నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్
సాధారణంగా NTT అని పిలవబడే నిప్పొన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (日本电信电话 నిప్పాన్ Denshin Denwa Kabushiki-gaisha) జపాన్ లోని టోక్యో కేంద్రంగా పని చేసే టెలీకమ్యూనికేషన్స్ సంస్థ. ఆసియాలోనే అతి పెద్ద టెలి కమ్యూనికేషన్ సంస్థ అయిన NTT ఫార్చ్యూన్ గ్లోబల్ 500 చే 29 వ స్థానాన్ని పొందినది, ఆదాయంలో ప్రపంచంలో ద్వితీయ స్థానం పొందినది.
నిప్పొన్ టెలిగ్రాఫ్, టెలిఫోన్ కార్పొరేషన్ కు న్యాయపరమైన సహకారాన్ని అందించేందుకు NTT LAW ని రూపొందించే క్రమంలో ఇది నెలకొల్ప బడింది. జపాన్ దేశపు తూర్పు, పడమర ప్రాంతాలకి చెందిన NTT East, NTT West ల మధ్య సమంవయం కుదర్చటానికి, రెండు ప్రాంతాల NTT చే ఇష్యూ చేయబడ్డ అన్ని షేర్లను ఏకీకృతం చేయటానికి, తద్వారా దేశమంతటా (గ్రామ స్థాయిలో కూడా) సమగ్ర టెలికాం సేవలని అందించటమే కాకుండా, ఈ టెలికాం సేవలని మరింత విస్తృత పరచటానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి కొరకు ఏర్పడ్డదే నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్.
టోక్యో, ఒసాకా, నగోయా, ఫుకువోకా, సప్పొరో, న్యూయార్క్, లండన్ స్టాక్ ఎక్స్చేంజీ లలో NTT చేర్చబడిననూ దాదాపుగా మూడవ వంతు షేర్లను NTT LAW నేతృత్వంలో జపాన్ ప్రభుత్వం కే సొంతం.
చరిత్ర
మార్చుప్రభుత్వ రంగ సంస్థగా 1953 లో స్థాపించబడిన నిప్పొన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ పబ్లిక్ కార్పొరేషన్ 1985 లో (టెలికాం మార్కెట్ లో పోటీ తత్వం పెంచే ఉద్దేశం తో) ప్రైవేటు పరం చేశారు. 1987 లో NTT 36.8 డాలర్ల అతి పెద్ద స్టాక్ ఆఫరింగ్ చేసింది.
బాహ్య లంకెలు
మార్చు- ఎన్ టీ టీ గ్రూప్ Archived 2011-02-27 at the Wayback Machine