ముఠా గోపాల్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] టీఆర్ఎస్ పార్టీ బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ముఠా గోపాల్‌
ముఠా గోపాల్


పదవీ కాలం
2018 - ప్రస్తుతం
నియోజకవర్గం ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 ఫిబ్రవరి 1953
కరీంనగర్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాజయ్య - రాజేశ్వరి
జీవిత భాగస్వామి సరోజ
సంతానం జయసింహ (కొడుకు), ఒక కూతురు
నివాసం గాంధీనగర్, ముషీరాబాద్, హైదరాబాద్
మతం హిందూ

జననం, విద్య

మార్చు

గోపాల్ 1953, ఫిబ్రవరి 10న రాజయ్య - రాజేశ్వరి దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో జన్మించాడు. 2005లో తమిళనాడులోని వినాయక మిషన్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ బిఏ (పొలిటికల్ సైన్స్) పూర్తి చేశాడు. సొంత వ్యాపారం కూడా ఉంది.[2]

వ్యక్తిగత జీవితం

మార్చు

గోపాల్ కు సరోజతో వివాహం జరిగింది.[3] వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు

మార్చు

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గోపాల్, టిడిపి పార్టీ కార్యకర్త స్థాయినుండి హైదరాబాద్ నగర టిడిపి అధ్యక్షుడిగా పనిచేశాడు. తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరి, పార్టీ ఇంచార్జ్‌గా కూడా ఉన్నాడు.2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కె. లక్ష్మణ్ చేతిలో 27,338 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పై 36,910 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7]

హోదాలు

మార్చు
  1. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జోనల్ ఛైర్మన్
  3. ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల బోర్డు చైర్మన్

మూలాలు

మార్చు
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "Muta Gopal | MLA | State President | TRS | Musheerabad | Hyderabad". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-23. Retrieved 2021-09-14.
  3. Andhrajyothy (14 November 2023). "భార్యలే ఐశ్వర్యవంతులు! టాప్‌లో ఓ మహిళా కాంగ్రెస్ అభ్యర్థి!". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  4. "Muta Gopal(TRS):Constituency- MUSHEERABAD(HYDERABAD) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-14.
  5. Mana Telangana (19 November 2018). "ముఠాగోపాల్‌కు బి-ఫారం అందజేసిన నాయిని". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  6. "Muta Gopal(TRS):Constituency- MUSHEERABAD(HYDERABAD) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-14.
  7. Namasthe Telangana (25 May 2021). "పైపులైన్‌ పనులు వెంటనే చేపట్టండి". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.