బి.వసంత నాలుగు దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన సినిమా నేపథ్య గాయని.

బి.వసంత
సినీ నేపథ్యగాయిని బి.వసంత
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంబొడ్డుపల్లి బాలవసంత
జననంమార్చి 28,1944
గుంటూరు, గుంటూరు జిల్లా
సంగీత శైలినేపథ్యగానం
వృత్తిగాయని
వాయిద్యాలుగాత్ర సంగీతం
క్రియాశీల కాలం1961-1997

జీవిత విశేషాలు మార్చు

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

బొడ్డుపల్లి బాలవసంత గుంటూరులో 1944, మార్చి 28న జన్మించింది. ఈమె తల్లిదండ్రుల పేర్లు బొడ్డుపల్లి రవీంద్రనాథ్, దుర్గ. ఈమె తండ్రి మంచి నటుడు. పలు నాటకాలలో నటించాడు. భలే పెళ్లి, తారుమారు అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఇతడు మంచి ఫొటోగ్రాఫర్ కూడా. ఈమె తల్లి దుర్గ మంచి సంగీత విద్వాంసురాలు. వీణ బాగా వాయించేది. తల్లి దండ్రుల ప్రభావంతో వసంత సంగీతం పట్ల మక్కువ పెంచుకుంది. మహావాది వెంకటప్పయ్య, రాఘవేంద్రరావుల దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. వినోద్ ఆర్కెస్ట్రాలో చేరి అనేక సినిమా పాటల కచేరీలు చేసింది. ఈమె బి.ఎస్‌సి వరకు చదువుకుంది. తండ్రి ప్రోత్సాహంతో చలనచిత్ర రంగంలో అడుగు పెట్టింది.[1]

కుటుంబం మార్చు

ఈమె భర్త దోర్బల సుధాకర్ హైదరాబాదు సెక్రెటేరియట్‌లో పనిచేశాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. పెద్ద కుమార్తె పేరు సురేఖ. రెండవ కుమార్తె సుచిత్ర. కుమారుడు శరత్.

సినిమా రంగం మార్చు

ఈమె 1961లో వాగ్దానం చిత్రంలో తొలిసారిగా పాడింది. తరువాత తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాలలో సుమారు 3000కు పైగా పాటలను పాడింది. పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్, చెళ్ళపిళ్ళ సత్యం, కె.చక్రవర్తి మొదలైన సంగీత దర్శకుల సారథ్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల మొదలైన ప్రఖ్యాత గాయకులతో కలిసి అనేక పాటలు పాడింది. ఈమె అన్ని రకాల పాటలు పాడినా చిన్నపిల్లల పాటలే ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈమె రాజనర్తకియ రహస్య అనే కన్నడ సినిమా, మంచికి స్థానం లేదు అనే తెలుగు సినిమాకు సంగీత దర్శకత్వం వహించింది.

