నిడదవోలు పురపాలక సంఘం

నిడదవోలు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం లోని, నిడదవోలు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

నిడదవోలు పురపాలక సంఘం
నిడదవోలు
గణేశ్ చౌక్, నిడదవోలు
స్థాపన1964
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

నిడదవోలు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1964 సంవత్సరంలో 2 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 14.88.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం పరిధి 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 43,809 జనాభా ఉండగా అందులో పురుషులు 21,281, మహిళలు 22,528 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 81.16% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 84.60% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 77.95%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4263 ఉన్నారు.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా బి. కృష్ణమూర్తి, [3] వైస్ చైర్మన్‌గా పేరూరి సాయిబాబా పనిచేస్తున్నారు.[3]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  1. గోలింగేశ్వరస్వామి దేవాలయం
  2. వేణుగోపాల స్వామి దేవాలయం
  3. దాసాంజనేయ దేవాలయం

మూలాలు మార్చు

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Nidadavole Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-11.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు మార్చు