నూర్జహాన్ (పర్షియా: نور جهان) (ఉర్దూ:نور جهاں), (نور ج) . ఆమె పుట్టుకతో " మెహరున్నిసా " జన్మించింది. తరువాత జహంగీర్ మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిని అయింది. ఆమె అందమైన, బాగా చదువుకున్న మహిళగా గుర్తింపు పొందింది. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఆమె గుర్యించబడింది. జహంగీర్ చక్రవర్తికి ఆమె 20వ భార్య. జహంగీరు అభిమానాన్ని అధికంగా చూరగొన్న భార్యగా ఆమెకు గుర్తింపు ఉంది. జహంగీర్ నూర్జహానుల అన్యోన్యం చారిత్రకంగా పలు అనుమానాలకు దారితీసింది. నూర్జహాన్ జననం 1577 మే 31 మరణం 1645 డిసెంబరు 17.

Nur Jahan
نور جهاں
Idealized portrait of the Mughal Empress Nur Jahan
Empress consort of the Mughal Empire
Tenure25 May 1611 – 8 November 1627
జననం31 మే 1577
కాందహార్ , ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్
మరణం1645 డిసెంబరు 17(1645-12-17) (వయసు 68)
లాహోర్ , ప్రస్తుత పాకిస్థాన్
Burial
నూర్జహాన్ సమాధి, షహ్దారా బాఘ్, లాహోర్
Spouseషెర్ అఫ్గన్ అలి కులి ఖన్
జహంగీర్
వంశములాడీ బేగం, ఇద్దరు
Names
మెహర్- ఉన్- నిసా
HouseTimurid (జహంగీర్‌ను వివాహం చేసుకున్న తరువాత)
తండ్రిమిర్జ ఘియాస్ బెగ్
తల్లిఅస్మత్ బేగం
మతంషాజహాన్

నూర్జహాన్ గుర్తించతగినంత రాజకీయ పలుకుబడి సాధించుకుంది. మొఘల్ సింహాసనం వెనుక అసలైన శక్తిగా నూర్జహాన్ నిలబడిందని భావించబడింది. ఆమె ప్రధాన రాజకీయ శక్తిగా ఎదగడమే కాక అత్యంత ప్రభావవంతమైన మొఘల్ స్త్రీగా కూడా గుర్తించబడింది. ఆమె భారతీయ సాహిత్యంలో ధర్మకార్యాలు, వాణిజ్యంలలో ప్రతిభను చూపింది. ఆమె ఉక్కు పిడికిలి వంటి రాజకీయ అధికారాన్ని చూపింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య, మొఘల్ చక్రవర్తిని ముంతాజ్ మహల్ బేగానికి ఆమె మేనత్త. నూర్జహాన్ పేరుతో మొఘల్ సామ్రాజ్యంలో వెండి నాణ్యాలు ముద్రించబడ్డాయి. మొఘల్ నాణ్యాలలో తన పేరును ముద్రించుకున్న ఒకే ఒక మహిళగా ముంతాజ్‌కు ప్రత్యేకత ఉంది.[1]

పుట్టుక, మొదటి సంతానం

మార్చు
 
Kandahar (Kandahar), Nur Jahan's place of birth, is now southern Afghanistan

నూర్జహాన్ 1577 మే 31న కాందహార్ (ప్రస్తుత ఆఫ్ఘంస్థాన్) లో పర్షియన్ ప్రముఖుని రెండవ కుమార్తెగా జన్మించింది. అలాగే కులీన వర్గానికి చెందిన ఆమె తల్లి తండ్రులు అస్మత్ బేగం, మిర్జా గియాస్ బేగ్‌కు 4 సంతానంగా జన్మించింది. నూర్జహాన్ తల్లితండ్రులిద్దరూ కులీనవర్గానికి చెందిన వారు. ఆమె తండ్రి గియాస్ బేగ్ ముహమ్మద్ షరీఫ్ కుమారుడు. ఆమె తల్లి అస్ఫత్ ఖాన్ అక్వా ముల్లా వంశస్థురాలు. 1577లో గియాస్ ఖాన్ కుటుంబం భరించలేని సమస్యలను ఎదుర్కొన్నది. వారు తమ స్వంత భూమిలో జీవించలేక అదృష్టాన్ని వెతుక్కుంటూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో హిందూస్థాన్‌లో అక్బర్ చక్రవర్తి రాజసభ సంప్రదాయానికి, వాణిజ్యానికి మరుయు పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. [2]

