నూనెలోని కరుగని మలినాలశాతం

ఈ పరీక్షా విధానాన్ని నూనెగింజల నుండి నూనెతీయు మిల్లులలో, అలాగే అయిల్ కేకు (oil cakes) లనుండి నూనె తీయు సాల్వెంటు ప్లాంటు పరిశ్రమల్లోని ప్రయోగశాలల్లో నిర్వహిస్తారు.

నూనెలోని కరుగని మలినాల శాతం నిర్ణయించుట

మార్చు

నూనె గింజలనుండి నూనెలను ఉత్పత్తి చేయునప్పుడు కొన్నిమలినాలు నూనెతో పాటు చేరును.అవి ద్రవ, ఘన రూపంలో వుండును. ద్రవరూపంలోని మలినాలు తేమ వంటివి. ఘనరూపంలోని, నూనెలో కరుగని మలినాలు సాధారణంగా విత్తానాలతోపాటు వచ్చిన మట్టి చిన్న ఇసుక రేణువులు, విత్తన కణభాగాలు వుంటాయు.ఇలాంటి నూనెలో కరుగని మలినాలను (oil insoluble impurities) ఫిల్టరు ప్రెస్ లో ఫిల్టరుచెయ్యడం ద్వారా తొలగించెదరు.

ఈ విధానంలో మొదట నూనెను వేడి కిరోసిన్లో కరగించి ఫిల్టరుపేపరులో (వడబోత కాగితం) వడబోయటం జరుగును.మలినాలు ఫిల్టరుపేపరు మీద వుండిపోవును.ఇప్పుడు ఫిల్టరుపేపరుకు అంటుకు వున్న నూనెను తొలగించుటకై పలుదపాలుగా పెట్రొలియం ఈథరుతో వాషింగ్స్ ఇచ్చి, ఫిల్టరు పేపరును ఎయిర్ ఒవన్‌లో డ్రై చేసి, చల్లార్చి, తూచి దాని భారాన్ని నమోదు చేయుదురు. ఫిల్టరుపేపరు మీదవున్న పదార్థమే నూనెలో కరుగని మలినాలు.

పరికరాలు

మార్చు

1.వాట్‍మాన్ ఫిల్టరు పేపరు.నెం.1

2.ఫిల్టరింగ్ ఫన్నల్, గాజుది.80మి.మీ.వ్యాసం ఉంది.

3.ఫిల్టరింగ్ ఫ్లాస్కు లేదా బీకరు లేదా కొనికల్ ఫ్లాస్కు.

4.ఎనలైటికల్ బాలెన్స్.

5.డెసికెటరు.

రసాయన పధార్దాలు

మార్చు

1.కిసొసిన్ గ్రేడ్ 1, రంగులేని BIS:1439:1959 స్పెసిఫికెసన్సుకు అనుగుణ్యంగా వుండాలి.

2.పెట్రొలియం ఈథరు:సాల్వెంట్ గ్రేడ్, బాయిలింగ్ పాయింట్ 60/80 0C.BIS:1745-1961 స్పెసిఫికెసన్సుకు అనుగుణ్యంగా వుండాలి.

విధానం

మార్చు

ముందుగా నూనెను 1050C ఉష్ణోగ్రతలో వున్న ఎయిర్‌ఒవన్ లో వుంచి నూనెలోని తేమను తొలగించాలి.ఆ తరువాత నూనెను డెసికెటరులో వుంచి చల్లబరచవలెను.ఒవన్‌లో అంతకు ముందే డ్రై చేసిన ఫిల్టరుపేపరును తూచి, దాని కచ్చితమైనభారాన్ని నమోదు చేయాలి.ఈ ఫిల్టరుపేపరును స్టాండుకు బిగించిన గాజుఫన్నల్ (గరాటు) లో అమర్చవలెను.సాధారణంగా ఫిల్టరుపేపరును మూడు మడతలు ఒకవైపు, ఒక మడత మరోవైపుకు వచ్చెలా మడచి ఫన్నల్‌లో వుంచాలి.100 మి.లీ.ల బీకరులో 10-12 గ్రాం.ల వరకు బాగా కలియబెట్టిన నూనెనుతీసుకొని, తూచి దాని భారాన్ని నమోదు చెయ్యాలి.ఇప్పుడు 40 మిలీ.వరకు వేడి కిరొసిన్‌ను తీసుకొని బీకరులోని నూనెకు చేర్చి బాగా కలిపి, నూనె అంతయు కిరొసిన్‌లో కరిగేటట్లు చెయ్యాలి.ఇప్పుడు బీకరులోని నూనె, కిరొసిన్ మిశ్రమాన్ని జాగ్రత్తగా ఫన్నల్‌లోని ఫిల్టరు పేపరులో వెయ్యాలి.ఫన్నల్ దిగువన ఒక బీకరు/కొనికల్ ఫ్లాస్కును వుంచినచో ఫిల్టరు అయ్యిన మిశ్రమద్రవం అందులో కలెక్ట్/జమ అగును. ఫిల్టరుపేపరునుండి కిరొసిన్+నూనె మిశ్రమం ఫిల్టరు పేపరునుండి పూర్తిగా దిగిపొయ్యాక, ఇప్పుడు ఫిల్టరు పేపరు చే శోషింపబడిన నూనె+కిరొసిన్‌ను తొలగించుటకై పెట్రొలియం ఈథరు వాషింగులు 4-5 దపాలు ఇచ్చి ఫిల్టరు పేపరు ఆయిల్ ఫ్రీ అయ్యేటట్లు చెయ్యాలి.ప్రతి సారి 20-30మి.లీ.పెట్రొలియం ఈథరు వాషింగ్ ఇవ్వాలి. ఫిల్టరు పేపరు నుండి నూనె మొత్తం తొలగింపబడినదని నిర్దారణ అయ్యాక, ఫిల్టరుపేపరును జాగ్రత్తగా మడచి, ఎయిర్ ఒవన్‌లో వుంచి డ్రై చెయ్యాలి.ఫిల్టరు పేపరు డ్రై అయ్యాక బయటకు తీసి, డెసికెటరులో చల్లార్చి, బాలెన్స్ లో తూచి, భారాన్ని నమోదు చెయ్యాలి.

సమీకరణ

మార్చు
 

వివరణ

M=పరీక్షకై తీసుకున్న నూనె భారం, గ్రాం.లలో

W= ఖాళి ఫిల్టరు పేపరుభారం, గ్రాం.లలో

W1=ఫిల్టరు పేపరు+పేపరు మీద జమ అయ్యిన మలినాలు, గ్రాం.లలో

మూలాలు/ఆధారాలు

మార్చు

  • B.S.684:1958 Methods of Anylysis Of Oils And Fats.British Standards Institution.