నిప్పులగుండం అనేది భక్తితో నిప్పులపై నడవడానికి ఏర్పాటు చేసేది. హిందువులు, ముస్లింలు సైతం దీనిని ఆచరిస్తారు.

నిప్పుల గుండం ఏర్పాటు

మార్చు
 
నిప్పులగుండం వెలిగించే ప్రక్రియ

నేలపై పొడవుగా సుమారు 10 అడుగుల నుండి ఆపై కావలసినంత వరకూ సుమారు అడుగు లోతు వరకూ గొయ్యి తీస్తారు. దానిలో వరుసలుగా కట్టెలను నిలబెట్టి వాటిపై భక్తులు వారి ఇచ్చానుసారం ఆవు నెయ్యి పోస్తారు. పూజానంతరం వాటిపై హారతి కర్పూరం పెట్టి గుడిలో దేవునికి హారతి ఇచ్చి దానితో ఆ కట్టెలను వెలిగిస్తారు. నిప్పులు ఎప్పుడూ కణకణలాడుతూఉండేలా వాటిని చేటలు విసనకర్రలు లాంటి వాటితో వుసురుతూ ఉంటారు.

ఎందుకు, ఎవరు తొక్కుతారు

మార్చు

పలు రకాల మొక్కులు మొక్కి నిప్పులగుండం తొక్కేవారున్నారు, కేవలం దైవకార్యంగా తొక్కుతారు, ఎలా ఉంటుందో అని తొక్కేవారుంటారు.

హిందువుల పండుగలలో నియమాలు

మార్చు

నిప్పుల గుండం తొక్కేటందుకు కొన్ని నియమాలు ఉన్నాయి.అవి

  • ముందురోజు రాత్రి పెందలకడనే శాత్వికాహారం తీసుకోవాలి, దాని తదనంతరం మరునాడు ఏ విదమైన ఆహారం తీసుకోరాదు.
  • తెల్లవారు జామునే లేచి గుడికి వచ్చి దేవునితోపాటు దగ్గరలోని కాలువ లేదా చెరువుకు స్నానం కొరకు వెళ్ళాలి
  • స్నానానంతరం కొత్త వస్త్రాలు, లేదా ఉతికిన వస్త్రాలను ధరించాలి.
  • వస్త్రానంతరం వారు ఎవరినీ తాకరాదు. గుడిలో, లేదా పరిశరాలలోనే ఉండాలి
  • రాత్రి వరకూ గుడిలో జరిగే అన్ని కార్యక్రమాలలో వారిని పాల్గొననిస్తారు
  • రాత్రి హోమగుండం వెలిగించేముందు మరొక్కసారి చన్నీటితో స్నానం చేస్తారు.
  • హోమగుండం ప్రవేశం ముందు టెంకాయ కొట్టి నిప్పులపై ప్రవేశిస్తారు.

ముస్లిం పండుగలలో

మార్చు

పీర్లపండుగలలో నిప్పులగుండం తొక్కే సంసృతి ముస్లింలలో ఉంది.