నిజల్ (2021 సినిమా)
నిజల్ 2021లో మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన మలయాళం సినిమా. ఈ సినిమాలో చాకో బోబన్ – నయనతార హీరో హీరోయిన్లుగా నటించగా, అప్పు ఎన్ భట్టతిరి [1]దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కాగా, [2] 2021 మే 9న 4K & Dolby ఓటీటీ సంస్థ ద్వారా విడుదలైంది.[3][4]
నిజల్ | |
---|---|
దర్శకత్వం | అప్పు ఎన్ భట్టతిరి |
స్క్రీన్ ప్లే | ఎస్. సంజీవ్ |
నిర్మాత | అంటో జోసెఫ్ అభిజిత్ ఎం. పిళ్ళై బాదుషా ఫెలినీ టిపి. జినీష్ జోస్ |
తారాగణం | చాకో బోబన్ నయనతార |
ఛాయాగ్రహణం | దీపక్ డి. మీనన్ |
కూర్పు | అప్పు ఎన్ భట్టతిరి అరుణ్ లాల్ ఎస్పీ |
సంగీతం | సూరజ్ ఎస్. కురుప్ |
నిర్మాణ సంస్థలు | అంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ మెలంగె ఫిలిం హౌస్ టెంట్ పోల్ మూవీస్ |
పంపిణీదార్లు | ఆన్ మెగా మీడియా |
విడుదల తేదీ | 2021 ఏప్రిల్ 9 |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
బడ్జెట్ | 03 కోట్లు |
కథ
మార్చుఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జాన్ బేబీ (కుంచాకో బోబన్) కారు ప్రమాదంలో గాయపడ్డ అతనికి లేని వర్షం పడుతోందన్న భ్రమ లాంటివి కలుగుతుంటాయి. ఇంతలో, చైల్డ్ సైకాలజిస్ట్ అయిన డాక్టర్ ఫ్రెండ్ షాలిని (దివ్య ప్రభ) ద్వారా ఎనిమిదేళ్ళ చిన్న స్కూలు పిల్లాడు నితిన్ గురించి తెలుస్తుంది. మర్డర్ స్టోరీలు చెప్పే ఆ కుర్రాడి గురించి, అతని తల్లి షర్మిల (నయనతార) గురించి హీరో ఆరా తీస్తాడు. చూడడానికి మామూలుగా ఉండే ఆ కుర్రాడు కథలో చెప్పే ప్రాంతాలకు వెళితే, నిజంగానే అక్కడ అస్తిపంజరం బయటపడుతుంది. పిల్లాడు చెబుతున్న కథలు ఒక్కొక్కటీ వాస్తవ మని తేలడంతో మిస్టరీ పెరుగు తుంది. దాన్నిఛేదించడానికి హీరో, ఆ పిల్లాడి తల్లి ఏం చేశారు? తండ్రి లేని ఆ పిల్లాడిని తల్లి అసలు ఎలా పెంచింది? అనేదే మిగతా సినిమా కథ.[5]
నటీనటులు
మార్చు- చాకో బోబన్ - జాన్ బేబీ [6]
- నయనతార - షర్మీల
- లాల్ - విశ్వనాథన్
- ఇజిన్ హాష్ - నితిన్
- సైజు కురుప్ - అజిత్ కుమార్
- రోనీ డేవిడ్
- దివ్య ప్రభ - షాలిని
- వినోద్ కోవూరు - కానిస్టేబుల్
- అనీష్ గోపాల్
- సియాద్ యదు
- సాదిక్
- ఆధ్య ప్రసాద్
- ఫహాద్ ఫాజిల్ - సచిన్, షర్మీల భర్తగా అతిధి పాత్రలో
- జాలీ చిరయత్
మూలాలు
మార్చు- ↑ The News Minute (24 అక్టోబరు 2020). "'Accidental' editor Appu Bhattathiri on directing 'Nizhal', his first film". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 9 మే 2021. Retrieved 9 మే 2021.
- ↑ The Times of India (9 ఏప్రిల్ 2021). "Nizhal - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 9 మే 2021. Retrieved 9 మే 2021.
- ↑ Sakshi (7 మే 2021). "ఓటీటీలోకి నయనతార కొత్త సినిమా.. మే 9 నుంచి స్ట్రీమింగ్". Sakshi. Archived from the original on 9 మే 2021. Retrieved 9 మే 2021.
- ↑ Namasthe Telangana (7 మే 2021). "నయన్ మలయాళ సినిమా రెడీ..!". Archived from the original on 9 మే 2021. Retrieved 9 మే 2021.
- ↑ Sakshi (21 మే 2021). "Nayanthara: నయనతార 'నిళల్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 21 మే 2021. Retrieved 21 మే 2021.
- ↑ The New Indian Express (18 అక్టోబరు 2020). "Kunchacko Boban, Nayanthara to lead thriller Nizhal". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 9 మే 2021. Retrieved 9 మే 2021.