నిజరూపాలు 1974లో విడుదలైన తెలుగు సినిమా. దీనిలో ఎస్.వి.రంగారావు ద్విపాత్రాభినయం చేశాడు.[1]

నిజరూపాలు
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.నందనరావు
తారాగణం జి.రామకృష్ణ ,
విజయనిర్మల
సంగీతం సాలూరు హనుమంతరావు
నిర్మాణ సంస్థ ఉదయభాను ప్రొడక్షన్స్
భాష తెలుగు

జమీందారు కేశవవర్మ ఆస్తికి ఎసరు పెట్టడానికి ఎందరెందరో ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నుతుంటారు. ఆత్మీయులనుకొన్న వాళ్ళు శత్రువులవుతారు. అయినవాడు అనుకొన్న పెద్ద కొడుకు ప్రసాదవర్మ ప్రేమించిన వనిత కోసం ఇల్లు వదలి వెళ్ళిపోతాడు. ఆ అదను చూసి జమీందారును ఎవరో హత్యచేస్తారు. ఆ నేరం ప్రసాదవర్మపై పడింది. కళాప్రియుడు, సరళుడు, ధర్మాత్ముడు అయిన కేశవవర్మను పొట్టనపెట్టుకున్న నేరస్థుల కోసం పరిశోధన మొదలు పెడతారు ప్రసాదవర్మ, అతని భార్య అరుణ. వారి పరిశోధన పర్యవసానమేమిటనేది మిగిలిన కథ.

నటీనటులు

మార్చు
 • ఎస్.వి.రంగారావు
 • రామకృష్ణ
 • నాగభూషణం
 • ప్రభాకరరెడ్డి
 • రాజబాబు
 • అల్లు రామలింగయ్య
 • సి.హెచ్.కృష్ణమూర్తి
 • వై.వి.రాజు
 • పొట్టి ప్రసాద్
 • పూసల
 • విజయనిర్మల
 • సూర్యకాంతం
 • జి.నిర్మల
 • జయకుమారి
 • సుజాత
 • బేబి ఉషారాణి
 • సూర్యకళ

సాంకేతికవర్గం

మార్చు
 • స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె.వి.నందనరావు
 • కథ: కొమ్మినేని శేషగిరిరావు
 • మాటలు: ఆదివిష్ణు
 • పాటలు: మైలవరపు గోపి, సి.నారాయణరెడ్డి, దాశరథి
 • సంగీతం: సాలూరు హనుమంతరావు
 • ఛాయాగ్రహణం: మధు
 • కళ: భాస్కరరాజు
 • కూర్పు: బి.గోపాలరావు
 • నిర్మాత: బి.సరోజినీసీతారామ్‌

పాటలు

మార్చు
 1. ఓడిపోదురా న్యాయం వీడబోకు నీ శాంతం - ఎ.వి.యన్.మూర్తి - రచన: గోపి
 2. కృష్ణా మయింటికి రావో గజ్జలందియల్ ఘల్ ఘల్ - కౌసల్య
 3. నేనంటే చెకుముకి చెకుముకి రవ్వనురో సై అంటే - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: సి.నారాయణరెడ్డి
 4. రాజరాజశ్రీ దొరగారు కాబోయే మా శ్రీవారూ - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం - రచన: రాజశ్రీ
 5. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ హి ఈజ్ మిస్టర్ జేమ్స్ - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: గోపి
 6. సకల లోక బాంధవం కరుణరస పయోనిధిం (శ్లోకం) - ఎస్.పి. బాలసుబ్రమణ్యం - రచన: దాశరథి
 7. సింగపూరు లేడీ నీ అందమైన బాడీ నా సొంతమైతే - ఎస్.పి. బాలసుబ్రమణ్యం, బి.వసంత - రచన: దాశరథి

మూలాలు

మార్చు
 1. సంపాదకుడు (5 April 1974). "నిజరూపాలు". ప్రగతి వారపత్రిక. 6 (1): 20–21. Retrieved 27 December 2017.[permanent dead link]

బయటి లింకులు

మార్చు