కృతి సనన్ (జననం1990 జులై 27) భారతీయ నటి, మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించిన కృతి తెలుగులో మహేష్ బాబు సరసన 1 - నేనొక్కడినే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఆది పురుష్‌ హిందీ చిత్రంలో కృతి సనన్ నటించింది.

కృతి సనన్
2023లో కృతి
జననం
కృతి సనన్

(1990-07-27) 1990 జూలై 27 (వయసు 33)
ఢిల్లీ, భారతదేశం
వృత్తినటి,
మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010 – ఇప్పటివరకూ
బంధువులునుపూర్ సనన్ (సోదరి)


2021లో వచ్చిన మిమీ సినిమాలో తన నటనకు అనేక అవార్డులను అందుకుంది, అందులో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు గంగూబాయి కతియావాడి చిత్రానికి అలియా భట్‌తో కలసి గెలుచుకుంది.[1][2]

2019 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆమె పేరు దక్కించుకుంది.

సినీ జీవితం మార్చు

హిందీలో ఎన్నో కమర్షియల్సులో నటించిన కృతి సనన్ మహేష్ బాబు నటించిన 1 - నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలుత ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కథానాయికగా ఎన్నుకోబడ్డా డేట్స్ ఖాళీ లేక, ఉన్నవి సద్దుబాటు చెయ్యలేకపోయింది.[3] ఈ సినిమాలో నటించడానికి మొగ్గుచూపినా ఎలాంటి గొడవ లేకుండా సినిమా నుంచి తప్పుకుంది. ఆ సమయంలో దర్శకుడు సుకుమార్ ఈమెని కథానాయికగా ఎంచుకున్నారు.[4] ఈ సినిమాలో కృతి ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించింది. సంక్రాంతి కానుకగా 2014లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టినా కృతి మాత్రం సానుకూల స్పందనను రాబట్టగలిగింది. సాక్షి దినపత్రిక తమ సమీక్షలో "కృతి సనన్ జర్నలిస్ట్‌గా, గౌతమ్ ప్రేయసి సమీరగా పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో కొంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కృతి సనన్‌కు దక్కింది. కొత్త నటి అనే ఫీలింగ్‌ను కలిగించకుండా కృతి బాగానే జాగ్రత్త పడింది" అని వ్యాఖ్యానించారు.[5]

ఆపై హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ తొలి చిత్రమైన హీరోపంతి సినిమా ద్వారా హిందీలో కథానాయికగా అడుగుపెట్టింది. ఈ సినిమా జాకీ ష్రోఫ్ నటించిన హీరో సినిమా రీమేక్ అయినప్పటికీ అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమా ఛాయలు కూడా ఇందులో కనపడటం ఆశ్చర్యం ఎందరికో కలిగించింది.[6][7] ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఇంతలోనే అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రం దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సమంతతో పాటు నటిస్తున్న మరో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా కృతి ఎన్నుకోబడింది.[8]

