సెయంట్ కిట్స్, నెవిస్
" ది ఫెడరేషన్ ఆఫ్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ " (/seɪnt ˌkɪts ænd ˈniːvɪs/ ( listen))," ఫెడరేషన్ ఆఫ్ సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్ " అని కూడా అంటారు.[3] ఇది వెస్ట్ ఇండీస్, కరీబియన్ ప్రాంతాలలో రెండు ద్వీపాలు కలిగిన దేశం. ఇది లెస్సర్ అంట్లాంటిల్లెస్ లోని లీవర్డ్ ద్వీపాల మాలికలో భాగంగా ఉంది.పశ్చిమార్ధగోళంలో జనసఖ్యాపరంగా, వైశాల్యపరంగా అతిచిన్న స్వార్వభౌమ దేశం. క్వీన్ ఎలిజబెత్ నాయకత్వంలోని కామన్వెల్త్ దేశాలలో ఇది ఒక్కటి.
Federation of Saint Kitts and Nevis | |
---|---|
నినాదం: "Country Above Self" | |
రాజధాని | Basseterre 17°18′N 62°44′W / 17.300°N 62.733°W |
అధికార భాషలు | English |
జాతులు (2000) | |
పిలుచువిధం | Kittitian or Nevisian |
ప్రభుత్వం | Federal parliamentary constitutional monarchy |
• Monarch | Elizabeth II |
Sir S.W. Tapley Seaton | |
Timothy Harris | |
శాసనవ్యవస్థ | National Assembly |
Independence | |
27 February 1967 | |
• from the United Kingdom | 19 September 1983 |
విస్తీర్ణం | |
• మొత్తం | 261 కి.మీ2 (101 చ. మై.) (188th) |
• నీరు (%) | Negligible |
జనాభా | |
• 2015 estimate | 54,961 (209th) |
• 2011 census | 46,204 |
• జనసాంద్రత | 164/చ.కి. (424.8/చ.మై.) (64th) |
GDP (PPP) | 2016 estimate |
• Total | $1.458 billion[1] |
• Per capita | $25,913[1] |
GDP (nominal) | 2016 estimate |
• Total | $945 million[1] |
• Per capita | $16,793[1] |
హెచ్‌డిఐ (2015) | 0.765[2] high · 74th |
ద్రవ్యం | East Caribbean dollar (XCD) |
కాల విభాగం | UTC-4 |
వాహనాలు నడుపు వైపు | left |
ఫోన్ కోడ్ | +1 869 |
ISO 3166 code | KN |
Internet TLD | .kn |
|
రాజధాని నగరం " బస్సెటెర్రె " దేశంలోని పెద్ద ద్వీపం అయిన సెయింట్స్ కిట్స్ ద్వీపంలో ఉంది. చిన్న ద్వీపం అయిన నెవిస్ సెయింట్ కిట్స్ ద్వీపానికి ఆగ్నేయంలో " ది నేరోస్ " కాలువకు ఆవలితీరంలో 3 కి.మీ దూరంలో ఉంది.చారిత్రకంగా " సెయింట్ క్రిస్టోఫర్-నెవిస్-అంక్విల్లా " యూనియన్లో బ్రిటిష్ డిపెండెంసీ " అంక్విల్ల " కూడా భాగంగా ఉంది.దేశం ఉత్తరం - వాయవ్యదిశలో సెయింట్ యుస్టాటియస్, సబా (నెదర్లాండ్ ద్వీపాలు) ద్వీపాలు, సెయింట్ భర్తెల్మీ, సెయింట్ మార్టిన్, అంక్విల్లా ద్వీపాలు ఉన్నాయి. తూర్పు, ఈశాన్యదిశలో ఆంటిక్వా, బార్బుడా, ఆగ్నేయ దిశలో నిర్జనమైన రెడోనా, మొంట్సెర్రాట్ ద్వీపాలు (ఇవి సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలు) ఉన్నాయి.యురేపియన్లు మొదట సెటిల్మెంట్లు ఏర్పరుచుకున్న కరీబియన్ ద్వీపాలలో సెయింట్ కిట్స్ అండ్ నేసిస్ ప్రథమస్థానంలో ఉంది.మొదటి బ్రిటిష్, ఫ్రెంచి కాలనీలకు సెయింట్ కిట్స్ మాతృనిలయంగా ఉంది.అందువలన ఇది " ది మదర్ కాలనీ ఆఫ్ వెస్ట్ ఇండీస్ " అని పేర్కొనబడింది.
పేరువెనుక చరిత్ర
మార్చుఆరంభాకలంలో ఈప్రాంతంలో నివసించిన " ఐలాండ్ కరీబియన్ (కరినాగో ప్రజలు) ఇండియన్లు సెయింట్ కిట్స్ ప్రాంతాన్ని " లియంయుగా "గా పిలిచారు. దీనికి "సారవంతమైన భూమి" అని అర్ధం. వాస్తవానికి ఈ ద్వీపంలో నివసించిన కాలినాగో ఇండియన్లు సెయింట్ కిట్స్ యొక్క పశ్చిమ శిఖరం " మౌంట్ లియామిగా " పేరును ఈప్రాంతానికి పెట్టారు. కొలంబియన్ కాలానీకి పూర్వం నెవిస్ ప్రాంతం "ఓవ్యూలీ" అని పిలువబడింది. ఈపదానికి "అందమైన జలాల భూమి" అర్ధం.