వారి మార్గంలో సగందారిలో ఉండగ కుటుంబాన్ని దోపిడీ దొంగలు దోచుకున్నారు.[3] వారికి దొంగలు దోచుకున్న తరువాత వారి ప్రయాణంలో వారికి రెండు గాడిదలు, గియాస్ బెగ్, ముగ్గురు పిల్లలు, ఆయన గర్భిణీ భార్య మాత్రమే మిగిలారు. ముహమ్మద్ షరీఫ్, అసఫ్ ఖాన్ జంతువుల వెంట పరిగెత్తవలసిన అగత్యం ఏర్పడింది. వారి కుటుంబం కాందహార్ చేరగానే అస్మత్ బేగం తన రెండవ కుమార్తెకు జన్మ ఇచ్చింది. వారి కుటుంబం మరీ పేదరికంలో మునిగిపోయింది. కొత్తగా జన్మించిన సంతానాన్ని పోషించడం కూడా వారికి కష్టం అయింది. అదృష్టవశాత్తు వారు సంపన్నుడైన మాలిక్ మసూద్ వ్యాపార బృందంలో చేరడానికి అవకాశం కలిగింది. తరువాతి కాలంలో గియాస్ బెగ్‌కు అక్బర్ చక్రవర్తి సభలో ఉద్యోగం లభించడానికి మాలిక్ మసూద్ సహకరించాడు. కొత్తగా జన్మించిన కుమార్తె వారి కుటుంబానికి అదృష్టం తీసుకువచ్చిందని కుటుంబం విశ్వసించినట్లు భావిస్తున్నారు. అందువలన ఆమెకు " మెహర్ ఉన్ నిసా " (మెహర్ ఉన్ నిసా అంటే స్త్రీలలో సూర్యుడని అర్ధం) [4] అమె తండ్రి కాబూల్ భూభాగానికి దివాన్‌గా (ఖజానాధికారి) నియమించబడ్డాడు. తరువాత గియాస్ బెగ్ తన నైపుణ్యం కారణంగా వ్యాపారం అధికం చేసి క్రమంగా పై అధికారాలకు ఎదిగాడు. అద్భుతంగా పనిచేసినందుకు ఆయన చక్రవర్తి నుండి " ఇతిమాద్- ఉద్- దులా " (రాజ్య స్థూపం) అన్న బిరుదు పొందాడు. .[3] నాణ్యమైన సేవ, ఉన్నత పదవుల కారణంగా గియాస్ బెగ్‌కు మెహర్ - ఉన్- నిసాకు విద్యావకాశం అందించడానికి అవకాశం లభించింది. ఆమె అరబిక్. పర్షియన్ భాషలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యాలలో నైపుణ్యం సంపాదించింది.[4] కవి, రచయిత విద్యాధర్ మహాజన్ " నూర్జహాన్ సూక్ష్మబుద్ధిని, తీవ్రమైన వ్యక్తిత్వం, సమయస్పూర్తిని " అధికంగా ప్రశంశించాడు.[5]

