నిజాం వ్యాయామ కళాశాల
నిజాం వ్యాయామ కళాశాల అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న ప్రభుత్వ వ్యాయామ కళాశాల. చారిత్రక నేపథ్యమున్న ఈ వ్యాయామ కళాశాలలో డీపీఈడీ, బీపీఈడీ కోర్సులు నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం 500 మంది విద్యనభ్యసిస్తున్నారు.[1]
రకం | వ్యాయామ కళాశాల |
---|---|
స్థాపితం | 1931 |
ప్రధానాధ్యాపకుడు | డాక్టర్ కె. రాంరెడ్డి |
స్థానం | దోమలగూడ, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | పట్టణ |
చరిత్ర
మార్చువ్యాయామ విద్య ప్రాముఖ్యతను గుర్తించిన నిజాం రాజు 1931లో 11 ఎకరాల్లో దక్కన్ వ్యాయామ కళాశాలను ఏర్పాటుచేశాడు. తరువాతికాలంలో ప్రభుత్వ వ్యాయామ కళాశాలగా మార్చబడింది.[1]
నూతన భవనాలు
మార్చు90 ఏండ్లు నిండిన బిల్డింగ్ స్థానంలో పునర్‌నిర్మాణం (నూతన భవనం, బాలికల వసతి గృహం) కోసం తెలంగాణ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించనున్న ఈ భవనంలో అత్యాధునికంగా పది తరగతి గదులు, సైకాలజీ అనాటమీ ల్యాబ్, ఫిజియోథెరపీ ల్యాబ్, ఫస్ట్ ఎయిడ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అడియో వీడియో విజువల్ ల్యాబ్, జిమ్ రూం, గేమ్స్ ఎక్విప్‌మెంట్ స్టోర్ రూం, యోగా ప్రాక్టీస్ హాల్, లైబ్రరీ, ఎగ్జామినేషన్ రూం, ప్రిన్సిపాల్ అండ్ స్టాఫ్ రూంలు ఉంటాయి. మరో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బాలికల వసతి గృహం, వంటగది, డైనింగ్ హాల్ నిర్మిస్తారు. రన్నింగ్ ట్రాక్, బాస్కెట్ బాల్ కోర్ట్, స్విమ్మిం గ్ పూల్ ఏర్పాటు కానున్నాయి.[1]
2023 అక్టోబరు 3న ఈ వ్యాయామ కళాశాల నూతన భవనం, బాలికల వసతి గృహం నిర్మాణ పనులకు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్, కళాశాల ప్రిన్సిపాల్ రామిరెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఈఈ షఫీ మియాన్ పాల్గొన్నారు.[2]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 telugu, NT News (2023-10-01). "Nizam College | నిజాం వ్యాయామ కాలేజీకి మహర్దశ.. కొత్త భవన నిర్మాణానికి రేపే శంకుస్థాపన". www.ntnews.com. Archived from the original on 2023-10-01. Retrieved 2023-10-29.
- ↑ telugu, NT News (2023-10-03). "నిజాం వ్యాయామ కాలేజీకి కొత్త భవనం". www.ntnews.com. Archived from the original on 2023-10-03. Retrieved 2023-10-29.