క్రిస్టోఫర్ కొలంబస్ 1493 లో ప్రస్తుత నెవిస్ ప్రాంతాన్ని చూసి ఆ ద్వీపానికి " శాన్ మార్టిన్ " అని నామకరణం చేసాడు. ప్రస్తుత పేరు "నెవిస్" అనే పేరు స్పానిష్ భాష అయిన " న్యుస్ట్రె సెనోరా డి లాస్ నీవ్స్ " నుండి తీసుకోబడింది. ఈ స్పానిష్‌లో ఈ పేరుకు అవర్ లేడీ ఆఫ్ స్నో " అని అర్ధం. ద్వీపంలో ఈ పేరును ఎవరు ఎన్నుకున్నారో తెలియదు, కానీ ఇది నాల్గవ శతాబ్దపు కాథలిక్ అద్భుతకధకు సంబంధించినది: రోం లోని " ఎస్క్విలైన్ కొండ " మీద వేసవికాలం హిమపాతం. బహుశా నెవిస్ శిఖరం పైభాగంలో ఉన్న శ్వేత మేఘాలు వేడి వాతావరణంలో అద్భుత హిమపాతం కథను గుర్తు చేశాయి. మొట్టమొదటి బ్రిటీష్ స్థావరంలో నెవిస్ ద్వీపం " దుల్సిన" గా పేర్కొనబడింది. ఈ పేరు స్పెయిన్‌భాషలో ఈపదానికి " మదురమైనది " అని అర్ధం. అయినప్పటికీ చివరిగా ఈద్వీపానికి అసలు స్పానిష్ పేరు పునరుద్ధరించబడింది క్రమంగా సంక్షిప్త రూపంలో, "నెవిస్"లో ఉపయోగించబడింది.
క్రిస్టోఫర్ కొలంబస్ ఈప్రాంతానికి " సెయింట్ కిట్స్ " అని నామకరణం చేసాడన్న విషయాన్ని కొందరు అంగీకరించడం లేదు. అనేక సంవత్సరాలుగా ద్వీపం " శాన్ క్రిస్టోబల్ " అని పిలువబడింది. సెయింట్ క్రిస్టోఫర్ తరువాత, అతని శిష్యులు, పర్యాటకులలో ఈపేరు కొనసాగింది. కొలంబస్ ద్వీపానికి " శాంట్ యోగో " (సెయింట్ జేమ్స్) అని నామకరణం చేసాడని కొత్త అధ్యయనాలు సూచిస్తున్నాయి. "శాన్ క్రిస్టోబల్" అనే పేరును కొలంబస్ చేత ఇప్పుడు సబ అని పిలువబడుతున్న ద్వీపానికి ఇవ్వబడింది. అది ఈప్రాంతానికి 20 మైళ్ళు వాయువ్యంగా ఉంది."శాన్ క్రిస్టోబల్" ఒక మ్యాపింగ్ దోషం ఫలితంగా మాత్రమే సెయింట్ కిట్స్ ద్వీపానికి వర్తింపజేయబడిందని భావిస్తున్నారు.
ఈ ద్వీపం 17 వ శతాబ్దం నాటికి "శాన్ క్రిస్టోబల్"గా నమోదు చేయబడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొట్టమొదటి ఆంగ్ల వలసవాదులు ఈ పేరును "సెయింట్ క్రిస్టోఫర్ ఐలాండ్"గా అనువదించారు. పిలిచారు. 17 వ శతాబ్దంలో, క్రిస్టోఫర్ క్రమంగా కిట్ లేదా కిట్ట్ అని మారింది.అందువలన ఈ ద్వీపం తరచూ అనధికారికంగా "సెయింట్ కిట్స్ ఐలాండ్"గా సూచించబడి, "సెయింట్ కిట్స్"గా మరింత కుదించబడింది.
ఈ రోజు రాజ్యాంగం "సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ", "సెయింట్ క్రిస్టోఫర్ , నెవిస్" రెండింటిని దేశవ్యాప్తంగా సూచిస్తుంది, కాని సాధారణంగా మొదటి పేరు ఉపయోగించబడింది.
చరిత్ర
మార్చుసెయింట్ కిట్స్, నెవిస్ ద్వీపాలలో ఐరోపియన్ల రాకకు ముందు ఐదువేల సంవత్సరాల పూర్వం స్థానిక అమెరికన్లు స్థిరపడ్డారు. ఇక్కడకు చివరిగా పెద్దసంఖ్యలో చేరుకున్న స్థానిక అమెరికన్లు, కలినాగో ప్రజలు యూరోపియన్ల రాకకు సుమారు మూడు శతాబ్దాల ముందు వచ్చారు. 1493 లో కొలంబస్ నాయకత్వంలో సాగించిన స్పానిష్ యాత్రలో ఐరోపావాసులు ఈప్రాంతాన్ని కనుగొన్నారు.
