు చిన్న, వైకల్య పాదాలను కలిగి ఉన్నందున, వాటి ఆకారం కారణంగా వాటిని అతను "చికెన్ డ్రమ్‌ స్టిక్" అని పిలిచేవాడు.[8] వాస్తవంగా అతని "చికెన్‌ డ్రమ్‌ స్టిక్" గా పిలిచే అతని పాదాల వ్రేళ్ళు కలిసిపోయాయి. వాటిని విడదీయడానికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. దీని వల్ల అతను వస్తువులను పట్టుకోవటానికి, పుస్తకంలోని పేజీని తిప్పడానికి, ఇతర పనులకు చేయడానికి వ్రేళ్ళుగా ఉపయోగించవచ్చు[9]. అతను తన పాదాన్ని విద్యుత్ చక్రాల కుర్చీని నడపడానికి, కంఫ్యూటర్, మొబైల్ ఫోన్‌ లను ఉపయోగించడానికి వినియోగిస్తాడు . వుజిసిక్ ఆత్మహత్యాయత్నం చేసాడు కానీ "అద్భుతంగా సాధారణ బాల్యం" తనకు ఉన్నట్లు తెలియజేసాడు[ఆధారం చూపాలి].

ఇతను కాళ్ళు, చేతులు లేకపోయినా తండ్రి సాయంతో ఐదేళ్ల వయసులోనే ఈత నేర్చుకున్నాడు, అంతేకాకుండా సముద్రంపై సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు. బాల్యంలో తన తల్లి చేతుల్లో మామూలు పిల్లవాడిలాగేనే పెరిగిన తను సమాజంలో మామూలు వ్యక్తిగా ఎదగడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. నోటిలో పెన్ను పెట్టుకొని రాయడం నేర్చుకున్నాడు. గొంతు కింద గోల్ఫ్‌స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నాడు

వుజిసిక్ తన కౌమర దశ, యవ్వన దశలలో అనేక వేధింపులకు గురైనప్పటికీ అభివృద్ధి చెందాడు. అతను 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని తల్లి అనేక వైకల్యాలతో బాధపడుతూ అభివృద్ధి చెందిన ఒక వ్యక్తిని గూర్చి ఒక వార్తాపత్రికలో కథనాన్ని అతనికి చూపించింది. అతను తన ప్రార్థన సమూహంలో చర్చలు చేయడం ప్రారంభించాడు. [10] అతను తన 21వ సంవత్సరంలో గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుండి అకౌంటెన్సీ, ఆర్థిక ప్రణాళిక అంశాలలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు.

2005లో "లైఫ్ వితౌట్ లింబ్స్‌"[11] అనే లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాడు. 2007లో "ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్" అనే ప్రేరణనందించే ప్రసంగాలనిచ్చే కంపెనీని స్థాపించాడు[12].

అతను "ద బటర్‌ఫ్లై సర్కస్" అనే లఘు చిత్రంలో నటించాడు.[13] 2010లో మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ లో షార్ట్ ఫిలింలో ఉత్తమ నటునిగా ఎంపికయ్యాడు.[14]

2011లో ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ సంస్థ ద్వారా "సమ్‌థింగ్ మోర్" అనే మ్యూజికల్ వీడియోను వుజిసిక్ విడుదల చేసాడు[15][16].

వ్యక్తిగత జీవితం

మార్చు

2002 మార్చి 9న అతను కాలిఫోర్నియాకు మారాడు. 2008 లో డల్లాస్ కు సమీపంలోని మిక్‌కిన్నీ లో కానే మియహరాను కలిసాడు. వారు 2012 ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు[17]. వారికి నలుగురు పిల్లలు.[18][19][20][21] వారు దక్షిణ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. [22]

పుస్తకాలు, ప్రచురణలు

మార్చు

వుజిసిక్ మొదటి పుస్తకం "లైఫ్ వితౌట్ లిమిట్స్" రాండం హౌస్ ద్వారా 2010లో ప్రచురితమైనది. ఇది 30 భాషలలో అనువాదమయింది. [23]