అఫ్గన్‌తో వివాహం

మార్చు

1594లో నూర్జహాన్ 17 సంవత్సరాల వయసులో తన మొదటి భర్త అయిన అలి కులి ఇస్తజ్లు (షేర్ ఆఫ్ఘన్ ఖాన్) ను వివాహం చేసుకుంది. షేర్ అఫ్ఘన్ ధైర్యసాహసాలున్న పర్షియన్ యువకుడు. ఆయన తన గురువు రెండవ షాహ్ ఇస్మాయిల్ మరణం తరువాత పర్షియాను వదిలి రావలసిన పరిస్థితి ఎదురైయింది.[6] తరువాత ఆయన సైన్యంలో చేరి అక్బర్, జహంగీర్ చక్రవర్తి ఆధ్వర్యంలో పనిచేసాడు. అయన రాజభక్తితో అందించిన సేవలు, విశ్వాసం స్నేపూర్వకంగా అక్బర్ పెద్దకుమారుడు సలీంకు (భవిష్యత్తు చక్రవర్తి, నూర్జహాన్ రెండవ భర్త) చేసిన సేవలకు పురస్కారాలు అందుకున్నాడు. అక్బర్ చక్రవర్తి షేర్ ఆఫ్ఘన్, " మెహర్ - ఉన్- నిసా " ల వివాహానికి ఏర్పాటు చేసాడు.[2] వారిరువురికి సంతానం లేదు అయినప్పటికీ ఆఫ్ఘన్‌కు మాత్రం తన మొదటి భార్య లాడి బేగం ద్వారా ఒక కుమార్తె ఉంది. ఈ సమయంలో అలి కులి ఇస్తాజ్లుకు షేర్ ఆఫ్ఘన్ (టైగర్ టోసర్) అనే బిరుదు ఇవ్వబడింది. ఆగ్రహంగా మీదపడిన పులి బారి నుండి సలీంను రక్షించినందుకు ఆయనకు ఈ బిరుదు ఇవ్వబడింది. షేర్ ఆఫ్ఘన్ మాటకు బిరుదుకు ఆంగ్ల మొఘల్ చరిత్రలో పొరపాటు అర్ధం ఇవ్వబడింది. ఆఫ్ఘన్ అంటే పర్షియన్ భాషలో త్రోసివేయుట అని అర్ధం.

1607లో షేర్ ఆఫ్ఘన్ హత్యచేయబడ్డాడు. ఆయన బెంగాల్ గవర్నర్ ఆఙలను (రాజద్రోహచర్యలు) తిరస్కరించి ఆయనను కలుసుకోవడానికి వెళ్ళని కారణంగా హత్యచేయబడ్డాడని భావించారు. మరి కొందరు మెహరున్నిసా మీద ఉన్న ప్రేమ కారణంగా జహంగీర్ షేర్ ఆఫ్ఘన్‌ను హత్య చేయించాడని సందేహించారు. అయినప్పటికీ ఈ సందేహానికి ఆధారం లేదు. జహంగీర్ మెహరున్నిసాను 1611లో వివాహం చేసుకున్నాడు. మెహరున్నిసా జహంగీర్ సభకు వచ్చిన 4 సంవత్సరాల తరువాత వారి వివాహం జరిగింది. 1611 కు ముందు జహంగీరుకు మెహరున్నిసా అంటే ప్రేమ ఉందనడానికి ఆధారాలు లేవు. చరిత్రకారులు జహంగీర్‌కు షేర్ ఖాన్ మీద ప్రేమాభిమానాల కారణంగా కూడా జహంగీర్‌కు హత్యకు సంబంధం లేదని భావిస్తున్నారు. [7] పశ్చిమ బెంగాల్ బుద్వానా జిల్లాలోని పురానా చౌక్ వద్ద ఇప్పటికీ షేర్ ఖాన్ సమాధి ఉంది. అక్కడ షేర్ ఆఫ్ఘన్, కుతుబుద్దీన్ కోకా ల మద్య యుద్ధం జరిగిందని భావిస్తున్నారు. మొఘల్ బెంగాల్ సుబేదార్, జహంగీర్ పెంపుడు సోదరుడు ఇద్దరూ కూడా అక్కడ సమాధి చేయబడ్డారు. 1607 లో షేర్ ఖాన్ హత్యచేయబడకుంటే బెంగాల్ ఫౌజ్‌దార్‌గా పంపబడి ఉండేవాడు.

వివాహం

మార్చు
 
The Mughal Emperor Jahangir and Prince Khurram with Nur Jahan.