1538 లో, ఫ్రెంచ్ హ్యూగ్నోట్స్ సెయింట్ కిట్స్‌లో ఒక సెటిల్మెంట్ను స్థాపించారు. ఈ సెటిల్మెంటును స్పెయిన్ వెంటనే నాశనం చేసింది. ప్రాణాలతో బయటపడిన వారు ద్వీపాన్ని వదిలి వెళ్ళారు. జ్1623 లో ఇంగ్లీష్ సెటిల్మెంట్ స్థాపించబడింది. తరువాత త్వరలోనే ఫ్రెంచ్ సెటిల్మెంట్లు స్థాపించబడ్డాయి. ద్వీపం యురేపియన్ల సెట్లర్ల మద్య జరిగిన ఒప్పందం ద్వారా విభజించబడింది.యుద్ధరంగంలో కలినాగో ప్రజలు స్పానిష్ ప్రజలకు మద్దతు ఇచ్చారు.[4] ఫ్రెంచి, ఇంగ్లీష్ వారు ఆర్థికంగా, సైనికపరంగా శక్తివంతులై దూకుడుగా వ్యవహరించారు.[5] ఫ్రెంచి, ఇంగ్లీష్ వనరులను దోచుకొనడం ద్వారా స్వయంసంపన్నత సాధించాలని యూచించారు.[6] ఇది అర్ధంచేసుకున్న సెయింట్ కిట్స్ నివాసులు సెటిల్మెంట్లు స్థాపించడాన్ని అడ్డగించారు.సెటిల్మెంట్లు స్థాపించబడిన మూడు సంవత్సరాల కాలం కలినాగో ప్రజల సాయంతో పోరాటం కొనసాగింది.[7]
సెయింట్ కిట్స్ సెటిల్మెంట్లను స్థాపించే ప్రక్రియ మొత్తం, మిగిలిన కరేబియన్ ప్రాంతాలలో ఫ్రెంచ్, ఆంగ్లేయ పూర్వీకులు చేసినట్లు కాలినాగోలను బానిసలుగా మార్చడం, తరిమివేయడం, నిర్మూలించడం వంటి చర్యలను కొనసాగించారు. తరువాత వారికి కరినాగోల నుండి భూముల ఆక్రమణలలో ఎదురైన అడ్డగింత యురేపియన్ ఆధీనతలో ఉన్న ప్లాంటేషన్ ఆర్థికప్రయోజనాలకు భగంగంవాట్టిల్లగదన్న భీతిని కలిగించింది.[8] 1626 నాటికి ఆగ్లో ఫ్రెంచి సెటిలర్లు కలినాగోలను నాశనం చేయడానికి సైన్యాలను సమీకరించారు.కలినాగోలను చంపడం, తరిమివేయడం [9] లేక హింసలకు గుచేయడం యురేపియన్ సెటిలర్ల ప్రణాళికలో భాగంగా ఉంది.[10] ఐరోపా వలసరాజ్య వాదులు మూడు సంవత్సరాల పాటు ఈ ద్వీపంలో బలవంతగా తమ ఉనికిని కొనసాగించారు.
స్పానిష్ దాడికారులు పంపిన స్పానిష్ నావికదళాలు ఆంగ్ల, ఫ్రెంచ్ కాలనీలను నాశనం చేసింది, 1629 లో స్థిరపడిన వారి దేశాలకు తిరిగి పంపించింది. యుద్ధ పరిష్కారంలో భాగంగా 1609 లో స్థాపించబడిన ఇంగ్లీష్, ఫ్రెంచ్ కాలనీల పునఃస్థాపించడానికి స్పెయిన్ అనుమతించింది.
స్పానిష్ అధికారం క్షీణించడంతో, సెయింట్ కిట్స్ నుండి కరేబియన్‌లోకి ఇంగ్లీష్, ఫ్రెంచ్ వలసదారులు విస్తరించడానికి ప్రధాన పునాది అయింది. సెయింట్ కిట్స్ నుండి బ్రిటీష్ వారు ఆంటిగ్వా, మోంట్సిరాట్, అంగుల్లా, టోర్టోల దీవులలో స్థిరపడ్డారు, ఫ్రెంచ్ మార్టినిక్, గ్వాడెలోప్ ద్వీపసమూహం, సెయింట్ బార్ట్స్‌లో స్థిరపడ్డారు. 17 వ శతాబ్దం చివరలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ సెయింట్ కిట్స్ మీద నియంత్రణ కోసం పోరాడారు. 1713 లో ఫ్రెంచ్ ఈ ప్రాంతాన్ని బ్రిటన్‌కు అప్పగించింది.
చిన్న పరిమాణంలో ఉండి, రెండు ద్వీపాలను 2 మైళ్ళ (3 కి.మీ.) నీరు మాత్రమే వేరు చేస్తున్నప్పటికీ ఈ ద్వీపాలు 19 వ శతాబ్దం చివరకు రెండు ప్రత్యేక దేశాలుగా చూడబడి పాలించబడ్డాయి. బ్రిటీష్ వారు బలవంతంగా ఈద్వీపాలను ఆంగులా ద్వీపంతో సమైక్యం చేసింది. అయినప్పటికీ ప్రస్తుతం ఇరుద్వీపాల మద్య సంఘర్షణలు కొనసాగుతున్నాయి. సెయింట్ కిట్స్ తన అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు నెవిస్ ఆరోపిస్తుంది.