తెలుగు సినిమా పాటల జాబితా మార్చు

ఈమె పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

క్రమ సంఖ్య సినిమా పేరు పాట పల్లవి సహ గాయకుడు/ గాయని సంగీత దర్శకుడు గేయ రచయిత సినిమా విడుదలైన సంవత్సరం
1 వాగ్దానం మా కిట్టయ్య పుట్టిన దినము పిఠాపురం పెండ్యాల ఆచార్య ఆత్రేయ 1961
2 ఆప్తమిత్రులు రామా నన్ను బ్రోవరా ప్రేమతో లోకాభిరామా నన్ను బ్రోవరా స్వర్ణలత,
సరోజిని,
పి.లీల
ఘంటసాల సముద్రాల జూనియర్ 1963
3 ఈడు జోడు సూర్యుని చుట్టు తిరుగుతుంది భూగోళం ఈ సుందరి చుట్టు తిరుగుతుంది నా హృదయం పి.బి.శ్రీనివాస్ పెండ్యాల ఆరుద్ర 1963
4 మాస్టారమ్మాయి ప్రేమికుల విందు సౌఖ్యముల చిందు యౌవ్వనం పి.బి.శ్రీనివాస్ రమేష్ నాయుడు అనిసెట్టి 1964
5 వనసుందరి ప్రేయసినివే కాదా అందగాడా కనిపించరాదా ఆశతీరా మారెళ్ళ ఆరుద్ర 1964
6 పూజాఫలం వస్తావు పోతావు నా కోసం వచ్చి కూర్చొన్నాడు నీ కోసం ఎస్.రాజేశ్వరరావు కొసరాజు 1964
7 పీటలమీద పెళ్ళి ముందడుగు వేసింది అందాల చిన్నది పి.బి.శ్రీనివాస్ అశత్థామ చెరువు ఆంజనేయశాస్త్రి 1964
8 అమరశిల్పి జక్కన మల్లెపూల చెండులాంటి చిన్నదాన మాధవపెద్ది ఎస్.రాజేశ్వరరావు సముద్రాల సీనియర్ 1964
9 భీమ ప్రతిజ్ఞ ధాత్రిజనులకు ధర్మమార్గము ప్రబోధించిన భారతం ఎ.ఎం.రాజా జి. దేవరాజన్ అనిసెట్టి 1965
10 శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ. ఎస్.జానకి,
స్వర్ణలత
పెండ్యాల పింగళి 1966
11 అడవి యోధుడు బంగారు తీగవే నా ముద్దు వీణవే యేసుదాసు యం.బి.శ్రీనివాస్ అనిసెట్టి 1966
12 అడుగు జాడలు తూలీ సోలెను తూరుపు గాలి గాలివాటులో సాగెను ఘంటసాల మాస్టర్ వేణు శ్రీశ్రీ 1966
13 శ్రీకృష్ణ మహిమ కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్ప (పద్యం) బ్రదర్ లక్ష్మణ్,
వేలూరి
1967
14 శ్రీకృష్ణ మహిమ కృష్ణా ముకుందా వనమాలీ రాగమురళీ బ్రదర్ లక్ష్మణ్,
వేలూరి
అనిసెట్టి 1967
15 శ్రీకృష్ణ మహిమ నంద గోపుని తపము పండే సుందర కృష్ణా జయదేవ్ బ్రదర్ లక్ష్మణ్,
వేలూరి
అనిసెట్టి 1967
16 సతీ సుమతి అందాల దాసులు మగవారందాల దాసులే గుణవంతులైన ఎస్.జానకి పి.ఆదినారాయణరావు 1967
17 వసంత సేన బంగారు బండిలో వజ్రాల బొమ్మతో బలే బలే రాజులా ఎస్.రాజేశ్వరరావు దాశరథి 1967
18 చిక్కడు దొరకడు అందాలన్ని నీవే ఆనందాలన్ని నీవే పి.సుశీల,
ఘంటసాల
టి.వి.రాజు సి.నా.రె. 1967
19 పట్టుకుంటే పదివేలు ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బిస్కట్ సి ఫర్ టి.ఆర్.జయదేవ్ టి.చలపతిరావు ఆరుద్ర 1967
20 రంగులరాట్నం పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణా ఎ.పి. కోమల ఎస్.రాజేశ్వరరావు,
బి.గోపాలం
దాశరథి 1967
21 బ్రహ్మచారి నిన్నుచూసాను కన్నువేసాను చిన్నవీలు చూసి జేబులోన టి.ఆర్.జయదేవ్ టి.చలపతిరావు కొసరాజు 1968
22 గ్రామదేవతలు ప్రేమ యాత్ర తుది మజిలీ వెచ్చని హృదయం ఘంటసాల,
జేసుదాసు
పెండ్యాల ఆరుద్ర 1968
23 మాతృ దేవత మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ పి.సుశీల కె.వి.మహదేవన్ సి.నా.రె. 1969
24 సత్తెకాలపు సత్తెయ్య ప్రజలంతా కొలిచేటి భగవంతుడు నివసించే పసిపిల్లల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎం.ఎస్.విశ్వనాథన్ రాజశ్రీ 1969
25 లవ్ ఇన్ ఆంధ్రా భలే ఖుషిగా ఉండాలి బ్రతుకు మజాగా గడపాలి ఎస్. జానకి సత్యం దాశరథి 1969
26 మాయని మమత ఈ బ్రతుకే ఒక ఆట తీయని వలపుల బాట ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అశ్వత్థామ శ్రీశ్రీ 1970
27 శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి గిరివాసా శ్రీ వెంకటేశా శ్రితలోక పరిపాల ఎస్.జానకి,
పి.బి.శ్రీనివాస్
టి.జి.లింగప్ప రాజశ్రీ 1971
28 సతీ అనసూయ అష్టసిద్దులు కథిదేవి నైతినేని అఖిలలోకైక (పద్యం) పి.ఆదినారాయణరావు సముద్రాల జూనియర్ 1971
29 కత్తికి కంకణం గప్పాం గప్పాం కత్తులు గమ్మతైన కత్తులు పి.బి.శ్రీనివాస్ సత్యం అప్పలాచార్య 1971