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర విశేషాలు మూలాలు
2014 1: నేనొక్కడినే సమీర తెలుగు సినిమా
హీరోపంతి డింపీ చౌదరి
2015 దోచేయ్ మీరా తెలుగు సినిమా
దిల్‌వాలే ఇషితా మాలిక్
2017 రాబ్తా సైరా సింగ్ / సైబా ఖాజీ
బరేలీ కి బర్ఫీ బిత్తి మిశ్రా
2018 స్త్రీ పేరులేనిది "ఆవో కభీ హవేలీ పే" పాటలో ప్రత్యేక పాత్ర [9]
2019 లుకా చుప్పి రష్మీ త్రివేది
కలంక్ పేరులేనిది "ఐరా గైరా" పాటలో ప్రత్యేక పాత్ర [10]
అర్జున్ పాటియాలా రీతు రాంధవా
హౌస్‌ఫుల్ 4 రాజకుమారి మధు / కృతి థక్రాల్
పానిపట్ పార్వతి బాయి
పతి పత్నీ ఔర్ వో నేహా ఖన్నా అతిధి పాత్రలో [11]
2021 మిమీ మిమీ రాథోడ్ [12]
హమ్ దో హమారే దో అన్య మెహ్రా [13] [14]
2022 బచ్చన్ పాండే మైరా దేవేకర్ [15]
హీరోపంతి 2 పేరులేనిది "విజిల్ బాజా 2.0" పాటలో [16]
భేదియా డాక్టర్ అనికా [17]
2023 షెహజాదా సమర [18]
ఆదిపురుష్ జానకి తెలుగు / హిందీ [19] [20][21][22]
గణపథ్ జాస్సీ [23]
TBA తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా పోస్ట్ ప్రొడక్షన్ [24]
క్రూ పోస్ట్ ప్రొడక్షన్ [25]
చిత్రీకరణ / నిర్మాత కూడా

మ్యూజిక్ వీడియోస్ మార్చు

సంవత్సరం పేరు గాయకులు సంగీత దర్శకుడు మూలాలు
2015 "చల్ వాహన్ జాతే హై" అరిజిత్ సింగ్ అమల్ మల్లిక్ [26]
2017 "పాస్ ఆవో" అర్మాన్ మాలిక్, ప్రకృతి కాకర్ [27]
2020 "కుడి ను నాచ్నే దే" విశాల్ దద్లానీ, సచిన్-జిగర్ సచిన్-జిగర్ [28]
2020 "ముస్కురాయేగా ఇండియా" విశాల్ మిశ్రా విశాల్ మిశ్రా [29]

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మార్చు

 
భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

2022 ఫిబ్రవరి 20న ముంబైలో నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022 లో మిమీ సినిమాలో నటించిన కృతి సనన్కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.