సెంట్రల్ కిట్స్, నెవిస్, అంగుల్లాతో కలిసి 1967 లో పూర్తిస్థాయి అంతర్గత స్వయంప్రతిపత్తి కలిగిన దేశంగా మారింది. 1977 లో ఆంగ్విలియన్లు తిరుగుబాటు చేసి ఇతర ద్వీపాల నుండి వేరు పడ్డారు.1983 లో సెయింట్ కిట్స్, నెవిస్ స్వాతంత్ర్యం సాధించారు. ఇది అమెరికాలో నూతన సార్వభౌమ రాజ్యం అయింది. ఆగస్టు 1998 లో, సెయింట్ కిట్స్ నుండి వేరుచేయడానికి నెవిస్‌లో నిర్వహించబడిన ప్రజాభిప్రాయ సేకరణలో మూడింట రెండు వంతుల మెజారిటీకి ఒక ఓటు తక్కువగా ఉంది.[11] 1998 సెప్టెంబరులో జార్జియస్ తుఫాను దేశానికి దాదాపు $ 4,58,000 డాలర్ల ఆస్తి నష్టాన్ని కలిగించింది. 20వ శతాబ్దంలో ద్వీపాలకు అత్యంత నష్టాన్ని కలిగించిన తుఫానులలో జార్జెస్ తుఫాను మొదటి స్థానంలో ఉంది.
భౌగోళికం
మార్చుదేశంలో సెయింట్ కిట్స్, నెవిస్ అనే రెండు ద్వీపాలు ప్రధాన భూభాగాలుగా ఉన్నాయి. లిముయిగా పర్వతాలలో ఉన్న సముద్రమట్టానికి 1,156 మీ ఎత్తైన శిఖరం దేశంలో అత్యంత ఎత్తైన భూభాగంగా భావించబడుతుంది. అగ్నిపర్వతాలున్న మద్యపర్వత శిఖర భూభాగం ఉష్ణమండల వర్షారణ్యాలతో కప్పబడి ఉంది. నిటారుగా ఉండే ఈభూభాగం అధికంగా నిర్జనంగా ఉంటుంది. రెండు ద్వీపాలలోని ప్రజలు అధికంగా సముద్రానికి సమీపంలో ఉన్న మైదాన భూభాగంలో నిచసిస్తున్నారు.రెండు ద్వీపాలలో ప్రవహిస్తున్న అసంఖ్యాకమైన నదులు ప్రజలకు అవసరమైన స్వచ్ఛజలాలను అందిస్తున్నాయి. సెయింట్ కిట్స్‌లో ఒక చిన్న సరసు, ఉప్పునీటి మడుగు ఉంది.జాతీయపక్షి " బ్రౌన్ పెలికన్ ".[12]
ఆర్ధికం
మార్చుసెయింట్ కిట్స్, నెవిస్ ఒక జంట-ద్వీప సమైక్యదేశం. దేశఆర్థిక వ్యవస్థలో పర్యాటకరంగం, వ్యవసాయరంగం, కాంతి ఉత్పాదక పరిశ్రమలు ఆధిక్యత కలిగి ఉన్నాయి. 1940 ల నుండి చెక్కెర ఎగుమతి ప్రధాన్యత ఆర్థికరంగంలో కలిగి ఉంది. కానీ పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం తరుగుతున్న ప్రపంచ మార్కెట్ ధరలు, చక్కెరేగుమతి మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు వ్యవసాయ రంగంలో వైవిధ్యమైన ఇతర ఉత్పత్తికి దారితీసింది. 2005 లో ప్రభుత్వానికి స్వంతమైన చక్కెర సంస్థను మూసివేయాలని నిర్ణయించింది. ఈచర్య ఆర్థికనష్టాన్ని కలిగించి, గణనీయంగా ద్రవ్యలోటు ఏర్పడడానిక్ దోహదపడింది.
మునుపటి చక్కెర తోటలన్నీ ప్రధానభూభాగం సెయింట్ కిట్స్ భూభాగంలో ఉన్నాయి. సెయింట్ జాన్ కాపెస్టర్, క్రైస్ట్చర్చ్ యొక్క పారిష్ల ఆధ్వర్యంలో ద్వీపంఉత్తర భాగంలో నిర్మాణరంగ అభివృద్ధిలో భాగంగా అనేక చెరకు ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాలు కాల్చివేయబడి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, పర్యాటకం, ఎగుమతి ఆధారిత తయారీ పరిశ్రమల కొరకు, విదేశీ-బ్యాంకింగ్ రంగాలు అభివృద్ధి చేయబడ్డాయి. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకరంగం ప్రధానపాత్ర వహిస్తుంది. అలాగే పర్యాటక రంగం సెయింట్ కిట్స్, నెవిస్ లకు ప్రధాన విదేశీ మారకందారుగా మారింది. ప్రస్తుతం దేశంలో దుస్తులు తయారీ పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు విజయవంతంగా అభివృద్ధి చేయబడ్డాయి.
సెయింట్ కిట్స్ ఆర్థిక వ్యవస్థ పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది. 1978 నుండి ద్వీపంలో పర్యాటక రంగం విస్తరించబడింది.2009 లో సెయింట్ కిట్స్‌కు 5,87,479 మంది పర్యాటకులు సందర్శించారు. 2007 లో 3,79,473 మంది పర్యాటకులు సందర్శించారు. గతరెండు సంవత్సరాల కాలంలో పర్యాటకరంగం 40% అభివృద్ధి చెందింది. పర్యాటకరంగం కారణంగా వసతిగృహాల ఆవశ్యకత అధికరిస్తుంది.పర్యాటకరంగ విస్తరణ కొరకు సెయింట్ కిట్స్ తన వార్షిక సెయింట్ కిట్స్ " వార్షిక సంగీత ఉత్సవాలు " (మ్యూజిక్ ఫెస్టివల్ను) నిర్వహిస్తుంది.