30 శాంతి నిలయం దేవి క్షేమమా దేవరవారు క్షేమమా తమ కడగంటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.కోదండపాణి ఆచార్య ఆత్రేయ 1972
31 శభాష్ వదిన అమ్మారో మాయమ్మ గౌరమ్మానీవు ఆదిశక్తివి ఎల్.ఆర్. ఈశ్వరి కె.వి.మహదేవన్ కొసరాజు 1972
32 శభాష్ బేబి అయ్యల్లారా కరుణవున్న తల్లుల్లారా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యారావు మహారథి 1972
33 ఇదా లోకం నిత్య సుమంగళి నీవమ్మా నీకు అమంగళ ఘంటసాల చక్రవర్తి ఆత్రేయ 1973
34 శ్రీరామాంజనేయ యుద్ధం శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృత సాధం పి.సుశీల కె.వి.మహాదేవన్ ఆరుద్ర 1975
35 శ్రీరామాంజనేయ యుద్ధం అమ్మా పార్వతీ ఈ ఉపేక్ష తగదమ్మా సాటి ఇల్లాలి (పద్యం) కె.వి.మహాదేవన్ గబ్బిట వెంకటరావు 1975
36 శ్రీరామాంజనేయ యుద్ధం భీకరమౌ శ్రీరామబాణం తిరుగులేని అస్త్రం పి.సుశీల కె.వి.మహాదేవన్ ఆరుద్ర 1975
37 శ్రీరామాంజనేయ యుద్ధం భీషణమౌ శ్రీరామ శపథం వీడదు ధర్మపధం పి.సుశీల కె.వి.మహాదేవన్ ఆరుద్ర 1975
38 శ్రీరామాంజనేయ యుద్ధం వచ్చింది వచ్చింది రామరాజ్యం శ్రీరామయ్య మాధవపెద్ది సత్యం కె.వి.మహాదేవన్ కొసరాజు రాఘవయ్యచౌదరి 1975
39 శ్రీరామాంజనేయ యుద్ధం శ్రీయుతమౌ శ్రీరామ పాదం శ్రితజన మందారం పి.సుశీల కె.వి.మహాదేవన్ ఆరుద్ర 1975
40 యశోదకృష్ణ ఊగింది నాలో ఆనందడోల రేగింది నా మనసు ఆగింది చూపు పి.సుశీల ఎస్.రాజేశ్వరరావు శ్రీశ్రీ 1975
41 యశోదకృష్ణ నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు (పద్యం) పి.సుశీల ఎస్.రాజేశ్వరరావు పోతన 1975
42 యశోదకృష్ణ నెల మూడు వానలు నిలిచి కురిసాయి పచ్చిక మేసి వి.రామకృష్ణ ఎస్.రాజేశ్వరరావు కొసరాజు 1975
43 యశోదకృష్ణ పొన్నుల విరసే వేళలో వెన్నెల కురిసే రేలలో విజయలక్ష్మి శర్మ ఎస్.రాజేశ్వరరావు సి.నా.రె. 1975
44 సీతాకల్యాణం అంతా రామమయం పి.బి.శ్రీనివాస్,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
వి.రామకృష్ణ,
పి.సుశీల
కె.వి.మహదేవన్ ఆరుద్ర 1976
45 సీతాకల్యాణం కదిలింది కదిలింది గంగా పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.బి.శ్రీనివాస్,
వి.రామకృష్ణ
కె.వి.మహదేవన్ 1976
46 సీతాకల్యాణం కళ్యాణం చూతము రారండి శ్రీ సీతారాముల కళ్యాణం పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్
కె.వి.మహదేవన్ ఆరుద్ర 1976
47 సీతాకల్యాణం జానకి రాముల కలిపే విల్లు జనకుని వి.రామకృష్ణ,
పి.బి.శ్రీనివాస్,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
కె.వి.మహదేవన్ 1976
48 సీతాకల్యాణం మహావిష్ణు గాథలు పి.సుశీల,
ఎస్.పి.బాలు,
వి.రామకృష్ణ,
పి.బి. శ్రీనివాస్
కె.వి.మహదేవన్ సి.నా.రె. 1976
49 సీతాకల్యాణం సీతమ్మ విహరించు పూదోటకు పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్
కె.వి.మహదేవన్ ఆరుద్ర 1976
50 సీతాకల్యాణం సీతమ్మకు సింగారం చేతాము పి. సుశీల,
రమోలా,
ఉడుతా సరోజిని
కె.వి.మహదేవన్ ఆరుద్ర 1976
51 సీతాకల్యాణం సీతారాముల శుభ పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.బి.శ్రీనివాస్,
వి.రామకృష్ణ
కె.వి.మహదేవన్ ఆరుద్ర 1976
52 మనవడి కోసం నీకు నేను కావాలి నాకు నీవు కావాలి కొత్త టి.వి కావాలి పి.బి.శ్రీనివాస్ సత్యం వేటూరి 1977
53 ముగ్గురు మూర్ఖురాళ్ళు కాళ్ళాగజ్జా కంకాళమ్మ ఎస్.జానకి,
వేదవతి ప్రభాకర్
చక్రవర్తి సి.నా.రె. 1978
54 లక్ష్మీపూజ నిన్నే రమ్మంటిని లే లే లేమ్మంటిని నువ్వేదిమ్మన్నా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం సి.నా.రె. 1979
55 శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం కుసుమ భూపతి చేసె యజ్ఞము విజయలక్ష్మి శర్మ ఎస్.రాజేశ్వరరావు సి.నా.రె. 1980
56 సిరివెన్నెల చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
కె.వి.మహదేవన్ సిరివెన్నెల సీతారామశాస్త్రి 1986