మూలాలు మార్చు

 1. "IIFA 2022 full winners list: Kriti Sanon shines for Mimi, Vicky Kaushal makes it big for Sardar Udham". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2022.
 2. "69th National Film Awards 2023 complete winners list: Rocketry, Alia Bhatt, Kriti Sanon, Allu Arjun, RRR, Gangubai Kathiawadi win big". The Indian Express. Retrieved 24 August 2023.
 3. "మహేష్ సినిమా నుంచి కాజల్ అవుట్ ?". వన్ఇండియా. September 23, 2012. Retrieved April 21, 2014.
 4. "మహేష్ బాబు హీరోయిన్ ఆ అమ్మాయే". 123తెలుగు.కామ్. January 13, 2013. Retrieved April 21, 2014.
 5. "సినిమా రివ్యూ: '1' నేనొక్కడినే". సాక్షి. January 12, 2014. Retrieved April 21, 2014.
 6. "'టైగర్' తో నటించే ఛాన్స్ కొట్టిన 'వన్' భామ..!". 10టీవీ.ఇన్. April 7, 2014. Retrieved April 21, 2014.[permanent dead link]
 7. "అల్లు అర్జున్ 'పరుగు' టైగర్ చేస్తున్నాడా?". ఫిల్మీబజ్. April 6, 2014. Retrieved April 21, 2014.
 8. "మహేష్ '1' హీరోయిన్ పెద్ద ఆఫరే పట్టింది". వన్ఇండియా. April 13, 2014. Retrieved April 21, 2014.
 9. Rakshit, Nayandeep (11 August 2018). "Kriti Sanon shoots her first item number for 'Stree'". Daily News and Analysis. Archived from the original on 11 May 2019. Retrieved 12 August 2018.
 10. "Kalank song Aira Gaira: Kriti Sanon features in this stunningly shot dance number". The Indian Express (in Indian English). 13 April 2019. Archived from the original on 13 April 2019. Retrieved 13 April 2019.
 11. Lohana, Avinash (5 September 2019). "Kriti Sanon reunites with Kartik Aaryan for Pati Patni Aur Woh". Mumbai Mirror. Archived from the original on 5 September 2019. Retrieved 5 September 2019.
 12. "Kriti Sanon starts shooting for 'Mimi' in Rajasthan". The Times of India. 29 October 2019. Retrieved 30 October 2019.[permanent dead link]
 13. "Kriti Sanon back in town after shooting in Chandigarh". Filmfare. 6 December 2020. Archived from the original on 10 January 2021. Retrieved 1 January 2021.
 14. "Kriti Sanon in another offbeat film". Deccan Chronicle. 23 October 2020. Archived from the original on 2 February 2021. Retrieved 30 January 2021.
 15. "Kriti Sanon mixes power dressing with comfort at the airport as she wraps up Bachchan Pandey". Bollywood Hungama. 22 February 2021. Archived from the original on 10 June 2021. Retrieved 10 June 2021.
 16. "Heropanti 2 song Whistle Baja 2.0: Tiger Shroff recreates his magic with Kriti Sanon in this peppy track". Pinkvilla. 22 April 2022. Archived from the original on 9 May 2022. Retrieved 22 April 2022.
 17. "Kriti Sanon, Varun Dhawan announce Bhediya shoot wrap with new motion poster". India Today. 10 July 2021. Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
 18. "Kartik Aaryan, Kriti Sanon-starrer Shehzada begins production, books Feb 2023 release date". Outlook (in ఇంగ్లీష్). Archived from the original on 16 October 2021. Retrieved 15 October 2021.
 19. "Kriti Sanon wraps Adipurush, says Janaki's 'loving heart, pious soul and unshakable strength will stay' within her forever". The Indian Express. 16 October 2021. Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
 20. PTI. "Adipurush makers set a new release date; Prabhas, Saif Ali Khan and Kriti Sanon starrer to release in June 2023". Bollywood Hungama. Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
 21. ఆంధ్రజ్యోతి (25 April 2021). "సీత పాత్ర... అంత ఈజీ కాదు!". Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
 22. Eenadu (11 June 2023). "ఏడుస్తూ అమ్మకి ఫోన్‌ చేశా". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
 23. "Tiger Shroff and Kriti Sanon's futuristic action thriller Ganapath's UK schedule begins; makers share a new jaw-dropping action video". Bollywood Hungama. 6 November 2021. Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
 24. "Shahid Kapoor and Kriti Sanon wrap up their upcoming love story, see first look poster". Bollywood Hungama. 8 April 2023. Retrieved 8 April 2023.
 25. "'Is this real'? Rhea Kapoor begins shooting for Kareena, Tabu and Kriti's next The Crew on mom's birthday". India Today. 25 March 2023. Retrieved 25 March 2023.
 26. T-Series (16 July 2015). "Chal Wahan Jaate Hain Full VIDEO Song – Arijit Singh – Tiger Shroff, Kriti Sanon – T-Series". Archived from the original on 2 April 2018. Retrieved 24 March 2018 – via YouTube.
 27. Jain, Arushi (7 July 2017). "Sushant Singh Rajput, Kriti Sanon song 'Paas Aao' brings them closer and we are just not complaining. See photos". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2019. Retrieved 15 February 2021.
 28. "Angrezi Medium Song Kudi Nu Nachne De: Alia Bhatt, Katrina Kaif And Anushka Sharma Will Set Your Mood For The Week". NDTV. 4 March 2020. Archived from the original on 5 March 2020. Retrieved 5 March 2020.
 29. "Inspirational Hindi Song 'Muskurayega India' Ft. Akshay Kumar, Kartik Aaryan, Tiger Shroff, Ayushmann Khurrana, Kriti Sanon, Bhumi Pednekar, Raj Kumar Rao, Vicky Kaushal, and more | Hindi Video Songs". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2021. Retrieved 11 August 2021.

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కృతి_సనన్&oldid=4164259" నుండి వెలికితీశారు