1984లో సెంట్రల్ కిట్ట్స్ & నెవిస్ పౌరసత్వ చట్టంలో సవరణలు చేసి " సిటిజన్‌షిప్ బై ఇంవెస్టుమెంట్ ప్రోగాం " ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన వారు నిర్మాణరంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశపౌరసత్వం పొందవచ్చు.[13]
రవాణా
మార్చుసెయింట్ కిట్స్, నెవిస్‌లో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. సెయింట్ కిట్స్ ద్వీపంలో " రాబర్ట్ ఎల్. బ్రాడ్షా అంతర్జాతీయ విమానాశ్రయం" వైశాల్యపరంగా పెద్దది. ఇక్కడ నుండి కరేబియన్, ఉత్తర అమెరికా, ఐరోపాలకు విమానసేవలు అందించబడుతున్నాయి. ఇతర విమానాశ్రయాలలో " వాన్స్ డబల్యూ. అమోరీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " (ఇది నెవిస్ ద్వీపంలో ఉంది), ఇక్కడ నుండి ఇతర కరేబియన్ ప్రాంతాలకు విమానాలను సేలవలు అందించబడుతున్నాయి.
పెట్టుబడి ఆధారిత ఆర్ధిక పౌరసత్వం
మార్చుసెయింట్ కిట్స్ ప్రభుత్వం " ఇంవెస్ట్మెంటు ప్రోగ్రాం " ద్వారా విదేశీయులకు పౌరసత్వం మంజూరుచేయడానికి వీలుగా చట్టసవరణ చేసింది.ఈ కార్యక్రం అమలుద్వారా దేశంలో నిర్మాణరంగంలో పెట్టుబడి పెట్టిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించబడింది. [14] 1984 లో స్థాపించబడిన, సెయింట్ కిట్స్ 'పౌరసత్వం కార్యక్రమం ప్రపంచం చరిత్రలో మొదటిదిగా గుర్తించబడుతుంది. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతి పురాతనమైనది అయినప్పటికీ, 2006 లో హెన్లీ & పార్టనర్స్, గ్లోబల్ పౌరసత్వ సలహా సంస్థ, దేశపు చక్కెర పరిశ్రమకు విరాళాలను సేకరించడానికి కార్యక్రమ పునర్నిర్మాణంలో పాల్గొంది.[15]
సెయింట్ కిట్స్ 'పౌరసత్వం-ద్వారా-పెట్టుబడి కార్యక్రమం దేశానికి బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. సెయింట్ కిట్స్, నెవిస్ పౌరసత్వం కార్యక్రమంలో మీరు పౌరసత్వాన్ని పొందిన వ్యక్తి, అతని కుటుంబం జీవితపర్యంతం పూర్తి పౌరసత్వం పొందుతారు, అంతేకాక వ్యక్తి సంతతికి చెందిన భవిష్యత్ తరాలకు పౌసత్వహక్కులు సంక్రమిస్తాయి. సెయింట్ కిట్స్, నెవిస్ పౌరులు, మీరు, మీ కుటుంబం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాస్పోర్ట్‌తో పౌరసత్వం పొందిన వ్యక్తి ఐరోపా దేశాలన్నింటితో మొత్తం 130 కంటే ఎక్కువ దేశాలకు [16], టెర్రిటరీలకు విసారహిత ప్రయాణానికి అనుమతి లభిస్తుంది.ఈ పౌరసత్వం పొందిన వ్యక్తి సెయింట్ కిట్స్, నెవిస్ అలాగే కరికోం సభ్యత్వం కలిగిన దేశాలలో ఎప్పుడైనా, ఎంతకాలమైనా నివసించడానికి అవకాశం లభిస్తుంది.[17] దేశంలో పెట్టుబడుల కార్యక్రమం రూపుదాల్చడానికి అభ్యర్థి పలు చట్టపరమైన స్థాయిలను దాటుతూ ముందుకు పోవాలి.[17] పెట్టుబడి కార్యక్రమంలో పౌరసత్వానికి అర్హత పొందడానికి అభ్యర్థి చట్టపరంగా కోరబడుతున్న పూర్తి వివరాలు అందించాలి. సెయింట్ కిట్స్, నెవిస్ యొక్క ఆర్థిక పౌరసత్వం కోసం అర్హత పొందిన అభ్యర్థి, ఆమోదించబడిన రియల్ ఎస్టేట్ లేక షుగర్ ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్ ఫౌండేషన్ (పబ్లిక్ ఛారిటీ) లో కనీస పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది.హెంరీ, పార్టనర్లు అందిస్తున్న వివరాల ఆధారంగా అభ్యర్థి చట్టపరంగా ఈ వివరాలను అందించాలి. [18][19]
- 4,00,000 డాలర్ల కనీస విలువైన ద్రవ్యాన్ని నియమించబడిన రియల్ ఎస్టేట్లో పెట్టుబడి చేయాలి. అదనంగా ప్రభుత్వ రుసుము చెల్లింపులు, ఇతర రుసుములు, పన్నులు చెల్లించాలి.