నూర్జహాన్ మొదటి వివాహం ముందు నూర్జాహాను, జహంగీర్ గురించిన దీర్ఘకాల చారిత్రక కథనాలు అనేకం ఉన్నాయి. నూర్జహాన్ 17 సంవత్సరాల వయసులో వారిరువురి మద్య స్నేహం ఉండేదని అయినప్పటికీ వారి ప్రేమపూరిత స్నేహం అక్బర్ చక్రవర్తి అంగీకారం పొందలేదు. జహంగీర్ హిందూ భార్య షా బేగం జహంగీర్ తల్లి " మరియం - ఉజ్- జమానీ " బంధువు కావడమే అక్బరు ఈ వివాహానికి అంగీకారం తెలియజేయలేదని భావిస్తున్నారు. అందువలన జహంగీరు నూర్జహాను వారి ప్రేమను అక్బరు జీవించి ఉన్న కాలంలో నెరవేర్చుకోలేక పోయారు. అంతేకాక అక్బర్ నూర్జహాన్ - షేర్ ఖాన్‌ల వివాహం జరిపించాడు. 1605లో చక్రవర్తి అక్బరు మరణించిన తరువాత ఆయన పెద్దకుమారుడు జహంగీరు రాజ్యాధికారం చేపట్టాడు. నూర్జహాన్ మొదటి భర్త షేర్ ఆఫ్ఘన్ 1607 లో మరణించిన తరువాత నూర్జహాన్ ఆమె కుమార్తె లాడీ బేగం జహంగీర్ సభకు పిలిపించబడ్డారు. తరువాత జహంగీర్ నూర్జహానును ఆయన సవతితల్లి చక్రవర్తిని రుకైయా సుల్తాన్ బేగంకు సేవకురాలిగా నియమించాడు.[8] రుకయా సుల్తాన్ బేగం మొఘల్ రాజకుమారుడు హిండల్ మిర్జా కుమార్తె, దివంగత అక్బర్ చక్రవర్తి మొదటి భార్య జహంగీర్ అంతఃపుర ఉన్నత అధికారాలున్న స్త్రీలలో ఒకరు. ఆమెకు రక్షణ కలిగించడానికి జహంగీర్ అంతఃపురంలో నూర్జహాన్ సేవలు అవసరం అయ్యాయి.[9][10] నూర్జహాన్ తన కుమార్తె లాడీ బేగంతో చక్రవర్తినికి 4 సమవత్సరాలు సేవలు చేసింది.[11] రుకయా, నూర్జహాన్ మద్య సాన్నిహిత్యం అధికమైంది. అది 1626లో రుకయా మరణించేవరకు కొనసాగింది. పీటర్ వ్యాన్ డెన్ బ్రోకే " బేగంకు నూరజహాన్ పట్ల ఎనలేని అభిమానం ఉండేది. ఆమె అందరికంటే అధికంగా నూర్జహానును ప్రేమించింది. ఆమె నూజహానును ఎప్పుడూ తన సమీపంలోనే ఉంచుకొనేది " అని వ్రాసాడు."[10]

1611 లో తన పోషకురాలు చక్రవర్తిని రుకయాతో నూర్జహాన్ జహంగీర్ చక్రవర్తిని " ప్యాలెస్ మీనా బజార్ " వద్ద వసంత ఉత్సవాల సమయంలో (నౌరుజ్) కలుసుకుంది. నౌరుజ్ అంటే కొత్త సంవత్సర ఆరంభం. జహంగీర్ అకస్మాత్తుగా నుర్జహాన్‌తో వివాహ ప్రస్తావన తీసుకు వచ్చాడు. అదే సంవత్సరం మే మాసంలో నూర్జహాన్ జహంగీరులకు వివాహం జరిగింది. వారి వివాహం 1611 మే 12వ తారీఖున జరిగింది. ఆసమయంలో నూర్జహాన్ వయసు 34. నూర్జహాన్ జహంగీర్ 20వ భార్య, చివరి చట్టబద్ధమైన భార్య అయింది. వారి వివాహం తరువాత వారికి ఇద్దరు సంతానం కలిగారు. అయినప్పటికీ జహంగీరుకు అనేకమంది సంతానం ఉన్నందున నూర్జహాన్ సంతానం ప్రస్తావన ఎక్కడ లేదు.[2]

