నుపూర్‌ సనన్‌ (జననం 1995 డిసెంబరు 15) భారతదేశంలోని న్యూఢిల్లీకి చెందిన సంగీత కళాకారిణి, నటి. ఆమె టైగర్ నాగేశ్వరరావు[1], నూరానీ చెహ్రా, బి ప్రాక్: ఫిల్హాల్ (2019) చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఆమె సినీనటి కృతి సనన్ సోదరి.[2]

నుపూర్ సనన్
జీక్యూ స్టైల్ అవార్డు అందుకున్న నుపుర్ సనన్
జననం (1995-12-15) 1995 డిసెంబరు 15 (వయసు 28)
ఢిల్లీ, భారతదేశం
వృత్తినటి,
మోడల్
క్రియాశీల సంవత్సరాలు2005 – ఇప్పటివరకూ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చన్నా మేరేయా, ఫిల్హాల్ మ్యూజిక్ వీడియో
బంధువులుకృతి సనన్ (సోదరి)

2005లో యూట్యూబ్‌లో తన మొదటి పాట బేకరర్ కర్కే(Bekarar Karke).. తో ఆమె ఔత్సాహిక గాయనిగా అనేక మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె పాడిన తేరి గాలియాన్.. యూట్యూబ్‌లో భారీ విజయాన్ని సాధించింది. ఆమె దిల్‌వాలే చిత్రంలోని జనం జనం పాటను కూడా పాడింది.

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆమె న్యూఢిల్లీలో 1995 డిసెంబరు 15న రాహుల్ సనన్, గీతా సనన్ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్ కాగా తల్లి ఢిల్లీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్. ఆమె అక్క కృతి సనన్ ప్రముఖ బాలీవుడ్ నటి. నుపూర్ సనన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి తన డిగ్రీని పొందింది.

కెరీర్ మార్చు

నుపూర్ సనన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన బి ప్రాక్ మ్యూజిక్ వీడియో ఫిల్హాల్‌తో తెరపైకి అడుగుపెట్టింది. ఫిల్హాల్-2 అనే మ్యూజిక్ వీడియోలో కూడా ఆమె నటించింది.

మూలాలు మార్చు

  1. "BigBoss: బిగ్ బాస్ ఇంట్లో రవి తేజ | Ravi Teja in Bigg Boss house Kavi". web.archive.org. 2023-02-02. Archived from the original on 2023-02-02. Retrieved 2023-02-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Andhrajyothy (12 October 2023). "మా అక్క ఇచ్చిన సలహా అదే!". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.

బయటి లింకులు మార్చు