- షుగర్ ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్ ఫండుకు కనీసం $ 2,50,000 డాలర్లు అన్ని ప్రభుత్వ రుసుములతో కలిపి కానీ రియల్ ఎస్టేట్ ఎంపికకు సమానమైన ఫీజులు చెల్లించాలి.
గణాంకాలు
మార్చుసైయింట్ కింట్స్‌లో ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు 75.1%,ఆఫ్రో - యురేపియన్ 12.3%, మిశ్రిత జాతి 5.3%, ఇండో కరీబియన్లు, ఆఫ్రో ఈస్టిండియన్లు 5%, ఇతరులు 3.3%, దక్షిణాసియన్లు 3% ఉన్నారు.[20]In July 2000[update], దేశంలో జనసంఖ్య 42,696.ప్రజల ఆయుఃప్రమాణం 72.4 సంవత్సరాలు. దేశం నుండి విదేశాలకు పోతున్న ప్రజల సంఖ్య అత్యధికంగా ఉంది. ఫలితంగా దేశజనసఖ్య 1960 కంటే (జనసంఖ్య 51,100) 25% క్షీణించింది.[ఆధారం చూపాలి]
సెయింట్ కిట్స్, నెవిస్ నుండి యునైటెడ్ స్టేట్స్‌కు వలసల వివరణ:[12]
- 1986–1990: 3,513
- 1991–1995: 2,730
- 1996–2000: 2,101
- 2001–2005: 1,756
- 2006–2010: 1,817
సంస్కృతి
మార్చుసెయింట్ కిట్స్ అధికార భాష ఇంగ్లీష్. దేశమంతటా సెయింట్ కిట్స్ క్రియోల్ భాషకూడా వాడుకలో ఉంది.సెయింట్ కిట్స్, నెవిస్ ప్రాంతం పలు సంగీత కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది.డిసెంబరు 18 నుండి జనవరి 3వరకు సెయింట్ కిట్స్ ప్రాంతంలో కార్నివల్ నిర్వహించబడుతుంది. జూన్‌లో చివరి వారంలో నిర్వహించబడే " సెయింట్ కిట్స్ మ్యూజిక్ ఫెస్టివల్ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. ఏడురోజుల కాలం నిర్వహించబడే కల్చరామా ఉత్సవాలు జూలై చివరి భాగం నుండి ఆగస్టు మొదటి భాగం వరకు నిర్వహించబడుతుంటాయి.[21] అదనంగా సెయింట్ కిట్ట్స్ ద్వీపంలో నిర్వహించే పండుగలు , ఉత్సవాలలో ఫిబ్రవరి నెలలో నికోల టౌన్ (మొనిలాయక్స్)లో నిర్వహించబడే ఇన్నర్ సిటీ ఫెస్ట్, గ్రీన్ వ్యాలీ ఫెస్టివల్ (ఇది సాధారణంగా కాయోన్ గ్రామంలో విట్ సోమవారం నిర్వహించబడుతుంటుంది), శాండీ పాయింట్ గ్రామంలో ఈస్టర్ ఈస్టర్ పండుగ సందర్భంలో నిర్వహించబడుతుంటుంది, టాబర్నికల్ గ్రామంలో జూలై లేదా ఆగస్టులో ఫెస్ట్-టాబ్ నిర్వహించబడుతూ ఉంటుంది. సెయింట్ కిట్స్ , నెవిస్ లోని కాస్టిస్టెర్ ప్రాంతంలో (19 సెప్టెంబర్) లో స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించబడుతుంటుంది, ఈ వేడుకలలో సాధారణంగా వీధి నృత్యాలు , సల్సా మ్యూజిక్ జాజ్, సోకా మ్యూజిక్, కాలిప్సో మ్యూజిక్ , స్టీల్పాన్ సంగీతం భాగంగా ఉంటాయి.1985 సెయింట్ కిట్స్‌లో మిస్సింగ్ ఇన్ యాక్షన్ 2: ది బిగినింగ్ చలనచిత్రం చిత్రీకరించబడింది.[22]
క్రీడలు
మార్చుసెయింట్ కిట్స్ , నెవిస్ దేశంలో ప్రజలకు క్రికెట్ అభిమానక్రీడగా ఉంది.సెయింట్ కిట్స్ క్రీడాకారులు వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం తరఫున అంతర్జాతీయ క్రికెట్ క్రీడలలో పాల్గొంటున్నారు.కీ.శే. రునాల్డ్ మొర్టన్ స్వస్థలం నెవిస్. 2007 వరల్డ్ క్రికెట్ కప్ పోటీ క్రీడలకు ఆతిధ్యం ఇచ్చిన దేశాలలో సెయింట్ కిట్స్ , నెవిస్ అతిచిన్న దేశంగా ప్రత్యేకత సంతరించుకుంది.[23] సాధారణంగా సెయింట్ కిట్స్ , నెవిస్‌లో రగ్బీ , నెట్ బాల్ క్రీడలు అభిమాన క్రీడలుగా ఉన్నాయి.
