నిరూపా రాయ్

భారతీయ చలనచిత్ర నటి

నిరూపా రాయ్ (జన్మనామం కోకిలా కిశోర్‌చంద్ర బల్సార; 4 జనవరి 1931 – 13 అక్టోబర్ 2004) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ సినిమాలలో అధికంగా నటించింది. విషాదమైన పాత్రలలో, కరుణ రసం ఒలికించే పాత్రలలో ఈమె తన నటనా ప్రతిభను చాటింది.[1] హిందీ సినిమా వర్గాల్లో ఈమెను తరచుగా క్వీన్ ఆఫ్ మిజరీగా పిలుస్తారు. ఈమె 1946 నుండి 1999 వరకు నటనా రంగంలో చురుకుగా పనిచేసింది. తల్లి పాత్రలలో ఈమె ఎక్కువగా రాణించింది.[2][3] నిరూపా రాయ్ 250కు పైగా సినిమాలలో నటించింది. ఈమె ఫిల్మ్‌ఫేర్ అవార్డులను మూడుసార్లు గెలుచుకుంది. 2004లో ఫిల్మ్‌ఫేర్ జీవనసాఫల్య పురస్కారాన్ని దక్కించుకుంది.

నిరూపా రాయ్
జననం
కోకిలా కిశోర్‌చంద్ర బల్సార

(1931-01-04)1931 జనవరి 4
వల్సాడ్, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా
మరణం2004 అక్టోబరు 13(2004-10-13) (వయసు 73)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుక్వీన్ ఆఫ్ మిజరీ, ట్రాజడీ క్వీన్, మదర్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1946–1999
జీవిత భాగస్వామికమల్ రాయ్
పిల్లలు2
పురస్కారాలుమునిమ్‌జీ చిత్రానికిఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డ్ (1956)
ఛాయా చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డ్ (1962)
షెహనాయ్ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డ్(1965)
ఫిల్మ్‌ఫేర్ జీవనసాఫల్య పురస్కారం (2004)

ఆరంభ జీవితం

మార్చు

ఈమె అసలు పేరు కోకిలా కిశోర్‌చంద్ర. ఈమె గుజరాత్ రాష్ట్రంలోని వల్సాడ్‌లోని కల్వాడా ప్రాంతంలో జన్మించింది. ఈమె కమల్ రాయ్‌ను తన 15వ యేట వివాహం చేసుకుని ముంబై ప్రాంతానికి తరలి వచ్చింది. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన తర్వాత తన పేరును నిరూపా రాయ్‌గా మార్చుకుంది.

వృత్తి

మార్చు
 
గదనో బేల్ (1950) చిత్రంలో నిరూపా రాయ్

1949లో ఈమె, ఈమె భర్త ఒక గుజరాతీ దినపత్రికలో నటీనటులు కావలెను అనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. ఈమె ఎంపిక అయి రనక్‌దేవి అనే గుజరాతీ సినిమాలో నటిగా తన సినీ ప్రస్థానాన్ని ఆరంభించింది. అదే సంవత్సరం హిందీలో తన మొదటి సినిమా అమర్ రాజ్‌లో నటించింది. ఈమె 1940-60ల మధ్య కాలంలో ఎక్కువగా పౌరాణిక పాత్రలను ధరించింది. ఈమెను దేవతగా భావించి ప్రజలు ఈమెను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి ఈమె ఇంటికి వెళ్లేవారు. అంతగా ఈమె పౌరాణిక చిత్రాలలో తన నటనతో మెప్పించింది. ఈమెకు జోడీగా త్రిలోక్ కపూర్ (18 చిత్రాలలో జంటగా నటించారు[4]), భరత్ భూషణ్, బలరాజ్ సాహ్ని, అశోక్ కుమార్ మొదలైన హేమాహేమీలు నటించారు.

1970లలో ఈమె అమితాబ్ బచ్చన్, శశి కపూర్ మొదలైన హీరోల చిత్రాలలో తల్లిపాత్రలను ధరించింది. హిందీ సినిమాలలో ఈమె తల్లి పాత్రకు మారుపేరుగా నిలిచింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

నిరూపా రాయ్, కమల్ రాయ్‌ను దంపతులకు యోగేష్, కిరణ్ రాయ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.[5] ఈమె మరణానంతరం ఆస్తి విషయమై వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం వార్తాపత్రికలకెక్కింది.[6][7] నిరూపా రాయ్ 2004, అక్టోబర్ 13న తన 73వ యేట గుండెపోటుతో ముంబైలో మరణించింది.[8]

