సైజు కురుప్ (జననం 1979 మార్చి 12) ప్రధానంగా మలయాళ చిత్రసీమలో, అప్పుడప్పుడు తమిళ చిత్రసీమలో పనిచేసే భారతీయ నటుడు. తమిళ చిత్రాలలో అనిరుధ్ గా ఆయన గుర్తింపు పొందాడు. ఆయన హరిహరన్ రూపొందించిన మయూఖం (2005) చిత్రంతో తెరంగేట్రం చేసాడు. జూన్ 2021 నాటికి, ఆయన 100కి పైగా చిత్రాలలో ప్రధాన పాత్ర, ప్రతినాయకుడు, సహాయ పాత్రలలో నటించాడు.

సైజు కురుప్
జననం (1979-03-12) 1979 మార్చి 12 (age 46)
చేర్తల, కేరళ, భారతదేశం
జాతీయతబారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2005–ప్రస్తుతం
భార్య / భర్త
అనుపమ నంబియార్
(m. 2005)
పిల్లలు2
తల్లిదండ్రులు
  • ఎన్. గోవింద కురుప్
  • శోభన కురుప్

సోనీ లివ్ ద్వారా 2024 అక్టోబరు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవడానికి సిద్ధంగా ఉన్న మలయాళ వెబ్ సిరీస్ జై మహేంద్రన్ లో ఆయన నటించాడు. దీనికి శ్రీకాంత్ మోహన్ దర్శకత్వం వహించగా సుహాసిని ప్రధానమైన పాత్రను పోషించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

సైజు కురుప్ 2005 ఫిబ్రవరి 12న అనుపమను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.[1]

మూలాలు

మార్చు
  1. "Here is why Saiju Kurup and family are excited about their chic, new flat". OnManorama (in ఇంగ్లీష్). Retrieved 2020-09-15.