సమీపకాలంలో " సెయింట్. కిట్స్ అండ్ నెవిస్ నేషనల్ ఫుట్ బాల్ టీం " (" షుగర్ బాయ్జ్ "గా పిలువబడుతుంది) కొన్ని అంతర్జాతీయ విజయాలు సాధించింది. " 2006 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ " (కాంకాకాఫ్) సెమీఫైనల్ అర్హత వరకు పురోగతి సాధించిందింది. ఇది గ్లెన్స్ గ్లాస్గో నాయకత్వంలో వారు యు.ఎస్.వర్జిన్ దీవులు , బార్బడోస్ ను ఓడించి సెమీ ఫైనల్ చేరుకున్నారు.
ఈ రెండు ద్వీపాల్లోని క్యూ స్పోర్ట్స్ కోసం పరిపాలక విభాగంగా " సెయింట్ కిట్స్, నెవిస్ బిలియర్డ్ ఫెడరేషన్ " (ఎస్.కె.ఎన్.బి.ఎఫ్) పని చేస్తుంది. ఎస్.కె.ఎన్.బి.ఎఫ్ " కరేబియన్ బిలియర్డ్స్ యూనియన్ " (సి.బి.యు.) సభ్యత్వం కలిగి ఉంది. ఎస్.కె.ఎన్.బి.ఎఫ్ ప్రెసిడెంట్ " స్టీవ విలియమ్స్ " సి.బి.యు. వైస్ ప్రెసిడెంట్ పదవికి బాధ్యత వహిస్తున్నాడు.
కిమ్ కాలిన్స్ దేశంలో మొట్టమొదటి ట్రాక్ , ఫీల్డ్ అథ్లెట్‌గా గుర్తించబడుతున్నాడు. ఆయన " వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆఫ్ అథ్లెటిక్స్ ", " కామన్వెల్త్ గేమ్స్ " , " 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పోటీలో బంగారు పతకాలు గెలుచుకున్నాడు, అతను దేశంలో మొట్టమొదటి అథ్లెట్‌గా ఒలింపిక్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. బీజింగ్‌లో, " 2008 సమ్మర్ ఒలంపిక్స్ "లో ఆయన , మరో ముగ్గురు అథ్లెట్లతో 2008 సెంట్రల్ ఒలింపిక్స్‌లో సెయింట్ కిట్స్ , నెవిస్ తరఫున పాల్గొన్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో నిర్వహించబడిన " 2011 ప్రపంచ ఛాంపియన్షిప్ " పోటీలలో నలుగురు క్రీడాకారులు పాల్గొన్న రిలే బృందం 100మీటర్ల పోటీలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
అమెరికన్ రచయిత , మాజీ ఫిగర్ స్కేటర్ , ట్రైథైలెటె " కాథరిన్ బెర్టైన్ "కు సెయింట్ కిట్స్ , నెవిస్ ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వం ఇచ్చి సత్కరించింది.ఆమె 2008 వేసవి ఒలింపిక్స్ క్రీడలలో సెయింట్ కిట్స్ , నెవిస్‌కు తరఫున " మహిళల రోడ్ సైకిల్ రేసింగ్ " ప్రాతినిధ్యం వహించింది. ఆమె కథ ఇ.ఎస్.పి.యన్. కామ్‌లో ప్రదర్శితమైన ఇ.టికెట్ ఫీచర్‌లో భాగంగా "సో యు వన్నా బి యాన్ ఒలింపియన్?" పేరుతో ప్రదర్శించబడింది.అయినప్పటికీ ఆమె ఒలింపిక్ అర్హత కోసం ఆమె అవసరమైన పాయింట్లు సాధించలేకపోయింది.[24] సెయింట్ కిట్స్, నెవిస్‌కి చెందిన రోనాల్డ్ డగ్లస్, జేంస్ వీకెస్ అనే ఇద్దరు అథ్లెట్లు " 2010 రోడ్ వరల్డ్ చాంపియన్‌షిప్ " పోటీలలో పాల్గొన్నారు.[25]
ఆరోగ్యం , విద్య
మార్చుదేశంలో ప్రభుత్వనిర్వహణలో ఉన్న హైస్కూల్స్, సెకండరీ స్కూల్స్ ఎనిమిది ఉన్నాయి. అలాగే పలు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
ప్రభుత్వ హౌస్కూల్స్ , మాద్యమిక పాఠశాలలు
మార్చు- కాయోన్ హై స్కూల్ (సి.హెచ్.ఎస్.)
- బస్సెటెరే హై స్కూల్ (బి.హె.ఎస్)
- వాషింగ్టన్ అర్చిబాల్డ్ హై స్కూల్ (డబల్యూ.ఎ.హెచ్.ఎస్.)
- వర్చిల్డ్స్ హై స్కూల్ (వి.హెచ్.ఎస్.)
- సాలెర్స్ సెకండరీ స్కూల్ (ఎస్.ఎస్.ఎస్.)