జహంగీర్ చక్రవర్తి తన అందమైన మైన, విశ్వసనీయమైన భార్య గౌరవార్ధం ఆమెకు (నూర్ మహల్, ప్యాలెస్ దీపం, నూర్జహాన్, విశ్వదీపం ) బిరుదులు ఇవ్వబడ్డాయి. [12] జహంగీర్ ప్రేమపాత్రురాలైన నూర్జహాన్‌ రాజకీయంగా శక్తివంతురాలు అయింది. జహంగీర్ ఓపియం, ఆల్కహాలుకు దాసుడు కావడం నూర్జహాన్‌కు పలుకుబడి పెంచుకోవడానికి సహకరించింది. ఆమె చాలా సంవత్సరాలు రాజకీయ అధికారాన్ని దక్కించుకున్నది. మొఘల్ సామ్రాజ్యాన్ని వెనుక ఉండి నడిపించిన మహిళగా ఆమెకు చరిత్రలో ప్రత్యేకత ఉంది. ఆమె భర్తతో ఝరొకాలో కూర్చుని సభికులను కలుసుకుని ఆఙలను జారీచేయడం, జాగీరుల నిర్వహణ, మంత్రులతో సమాలోచన జరిపింది. మొఘల్ రాజకుటుంబంలో పురుషులకు మాత్రమే అధికారం ఉన్న " నిషాన్ " (నిషేధం) అధికారం కూడా అమలు చేసింది. .[13] జహంగీర్ మరణం తరువాత కూడా నూర్జహాన్ జహంగీరుకు విశ్వాసపాత్రురాలుగా ఉంది.

కుటుంబ ప్రయోజనాలు

మార్చు

షేర్ ఆఫ్ఘన్ మరణించిన తరువాత నూర్జహాన్ కుటుంబం గౌరవం తగ్గి దీనావస్థకు చేరుకుంది. అ సమయంలో ఆమె తండ్రి ఒక అమీర్‌- ఉల్ - ఉంరా "కు దివాన్‌గా మితమైన అధికారం కలిగిన పదవిలో ఉన్నాడు. ఆమె తండ్రి ఆమె సోదరుడు ఒక అపవాదు, రాజద్రోహం కేసులో చిక్కుకున్నారు.[2] ఆమె జహంగీర్‌ను వివాహం చేసుకున్న తరువాత ఆమె ఉన్నత దశకు చేరుకుంది. నూర్జహాన్ తన భర్త జహంగీరుకు నచ్చచెప్పి తండ్రికి క్షమాభిక్ష ఇప్పించి ఆయనకు ప్రధాన మంత్రిపదవి ఇప్పించింది. రాజ్యంలో తన స్థితి పదిలం చేసుకోవడానికి తన కుటుంబ సభ్యులను ఉన్నతపదవులలో అధిష్టింపజేసింది.[14] ఆమె సోదరుడు అసఫ్ ఖాన్ జహంగీర్‌కు ప్రధాన (ప్రధాన మంత్రి) వజీరుగా నియమించబడ్డాడు. అదనంగా మొఘల్ సింహాసంతో తన అనుబంధం కొనసాగడానికి తన సవతి కూతురు లాడీ బేగాన్ని జహంగీర్ చిన్నకుమారుడు షహర్యార్‌కు ఇచ్చి వివాహం చేయించింది. తన మేనకోడలు " అర్జుమండ్ భాను బేగం "ను రాజకుమారుడు కుర్రంతో (జహంగీర్ మూడవ కుమారుడు, భష్యత్తు మొఘల్ చక్రవర్తి షాజహాన్) వివాహం జరిపించింది. ఈ రెండు వివాహాలు నూర్జహాన్ కుటుంబ రాజకీయ అధికారం తరువాత తరం వరకు కొనసాగడానికి సహకరించింది. .[15]

మొఘల్ చక్రవర్తిని

మార్చు
 
Silver coins minted with Nur Jahan's name on it.
 
Nur Jahan.

