నిజం (2003 సినిమా)

సినిమా

నిజం 2003 లో తేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా. మహేష్ బాబు, తాళ్ళూరి రామేశ్వరి, గోపిచంద్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాలో నటనకు గాను మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా, తాళ్ళూరి రామేశ్వరికి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. [1]

నిజం
దర్శకత్వంతేజ
నిర్మాతతేజ
నటులుమహేష్ బాబు, తాళ్ళూరి రామేశ్వరి, గోపిచంద్
సంగీతంఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుశంకర్
నిర్మాణ సంస్థ
చిత్రం మూవీస్
విడుదల
2003 జూన్ 23 (2003-06-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

సిద్ధా రెడ్డి (జయప్రకాష్ రెడ్డి) ఒక మాఫియా నాయకుడు. అతని కుడిభుజం దేవుడు (గోపీచంద్). దేవుడి మల్లి (రాశి) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆ అమ్మాయి మీద చేయి వేసినందుకు దేవుడు సిద్ధారెడ్డిని చంపేసి తానే ఆ ముఠాకు నాయకుడవుతాడు. వెంకటేశ్వర్లు (రంగనాథ్) ఒక నిజాయితీ గల ఫైర్ ఆఫీసరు. తన భార్య శాంతి (తాళ్ళూరి రామేశ్వరి), కొడుకు సీతారాం (మహేష్ బాబు) తో కలిసి ఆనందంగా జీవితం గడుపుతుంటాడు. ఒకసారి దేవుడు మార్కెట్ ను తగులబెట్టిస్తాడు. అప్పుడు వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సహా వచ్చి మంటలు ఆర్పిస్తాడు. కానీ అది ఇష్టం లేని దేవుడు మంటలపై కిరోసిన్ పోసి మరింత తగులబెట్టాలనుకుంటాడు. దాంతో వెంకటేశ్వర్లు అతన్ని కొడతాడు.

వెంకటేశ్వర్లు మీద కక్షతో అతన్ని ఓ తప్పుడు కేసులో అరెస్టు చేయిస్తాడు దేవుడు. సీతారాం తన తండ్రిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని చాలా మంది అధికారుల చుట్టూ తిరుగుతాడు. కానీ వాళ్ళందరూ లంచం లేనిదే పనిజరగదని చెబుతారు. దేవుడి సూచనల మేరకు ఓ సి. ఐ వెంకటేశ్వర్లును చంపించేస్తాడు. అతని భార్య శాంతి తన భర్త మరణానికి కారణమైన వారి మీద ఎలాగైనా పగ సాధించాలనుకుంటుంది. అప్పటి దాకా అమాయకుడుగా ఉన్న తన కొడుకు సీతారాంను అనేక రకాలుగా శిక్షణనిచ్చి ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర్లు మృతికి కారణమైన వారిని ఒక్కొక్కరిని మట్టుబెడుతూ వస్తారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఎటువంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడతారు.

తారాగణంసవరించు

నిర్మాణంసవరించు

అభివృద్ధిసవరించు

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన పోలీసు అధికారి పాత్రకు మొదటగా మురళీ మోహన్ అనుకుని సుమారు 70 శాతం చిత్రీకరణ జరిపారు. కానీ రషెన్ చూసిన తర్వాత ఆయన ఆ పాత్రకు సరిపోరని భావించి మళ్ళీ ప్రకాష్ రాజ్ తో తీశారు.[3]

పాటలుసవరించు

  • రత్తాలూ రత్తాలూ
  • అభిమన్యుడు కాడు

మూలాలుసవరించు

  1. జి. వి, రమణ. "2003 నంది పురస్కారాలు". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 21 August 2017. CS1 maint: discouraged parameter (link)
  2. The Times of India, Entertainment (1 April 2020). "From Idiot to Andhrawala, 5 movies of Rakshita you shouldn't miss". Archived from the original on 2 April 2020. Retrieved 6 June 2020. CS1 maint: discouraged parameter (link)
  3. Focus, Filmy; Focus, Filmy. "మురళీ మోహన్ గారితో నాకేమీ గొడవలు లేవు : డైరెక్టర్ తేజ". Filmy Focus (in ఇంగ్లీష్). Retrieved 2020-07-15.