నీలిమేఘాలలో గాలికెరటాలలో (పాట)

నీలిమేఘాలలో గాలికెరటాలలో అనే పాట 1960లో విడుదలైన బావామరదళ్ళు చిత్రంలోనిది. దీనికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. గాత్రం: ఘంటసాల వెంకటేశ్వరరావు.

సాహిత్యంసవరించు

నీలిమేఘాలలో గాలికెరటాలలో
నీవు పాడే పాట వినిపించు నీ వేళ

ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి
అపురూపమై నిలచే నా అంతరంగాన
||నీలిమేఘాలలో||

నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు
నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరపింపజేయు
||నీలిమేఘాలలో||

అందుకోజాలని ఆనందమే నీవు
అందుకోజాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు
||నీలిమేఘాలలో||