ఇతర విశేషాలు మార్చు

ఈమె పాడిన ప్రైవేటు పాటలు అనేకం కేసెట్లుగా విడుదలయ్యాయి. కొన్ని కేసెట్లకు ఈమె స్వరకల్పన చేసింది. హెచ్.ఎం.వి. సంస్థ కోసం క్రీస్తుగానసుధ, క్రీస్తు గానం, ఆరాధన, జీవాహారం మొదలైన క్రైస్తవ గీతాల ఆల్బమ్స్, సంగీత సంస్థ కోసం జానపద గేయాల ఆల్బమ్‌ రూపొందించింది. సినిమాల్లో పనిచేస్తూనే బయట అనేక వందల కచేరీలు ఇచ్చింది. అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి విదేశాలను అనేక సార్లు పర్యటించి సంగీత కచేరీలు చేసింది.

మూలాలు మార్చు

  1. కంపల్లె, రవిచంద్రన్ (2013). "చందమామ రావే... జాబిల్లి రావే...". జ్ఞాపకాలు (తృతీయ ed.). చెన్నై: కళాతపస్వి క్రియేషన్స్. pp. 170–175.
"https://te.wikipedia.org/w/index.php?title=బి.వసంత&oldid=4027342" నుండి వెలికితీశారు