- చార్లెస్ ఈ. మిల్స్ సెకండరీ స్కూల్ (సి.ఇ.ఎం.ఎస్.ఎస్)
- చార్లెస్టౌన్ సెకండరీ స్కూల్ (సిఎస్.ఎస్.), నెవిస్
- గిన్లాండ్ ల్యాండ్ సెకండరీ స్కూల్ (జి.ఎస్.ఎస్.), నెవిస్
ప్రైవేట్ హైస్కూల్స్ , సెకండరీ స్కూల్స్
మార్చు- సెయింట్ థెరస్సాస్ కాంవెంట్ స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్,
- లిన్ జెఫర్స్ సెకండరీ స్కూల్
- మానృఎస్సర్రీ చిల్డ్రెన్ స్కూల్
- ఎస్.కె.ఐ అకాడమీ స్కూల్
కేంసర్ సెంటర్
మార్చుఆంటిక్వాలో ఉన్న మౌంట్ సెయింట్. జాన్ హాస్పిటల్ సెయింట్ కిట్స్, నెవిస్ ప్రజలకు, కరీబియన్ ప్రజలకు రేడియోథెరఫీ చికిత్స, కిమోథెరఫీ చికిత్స అందిస్తున్న కారణం ఇలాంటి చికిత్స కొరకు యునైటెడ్ స్టేట్స్, యు.కె లకు వెళ్ళవలసిన అవసరం తగ్గింది.[26][27] ఆరంభం నుండి ఈ ప్రణాళికను " డాక్టర్. ఆర్థర్ పోర్టర్ " నిర్వహిస్తున్నాడు.[26][28][29][30]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "St. Kitts and Nevis". International Monetary Fund. 2016. Retrieved 1 April 2016.
- ↑ "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. Retrieved 23 March 2017.
- ↑ "1983 Saint Kitts and Nevis Constitution". pdba.georgetown.edu. Retrieved 30 August 2017.
- ↑ Cobley, 1994, p. 24
- ↑ Cobley, 1994, p. 26
- ↑ Taylor, Patrick (2010). The Encyclopedia of Caribbean Religions, Volume 1 A-L. Urbana, IL, Chicago, IL, and Springfield, IL: University of Illinois Press. p. 886.
- ↑ Cobley, 1994, p. 28.
- ↑ Cobley, 1994, p. 27.
- ↑ Jonnard, Claude M. (2010). Islands in the Wind: The Political Economy of the English East Caribbean. Bloomington, IN: iUniverse. p. Page number not available.
- ↑ Du Tertre, Jean-Baptiste (1667). Histoire générale des Antilles habitées par les François, 2 vols. Paris: Jolly, 1667, I:5–6.
- ↑ "Nevis islanders apparently vote not to break away". Milwaukee Journal Sentinel. Associated Press. 11 August 1998. Archived from the original on 18 మే 2016. Retrieved 15 సెప్టెంబరు 2017.
- ↑ 12.0 12.1 "Homepage". Uscis.gov. Retrieved 30 August 2017.
- ↑ "St.Kitts-Nevis and the Republic of Ireland sign Tax Agreement". Ntltrust.com. Archived from the original on 31 ఆగస్టు 2017. Retrieved 30 August 2017.
- ↑ "Citizenship-by-Investment Introduction". Archived from the original on 22 జూన్ 2013. Retrieved 17 June 2013.
- ↑ Abrahamian, Atossa Araxia (2015). The Cosmopolites: The Coming of the Global Citizen. Columbia Global Reports. ISBN 978-0-9909763-6-3.
- ↑ "Visa Restriction Index 2006 to 2016". Visaindex.com. Retrieved 2016-07-20.
- ↑ 17.0 17.1 "Saint Christopher & Nevis Citizen by Investment Regulations". Ciu.gov.kn. Archived from the original (PDF) on 16 ఆగస్టు 2013. Retrieved 15 సెప్టెంబరు 2017.
- ↑ Kalin, Christian H. (2015). Global Residence and Citizenship Handbook. Ideos Publications. ISBN 978-0992781859.
- ↑ "Citizenship Investment in St. Kitts and Nevis - Henley & Partners". Henleyglobal.com. Archived from the original on 2015-10-19. Retrieved 2016-07-20.
- ↑ Ben Cahoon (2000). "Saint Kitts and Nevis". Worldstatesmen.org. Retrieved 17 July 2010.
- ↑ Cameron, pg.502
- ↑ "Missing in Action 2-The Beginning Review". Movies.tvguide.com. Archived from the original on 20 జనవరి 2012. Retrieved 2 November 2011.
- ↑ "St Kitts ramps up to host ICC Cricket World Cup in 2007". Caribbean.com. Archived from the original on 2016-11-22. Retrieved 2016-11-22.
- ↑ "E-ticket: So You Wanna Be An Olympian, Part 13". ESPN.com. Retrieved 30 August 2017.
- ↑ Rob Jones. "UCI Road World Championships 2010: Elite Men Results - Cyclingnews.com". Cyclingnews.com. Retrieved 2016-04-07.
- ↑ 26.0 26.1 "Cancer Treatment Center in the Works For St. Kitts And Nevis". Kittivisianlife.com/. 7 August 2011. Archived from the original on 5 సెప్టెంబరు 2017. Retrieved 15 సెప్టెంబరు 2017.
- ↑ "Work resumes on Eastern Caribbean cancer centre in Antigua". caribbeannewsnow.com/. 5 March 2013. Archived from the original on 31 ఆగస్టు 2017. Retrieved 15 సెప్టెంబరు 2017.
- ↑ "Don't Forget Arthur Porter". Thestkittsnevisobserver.com/. 29 November 2013. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 15 సెప్టెంబరు 2017.
- ↑ "No proof Dr. Arthur Porter was acting as Sierra Leone diplomat when arrested in Panama, says envoy to Canada". thestar.com/. 4 June 2013.
- ↑ "In St. Kitts, passport 'sales' lead to escalating political drama". Groups.google.com. 9 June 2014.