నితిన్ నరేంద్ర మీనన్ (జననం 1983 నవంబరు 2) భారతీయ క్రికెట్ ఆటగాడు, అంపైరు.[1] అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, లిస్ట్ A క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతను ఇప్పుడు అంపైర్‌గా ఉన్నాడు. 2015–16 రంజీ ట్రోఫీ లోను, [2] ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్ షీల్డ్‌లో మ్యాచ్‌లలోనూ నిలిచాడు.[3] 2020 జూన్లో, అతను నిగెల్ లాంగ్ స్థానంలో ICC అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌కు పదోన్నతి పొందాడు.[4] అతని తండ్రి నరేంద్ర మీనన్ కూడా క్రికెటరు, అంపైరు.

నితిన్ మీనన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నితిన్ నరేంద్ర మీనన్
పుట్టిన తేదీ (1983-11-02) 1983 నవంబరు 2 (వయసు 40)
ఇండోర్, మధ్య ప్రదేశ్, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
బంధువులుNarendra Menon (father)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004మధ్య ప్రదేశ్
తొలి List A8 January 2004  - సెంట్రల్ జోన్
చివరి List A9 January 2004  - సెంట్రల్ జోన్
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు18 (2019–2023)
అంపైరింగు చేసిన వన్‌డేలు44 (2017–2023)
అంపైరింగు చేసిన టి20Is40 (2017–2023)
అంపైరింగు చేసిన మటి20Is10 (2018–2020)
కెరీర్ గణాంకాలు
పోటీ List A
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 7
బ్యాటింగు సగటు 7.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 7
క్యాచ్‌లు/స్టంపింగులు 2/–
మూలం: ESPNcricinfo, 7 June 2023

అంపైరింగ్ కెరీర్ మార్చు

అతను 2017 జనవరి 26న భారతదేశం, ఇంగ్లండ్‌ల మధ్య తన మొదటి ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌లో నిలిచాడు [5] 2017 మార్చి 15న ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మధ్య తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లో నిలిచాడు [6]

2018 అక్టోబరులో, అతను 2018 ICC మహిళల వరల్డ్ ట్వంటీ20 కోసం పన్నెండు మంది ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు.[7] అతను ఇయాన్ గౌల్డ్‌తో కలిసి 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నాడు.

2019 నవంబరులో భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ మధ్య [8] ఒక టెస్ట్ మ్యాచ్‌కు ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో మీనన్ ఒకరు. ఈ స్థాయిలో అంపైరింగ్ చేసిన 62వ భారతీయుడిగా నిలిచాడు.[9] 2020 ఫిబ్రవరిలో, ఆస్ట్రేలియాలో జరిగే 2020 ICC మహిళల T20 ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో అంపైర్‌లలో ఒకరిగా ICC అతనిని పేర్కొంది.[10]

2020 జూన్‌లో మీనన్, ఇంగ్లండ్‌కు చెందిన నిగెల్ లాంగ్ స్థానంలో ICC అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌కు ఎలివేట్ చేయబడి, ఆ జాబితాలోకి ప్రవేశించిన మూడవ భారతీయ అంపైరయ్యాడు.

మూలాలు మార్చు

  1. "Youngest umpire on Emirates ICC Elite Panel of Umpires, Nitin Menon targets consistency". International Cricket Council. Retrieved 29 June 2020.
  2. "Ranji Trophy, Group B: Baroda v Punjab at Vadodara, Nov 15-18, 2015". ESPNcricinfo. Retrieved 15 November 2015.
  3. "Sheffield Shield, 21st Match: South Australia v Victoria at Adelaide, Feb 14-17, 2016". ESPNcricinfo. Retrieved 14 February 2016.
  4. "Nitin Menon included in Elite panel of umpires for 2020-21". ESPNcricinfo. Retrieved 29 June 2020.
  5. "England tour of India, 1st T20I: India v England at Kanpur, Jan 26, 2017". ESPN Cricinfo. Retrieved 26 January 2017.
  6. "Afghanistan tour of India, 1st ODI: Afghanistan v Ireland at Greater Noida, Mar 15, 2017". ESPNcricinfo. Retrieved 15 March 2017.
  7. "11th team for next month's ICC Women's World T20 revealed". International Cricket Council. Retrieved 25 October 2018.
  8. "Umpire Nitin Menon set for Test debut in November". India Today. Retrieved 2 September 2019.
  9. "Nitin Menon set to become 62nd Indian Test umpire". ESPNcricinfo. Retrieved 2 September 2019.
  10. "ICC announces Match Officials for all league matches". International Cricket Council. Retrieved 12 February 2020.