నూర్జహాన్ అత్యధిక ధైర్యసాహసాలు కలిగిన మహిళ. ఆమె తరచుగా తన భర్తతో వేటకు వెళ్ళేది. ఆమె కొన్ని మార్లు పులిని కూడా కాల్చింది. [16] నూర్జహాన్ ధైర్యం, సాహసం, రాజకీయ చాతుర్యం తన రాజ్యం అంతటా విస్తరించి తన భర్త లేని సమయంలో కూడా రాజ్య సరిహద్దులకు రక్షణగా నిలిచింది. కుటుంబ కలహాలు, తిరుగుబాటు, జహంగీర్ మరణించడానికి ముందు వారసుల మద్య తలెత్తిన యుద్ధం (1627 అక్టోబరు 28) లలో ఆమె చాకచక్యం చూపింది. [17]

నూర్జహాన్, షాజహాన్ మధ్య భేదాభిప్రాయాలు క్రమంగా బలపడ్డాయి. తన తండ్రి జహంగీర్ వద్ద నూర్జహాన్‌కు ఉన్న పలుకుబడితో ఆమె తన అభిమాన పుత్రుడు జహంగీర్ రెండవ కుమారుడైన షాహ్ర్యార్‌ను అధికారానికి తీసుకురావడానికి నూర్జహాన్ ప్రయత్నించడం షాజహానుకు తీవ్రమైన ఆగ్రహం కలిగించింది. షాహ్ర్యార్‌ నూర్జహానుకు అల్లుడు కూడా. పర్షియన్లు కాందహార్ మీద దాడి చేసిన సమయంలో నూర్జహాన్ రాజకీయవ్యవహారాలలో చిక్కుకుని ఉంది. ఆమె షాజహాన్‌ను కాందహార్‌కు వెళ్ళమని ఆఙాఅపించింది. షాజహాన్ అందుకు నిరాకరించాడు. ఆమె షాజహాన్‌కు వ్యతిరేకంగా చేపట్ట్జినందున షాజహాన్ కాందహార్‌కు వెళ్ళాడానికి నిరాకరించాడని కొందరు భావించారు. ఫలితంగా 45 రోజుల యుద్ధం తరువాత కాందహారును పర్షియన్లు స్వాధీనం చేసుకున్నారు.[18] తాను లేని సమయంలో నూర్జహాన్ జహంగీర్ మనసును కలుషితం చేసి తనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుని తన స్థానంలో షహ్ర్యార్‌ను నిలుపుతుందని షాజహాన్ సందేహపడ్డాడు. అందువలన పర్షియన్లతో యుద్ధం చేసే కంటే తన తండ్రి జహంగీర్ మీద యుద్ధం చేయడానికి ప్రధాన్యత ఇచ్చాడు [19] షాజహాన్ సైన్యాలను సమకూర్చుకుని జహంగీర్, నూర్జహాన్ మీద దాడిచేసాడు. షాజహన్ చర్యలకు 1626లో తండ్రి నుండి క్షమాభిక్ష లభించింది. అయినప్పటికీ నూర్జహాన్, షహ్ర్యాన్ షాజహాన్‌కు వ్యతిరేకంగా గూఢంగా చర్యలు సాగించారు.

1626 లో జహంగీర్ చక్రవర్తి కాశ్మీర్‌కు వెళ్ళేదారిలో తిరుగుబాటుదారుల చేత చిక్కాడు. తిరుగుబాటు నాయకుడు మహాబత్ ఖాన్ జహంగీర్‌కు వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నాడు. నూర్జహాన్ భర్తను విడిపించడానికి ప్రయత్నించింది. నూర్జహాన్ శత్రువు మీద దాడి చేసి చక్రవర్తిని విడిపించమని మంత్రులకు ఆదేశం జారీ చేసింది. ఆమె కూడా స్వయంగా ఏనుగు మీద స్వారీ చేస్తూ సైనిక దళాన్ని నడిపించింది.[20] యుద్ధంలో నూర్హహాన్ యుద్ధగజం దెబ్బ తిన్నది. చక్రవర్తి సైన్యాలు దాని కాలి కింద పడ్డారు. తన ప్రణాళిక విఫలమైనదని గ్రహించి మహాబత్ ఖాన్‌కు లొంగి పోయింది. మహాబత్ ఖాన్ ఆమెను ఆమె భర్తతో చేర్చి బంధించాడు. మహాబత్ ఖాన్ నూర్జహాన్ మేధాశక్తి గురించి తక్కువ అంచనా వేసాడు. నూర్జహాన్ చాకచక్యం గురించి తెలుసుకునే ముందుగా నూర్జహాన్ భర్తతో సహా తప్పించుకుని మహాబత్ ఖాన్ మీద దాడి చేసింది.[21]

