రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.
రాజమండ్రి లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 17°0′36″N 81°48′0″E |
చరిత్ర
మార్చు2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు బాగా మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణకు పూర్వమున్న బూరుగుపూడి, కడియం, రామచంద్రాపురం ఆలమూరు శాసనసభా నియోజకవర్గములు తొలిగిపోయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు శాసనసభా నియోజకవర్గములు వచ్చిచేరాయి. దీనితో జిల్లాకు చెందిన 4 శాసనసభా నియోజకవర్గములు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి.
శాసనసభా నియోజకవర్గాలు
మార్చు- అనపర్తి: ఇది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో విస్తరించివుంది.
- కొవ్వూరు
- గోపాలపురం (SC): ఇది తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో విస్తరించివుంది.
- నిడదవోలు
- రాజమండ్రి గ్రామీణ
- రాజమండ్రి సిటీ
- రాజానగరం
నియోజకవర్గపు గణాంకాలు
మార్చుఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు2004 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మురళీమోహన్ పోటిచేస్తున్నాడు.[4] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీలో ఉన్నాడు.[5]
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | ఉండవిల్లి అరుణకుమార్ | 3,57,449 | 35.12 | ||
తెలుగుదేశం పార్టీ | మురళీమోహన్ | 3,55,302 | 34.91 | ||
ప్రజా రాజ్యం పార్టీ | కృష్ణంరాజు | 2,53,437 | 24.90 | ||
లోక్ సత్తా పార్టీ | డా.పాలడుగు చంద్రమౌళి | 13,418 | 1.32 | ||
భారతీయ జనతా పార్టీ | సోము వీర్రాజు | 7,123 | 0.70 | ||
బహుజన సమాజ్ పార్టీ | వజ్రపు కోటేశ్వరరావు | 5,805 | 0.57 | ||
మెజారిటీ | 2,147 | ||||
మొత్తం పోలైన ఓట్లు | |||||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing |
2014 ఎన్నికలు
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | మాగంటి మురళీమోహన్ | 630,573 | 54.62 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | బొడ్డు వెంకటరమన చౌదరి[6] | 463,139 | 40.12 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | గుర్గేష్ కందుల | 21,243 | 1.84 | ||
Jai Samaikyandhra Party | ముళ్ళపూడి సత్యనారాయణ | 11,718 | 1.02 | ||
BSP | మర్రి బాబ్జీ | 6,079 | 0.53 | ||
NOTA | None of the Above | 7,456 | 0.65 | ||
మెజారిటీ | 1,67,434 | 14.50 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,154,381 | 81.22 | +0.50 | ||
తెదేపా gain from INC | Swing |
మూలాలు
మార్చు- ↑ సాక్షి దినపత్రిక
- ↑ EENADU (13 May 2024). "రాజమహేంద్రవరం". Archived from the original on 13 May 2024. Retrieved 13 May 2024.
- ↑ Prajasakti (24 March 2024). "చైతన్య ఝురి.. రాజమహేంద్రి ఎంపీ బరి." Archived from the original on 13 May 2024. Retrieved 13 May 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.