1973 ఏప్రిల్ 3ముంబాయిలో జన్మించిన నీలేష్ కులకర్ణి భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. టెస్ట్ క్రికెట్ లో బౌలింగ్ చేసిన తొలి బంతికే వికెట్టును సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ప్రపంచం మొత్తం పై ఈ ఘనత సాధించిన బౌలర్లలో 12 వాడు. 1997-98 లో శ్రీలంక పై కొలంబోలో జరిగిన టెస్టు మ్యాచ్ లో కులకర్ణి ఈ ఘనత సాధించాడు. కానిితను ఆ మ్యాచ్ లో మరో 70 ఓవర్లు బౌలింగ్ చేసిననూ తదుపరి వికెట్టు లభించలేదు. నాలుగేళ్ళ విరామం తర్వాత ఆస్ట్రేలియా పై జరిగిన టెస్టులో 137 పరుగులకు ఒక్క వికెట్టు సాధించి 588 బంతుల తర్వాత తన రెండో వికెట్టు పడగొట్టాడు. దాంతో అతని అంతర్జాతీయ క్రీడా జీవితం ముగిసింది. ఆ తర్వాత ముంబాయి తరపున రంజీ ట్రోపిలో పాల్గొన్నాడు.