ఫిల్మోగ్రఫీ[9]

మార్చు

ఈమె నటించిన సినిమాలలో కొన్ని ముఖ్యమైన సినిమాల జాబితా:

Year Film Notes
1946 అమర్ రాజ్ తొలి చిత్రం
1949 ఉద్ధార్
1951 రామ్‌ జన్మ
1953 దో బిఘా జమీన్
1954 చక్రధారి
1954 దుర్గా పూజ
1955 గరమ్‌ కోట్
1955 మునీమ్‌ జీ
1955 టాంగా వాలీ
1957 మోహినీ
1957 ముసాఫిర్
1958 చాల్‌బాజ్
1958 దుల్హన్
1958 నాగ్ చంపా నాగమోహిని పేరుతో తెలుగులో డబ్ చేయబడింది
1960 ఆంచల్
1961 ఛాయా
1962 బే జుబాన్
1963 కౌన్ అప్నా కౌన్ పరాయా
1963 ముఝే జీనే దో
1963 గృహస్తి
1964 బెనజీర్
1964 షెహనాయి
1964 ఫూలోఁ కి సెజ్
1965 షహీద్
1967 రామ్‌ ఔర్ శ్యామ్‌
1967 జాల్
1968 ఆబ్రూ
1968 ఏక్ కలీ ముస్కాయి
1968 రాజా ఔర్ రంక్
1969 ఆశూఁ బన్ గయే ఫూల్
1969 ప్యార్ కా మౌసమ్‌
1969 రహ్‌గిర్
1970 అభినేత్రి
1970 మా ఔర్ మమతా
1970 ఘర్ ఘర్ కీ కహానీ
1970 మహారాజా
1970 పూరబ్ ఔర్ పశ్చిమ్
1971 గంగా తేరా పానీ అమృత్
1972 జవానీ దివానీ
1973 కచ్చే ధాగే
1975 దీవార్
1976 మా
1977 అమర్ అక్బర్ ఆంథోని
1977 అనురోధ్
1979 సుహాగ్
1982 తీస్రీ ఆంఖ్
1983 బేతాబ్
1985 సర్ఫరోష్
1985 గిరఫ్తార్
1985 మర్ద్
1986 అంగారే
1988 గంగా జమునా సరస్వతి
1988 ఇంతెఖామ్‌
1993 ఆశూ బనే అంగారే
1999 జహాఁ తుమ్‌ లే ఛలో
1999 లాల్ బాద్‌షా

పురస్కారాలు

మార్చు
Year Award Category Work Result
1956 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ సహాయ నటి మునిమ్‌జీ గెలుపు
1962 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ సహాయ నటి ఛాయా గెలుపు
1965 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ సహాయ నటి షెహనాయి గెలుపు
1985 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ సహాయ నటి దీవార్ నామినేట్ చేయబడింది
1986 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు జీవన సాఫల్య పురస్కారం గెలుపు

మూలాలు

మార్చు
  1. "Remembering Nirupa Roy, the Iconic 'Mother' of Bollywood". The Quint (in ఇంగ్లీష్). 2016-10-13. Retrieved 2019-11-19.
  2. "Happy Mother's Day 2019: Iconic mothers who graced screens of Indian cinema – News Nation". newsnation.in (in ఇంగ్లీష్). 12 May 2019. Retrieved 2019-11-19.
  3. "Mothers Day Special: Bollywood's Most Iconic Screen Mothers". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2019-11-19.
  4. Rishi, Tilak (2012). Bless You Bollywood!: A Tribute to Hindi Cinema on Completing 100 Years. Trafford. p. 100. ISBN 978-1-4669-3963-9.
  5. "Nirupa Roy". The Independent (in ఇంగ్లీష్). 2004-11-02. Archived from the original on 2020-03-01. Retrieved 2019-11-19.
  6. Sayed, Nazia SayedNazia; Jan 10, Mumbai Mirror | Updated; 2018; Ist, 05:57. "Battle between Nirupa Roy's sons gets uglier". Mumbai Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 2020-02-28. Retrieved 2019-11-19. {{cite web}}: |last3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  7. "Deewar's Maa Nirupa Roy's Sons Fight Over Her Property". NDTV.com. Retrieved 2019-11-19.
  8. MumbaiJanuary 4, Indo-Asian News Service; January 4, 2019UPDATED; Ist, 2019 15:20. "Javed Akhtar on Nirupa Roy 87th birth anniversary: She looked like Goddess in mother roles". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-11-19. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  9. "Nirupa Roy". IMDb. Retrieved 2019-11-19.

బయటి లింకులు

మార్చు