నిదా దార్
నిదా రషీద్ దార్ ఒక పాకిస్తానీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1987 జనవరి 2న పంజాబ్ లోని గుజరన్వాలలో జన్మించింది. డార్ కి "లేడీ బూమ్ బూమ్" అనే ఇంకో పేరు ఉంది. ఇది ఆమె బ్యాటింగ్ శక్తికి సూచన.[1] ఆమె తండ్రి రషీద్ హసన్, మొదటి తరగతి క్రికెట్ క్రీడాకారుడు.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నిదా రషీద్ దార్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | గుజరన్ వాలా, పంజాబ్, పాకిస్తాన్ | 1987 జనవరి 2|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | లేడీ బూమ్ బూమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి స్పిన్ ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 57) | 2010 6 అక్టోబర్ - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 21 జనవరి - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 14) | 2010 6 మే - శ్రీ లంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 1 సెప్టెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08–2009/10 | పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11–2018/19 | జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ మహిళల క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | సియాల్‌కోట్ మహిళల క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20 | సిడ్నీ థండర్ మహిళల బిగ్ బాష్ లీగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 21 ఫిబ్రవరి 2023 |
ఆమె ఆల్ రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్. కుడి చేయి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తుంది. ఆమె 2023 ఏప్రిల్ నుండి పాకిస్తాన్ మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తోంది.
దార్ మహిళల T20I లో అత్యంత విజయవంతమైన బౌలర్. ఆమె టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి పాకిస్థానీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె పాకిస్తాన్ విశ్వవిద్యాలయాలు, జరాయ్ తారకియాతి బ్యాంక్ లిమిటెడ్, సియాల్కోట్ సిడ్నీ థండర్ జట్లకు దేశవాళీ క్రికెట్ ఆడింది.[3][4]
క్రికెట్ జీవితము
మార్చుదార్ 2010 అక్టోబరు 6న దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌లో ఐర్లాండ్‌పై తన మొదటి ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.[3]
ఆమె తన మొదటి మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ పోటీ (WT20I) 2010 మే 6న సెయింట్ కిట్స్‌లోని బస్సెటెర్రేలో శ్రీలంకతో ఆడింది. చైనాలో జరిగిన 2010 ఆసియా క్రీడల్లో ఆడేందుకు కూడా ఎంపికైంది.[5]
2018 జూన్ 6న, శ్రీలంకతో జరిగిన మహిళల ట్వంటీ 20 (WT20I) ఆసియా కప్ మ్యాచ్‌లో, ఆమె తన ఐదు వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ మహిళగా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించింది.[6][7] ఆమె ఐదు మ్యాచ్‌లలో పదకొండు వికెట్లు తీసి, ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది.[8]
2018 అక్టోబరులో, వెస్టిండీస్‌లో జరిగిన ICC మహిళా ప్రపంచ ట్వంటీ20 పోటీలలో ఆడటానికి పాకిస్థాన్ జట్టుకి ఆమె ఎంపికైంది.[9][10] టోర్నమెంట్ ముగిసిన తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆమెను జట్టులో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపిక చేసింది.[11] 2020 జనవరిలో, ఆస్ట్రేలియాలో జరిగే ICC మహిళల T20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ జట్టులో ఆమె ఎంపికైంది.[12] ఇంగ్లండ్‌తో జరిగిన పాకిస్థాన్ మ్యాచ్‌లో, ఆమె తన 100వ WT20I మ్యాచ్‌లో ఆడింది.[13]
2021 జూన్లో, వెస్టిండీస్‌తో జరిగిన 'ఎవే సిరీస్' కోసం జరిగిన అన్ని పాకిస్తాన్ క్రికెట్ ఫార్మాట్లలో దార్ ను ఎంపిక చేసారు.[14] T20I సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్‌లో, ఆమె మొదటి ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్‌లో డియాండ్రా డాటిన్‌ను అవుట్ చేసి తన 100వ వికెట్‌ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్ తరపున T20I క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్ (పురుషులు, స్త్రీలలో ) గా నిలిచింది.[15] మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ ఘనత సాధించినందుకు ఆమెను అభినందించింది.[16]
2021 అక్టోబరులో, జింబాబ్వేలో జరిగే మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ ఆడటం కోసం ఆమె పాకిస్థాన్ జట్టుకు ఎంపికైంది.[17] 2022 జనవరిలో, ఆమె న్యూజిలాండ్‌లో జరిగే మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి పాకిస్థాన్ జట్టుకు ఉపనాయకురాలిగా (వైస్ కెప్టెన్)గా ఎంపికైంది.[18] 2022 మేలో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ ఆటల పోటీలలో క్రికెట్ కోసం పాకిస్థాన్ జట్టులో ఆమె ఎంపిక అయింది.[19]
2023 ఏప్రిల్లో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మహిళల క్రికెట్ జట్టుకు దార్‌ని నాయకురాలిగా (కెప్టెన్)గా నియమించింది.[20]
ప్రస్తావనలు
మార్చు- ↑ Hart, Chloe (18 October 2019). "Pakistan's Nida Dar ready to make WBBL history with Sydney Thunder". ABC News (Australia). Retrieved 24 July 2020.
- ↑ "Rashid Hassan". ESPN Cricinfo. Retrieved 8 January 2021.
- ↑ 3.0 3.1 "Player Profile: Nida Dar". ESPNcricinfo. Retrieved 7 January 2022.
- ↑ "Player Profile: Nida Dar". CricketArchive. Retrieved 7 January 2022.
- ↑ Khalid, Sana to lead Pakistan in Asian Games cricket event onepakistan. 29 September 2010. Retrieved 10 October 2010.
- ↑ "Bismah Maroof, Nida Dar star in crucial Pakistan win". International Cricket Council. Retrieved 6 June 2018.
- ↑ "Maroof 60*, Dar record five-for strangle Sri Lanka". ESPN Cricinfo. Retrieved 6 June 2018.
- ↑ "Women's Twenty20 Asia Cup, 2018, Pakistan Women: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 9 June 2018.
- ↑ "Pakistan women name World T20 squad without captain". ESPN Cricinfo. Retrieved 10 October 2018.
- ↑ "Squads confirmed for ICC Women's World T20 2018". International Cricket Council. Retrieved 10 October 2018.
- ↑ "#WT20 report card: Pakistan". International Cricket Council. Retrieved 19 November 2018.
- ↑ "Pakistan squad for ICC Women's T20 World Cup announced". Pakistan Cricket Board. Retrieved 20 January 2020.
- ↑ "Nida Dar set to play her 100th T20I". Pakistan Cricket Board. Retrieved 28 February 2020.
- ↑ "WI Women's Senior & 'A' Team squads named to face Pakistan in CG Insurance T20Is". Cricket West Indies. Retrieved 2021-07-11.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Nida Dar becomes the first Pakistan player to 100 T20I wickets". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-11.
- ↑ "PCB congratulates Nida Dar on completing century of T20I wickets". Pakistan Cricket Board. Retrieved 1 July 2021.
- ↑ "West Indies to tour Pakistan for three ODIs from November 8; Javeria Khan to lead the hosts". Women's CricZone. Retrieved 21 October 2021.
- ↑ "Bismah Maroof returns to lead Pakistan in World Cup 2022". Women's CricZone. Retrieved 24 January 2022.
- ↑ "Women squad for Commonwealth Games announced". Pakistan Cricket Board. Retrieved 31 May 2022.
- ↑ "PCB names Nida Dar as women's captain, Mark Coles as head coach". DAWN (in ఇంగ్లీష్). 6 April 2023.