నువ్వెక్కడుంటే నేనక్కడుంటా

నువ్వెక్కడుంటే నేనక్కడుంటా 20 ఏప్రిల్ 2012 లో విడుదల అయింది.

నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం శుభ సెల్వం
నిర్మాణం డి. కుమార్, ఎమ్. ఈశ్వర ప్రసాద్
రచన జనార్ధ మహర్షి
తారాగణం ఉదయ్ కిరణ్
శ్వేతా బసు ప్రసాద్
సంగీతం ప్రదీప్ కోనేరు
విడుదల తేదీ 2012
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

హరి (ఉదయ్ కిరణ్) కి తన మామ కూతురు నీలాంబరి (ఆర్తి) తో పెద్దలు పెళ్ళి నిశ్చయిస్తారు. ఈ పెళ్ళి ఇద్దరికీ ఇష్టం లేకపోవడంతో, హరికి ఉద్యోగం వచ్చాకే పెళ్ళి చేసుకుంటానని నీలాంబరి చెప్పడంతో, నీలాంబరి తండ్రి హైదరాబాదుకి పంపించి ఒక ఫైనాన్సు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనాథ అయిన హరిత (శ్వేతా బసు ప్రసాద్) ను హరి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. మరో వైపు వీధి రౌడి అయిన భద్ర (అమిత్ కుమార్) కూడా హరితని ప్రేమిస్తూ పెళ్ళి చేసుకోమని వెంటపడి వేదిస్తుంటాడు. ఈ క్రమంలో హరిత, భద్ర నుండి తప్పించుకుంటూ హరికి దగ్గరవుతుంది. హరిత తనని ప్రేమించట్లేదంటూ భద్ర పగ పెంచుకుంటాడు. మరోవైపు హరికి కలలో వచ్చిన సంఘటనలు నిజమౌతుంటాయి. ఒకరోజు హరికి ఒక విచిత్రమైన కల వస్తుంది. ఆ కలలో భద్ర, హరితని కిడ్నాప్ చేసే క్రమంలో హరిత చనిపోయినట్లు కల కంటాడు. ఈ కల నిజమౌతుందని భయపడిన హరి ప్రియురాలు హరితని తన ఊరికి తీసుకెళ్తాడు. హరి కుటుంబ సభ్యులు హరితని అంగీకరించారా? హరికి వచ్చిన కల నిజమైందా? చివరికి భద్ర, హరితని ఏం చేసాడు? అనేది సినిమా క్లైమాక్స్.

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు

వుప్పెనలా , నింగిని , గానం. రంజిత్

మనసాగనన్నది , గానం.వేదాల హేమచంద్ర , గీతా మాధురి

జాబిలి , గానం.కార్తీక్

కొండల్లో కోయిలమ్మ , గానం.సతీష్ , మాళవిక

సూర్య చంద్రులైన , గానం.అనురాధ శ్రీరామ్ .

బయటి లింకులు

మార్చు