  • Life Without Limits: Inspiration of a Ridiculously Good Life (2010); ISBN 978-0307589743
  • Your Life Without Limits (2012); ISBN 978-0307731043
  • Limitless: Devotions for a Ridiculously Good Life (2013); ISBN 978-0307730916
  • Unstoppable: The Incredible Power of Faith in Action (2013); ISBN 978-0307730893
  • The Power of Unstoppable Faith (2014); ISBN 978-1601426765
  • Stand Strong (2015); ISBN 978-1601427823
  • Love Without Limits (2016); ISBN 978-1601426185
  • Be the Hands and Feet: Living Out God's Love for All His Children, February 13, 2018; ISBN 978-1601426208

మూలాలు

మార్చు
  1. "Overcoming hopelessness" యూట్యూబ్లో
  2. Vujicic, Nick. "Nick Vujicic: Spreading Hope Worldwide". Nickvujicic.com. Retrieved 9 March 2016.
  3. "Life Without Limbs: About Nick Vujicic". Retrieved 28 September 2009.
  4. Born without arms and legs at BBC; published 23 February 2011; retrieved 18 November 2015.
  5. "Nick Vujicic – The Man Who Has Inspired Millions - World Top Updates". Worldtopupdates.com. 26 May 2017. Retrieved 28 June 2017.
  6. Z. Lazarević. "Roditelji Nika Vujičića u Beogradu: Drago nam je što smo u zemlji naših predaka". Blic.rs. Retrieved 30 August 2017.
  7. Vujicic, Nick. "A Life of Value," Life Without Limits, Doubleday, 2010.
  8. "Nick Vijucic - Attitude is Altitude". Attitude is Altitude. Archived from the original on 16 మార్చి 2016. Retrieved 23 ఆగస్టు 2019.
  9. Herald, University (19 August 2016). "Nick Vujicic On Hopelessness And His Childhood – Part 1". Retrieved 4 October 2016.
  10. Riley, Jennifer (30 March 2008). "Limbless Evangelist Preaches Joy in Christ". Christian Post Reporter. Archived from the original on 28 July 2012. Retrieved 28 September 2009.
  11. "Life Without Limbs:About Us".
  12. "Nick Vijucic - Attitude is Altitude". Attitude is Altitude. Retrieved 9 March 2016.[permanent dead link]
  13. "Butterfly Circus Wins The Doorpost Film Project's $100,000 First Prize". 168project.blogspot.com. Retrieved 24 October 2013.
  14. "2010 Method Fest, Independent Film Festival, Calabasas, California". Methodfest.com. Retrieved 27 October 2014.
  15. ""Something More" from Something More - Single by Nick Vujicic on iTunes". 7 December 2010.
  16. Attitude Is Altitude (22 August 2011). "Nick Vujicic - "Something More" Music Video" – via YouTube.
  17. "How Nick Vujicic Met His Wife? What Qualities Attracted Him to Kanae Miyahara?". christianpost.com. 12 February 2012. Archived from the original on 22 ఆగస్టు 2017. Retrieved 30 August 2017.
  18. "Nick Vujicic Biography -Motivational Speaker Without Limbs". Insbright. 3 January 2016. Retrieved 22 December 2017.
  19. "Motivational Speaker Nick Vujicic Waited Until Marriage". waitingtillmarriage.org. Archived from the original on 22 డిసెంబరు 2017. Retrieved 22 December 2017.
  20. "Motivational Speaker, Nick Vujicic Born Without Limbs Welcomes Twin Girls With Wife". National Helm. 21 December 2017. Archived from the original on 3 మార్చి 2018. Retrieved 22 December 2017.
  21. Herald, The Gospel (21 December 2017). "Limbless Evangelist Nick Vujicic Announces Birth of Twin Daughters Ahead of Christmas: 'Thank You God!'". Breaking Christian News: World, Business, and More. Retrieved 22 December 2017.
  22. "Nick Vujicic shares family's excitement in awaiting arrival of second son". Christiantoday.com. Retrieved 8 March 2016.
  23. Muteshi, Musabi. "Being someone else's miracle: Rwanda's story". The New Times Rwanda. Archived from the original on 2016-08-21. Retrieved 8 March 2016.