వారసుల మద్య యుద్ధం

మార్చు

ఈ సంఘటన తరువాత జహంగీర్ 1627 అక్టోబరులో మరణించాడు. జహంగీర్ మరణం వారసుల మద్య యుద్ధానికి దారితీసింది. పూటీ షర్యార్, షాజహాన్ మద్య సాగింది. జహంగీర్ పెద్దకుమారుడు జహంగీర్ మీద తిరుగుబాటు చేసాడు. ఫలితంగా జహంగీర్ అతని కళ్ళను తీయించి అంధుని చేసి శిక్షించాడు. తరువాత అతడు దక్కన్‌లో హత్యచేయబడ్డాడు. జహంగీర్ రెండవకుమారుడు పర్విజ్ బలహీనుడు, మద్యానికి బానిస. షాజహాన్ చక్రవర్తి అయితే రాజ్యంలో తన అధికారం కోల్పోవచ్చని నూర్జహాన్ భయపడింది. అందువలన తనకు అనుకూలుడైన షహ్ర్యార్‌ను చక్రవర్తిని చేసి అతడిని తనకు అనుకూలంగా నడిపించవచ్చని విశ్వసించింది. యుద్ధం సగం వరకు యుద్ధం షహ్ర్యార్, నూర్జహాన్‌లకు అనుకూలంగా సాగింది. తరువాత ఆమె తన సోదరుని మోసానికి గురైంది. అసఫ్ ఖాన్ తన సోదరి రాజకీయ ఆధిక్యానికి అసూయజెంది షాజహాన్ పక్షం వహించాడు. అసఫ్ ఖాన్ తన సోదరి నూర్జహాన్‌ను ఖైదుచేయగానే షాజహాన్ తన సోదరుని సైన్యాలను మట్టుబెట్టి సోదరినికి మరణశిక్ష విధించాడు. 1628లో షాజహాన్ మొఘల్ చక్రవర్తి అయ్యాడు. [22]

 
Tomb of Nur Jahan in Shahdara Bagh

నూర్జహాన్ తన కుమార్తె లాడి బేగంతో మిగిలిన జీవితం వసతిసౌకర్యాలతో గృహనిర్భంధంలో గడిపింది. గృహనిర్భంధ సమయంలో ఆమె ఆగ్రాలో తనతండ్రి సమాధి నిర్మాణ నిర్వహణ చేస్తూ గడిపింది. అది ప్రస్తుతం " ఇత్మద్- ఉద్- దౌలా సమాధి " పేరుతో ఉంది. అంతేకాక మఖాఫి పేరుతో పర్షియన్ కవిత్వం వ్రాసింది. నూర్జహాన్ 1645 డిసెంబరు 17న తన 68వ సంవత్సరంలో మరణించింది. ఆమె భౌతికకాయం లాహోర్ లోని షహ్దరా బాగ్‌లో సమాధి చేయబడింది. ఆమె సమాధిని ఆమె మరణానికి ముందే స్వయంగా నిర్మించజేసింది. ఆమె సమాధి మీద " ఈ అఙాత, అభాగ్యవతి దిపమూ కాదు గులాబీ కాదు. సీతాకోక చిలుకా కాదు. నైటింగేలులా పాడనూ లేదు " అని వ్రాయబడింది.[22] ఆమె సమాధి జహంగీర్ సమాధికి చాలా దూరంలో లేదు. ఆమె సమాధికి సమీపంలో సోదరిని సమాధి ఉంది. నూర్జహాన్ సమాధిని పాకిస్థాన్, విదేశీ యాత్రీకులను ఆకర్షిస్తూ ఉంది. పర్యాటకులు ప్రశాంతమైన పూదోటలో నడుస్తూ ఆనందిస్తారు. .[ఆధారం చూపాలి]

సంస్కృతిలో నూర్జహాన్

మార్చు
  • నవలాకారుడు " ఇందు సుదర్శన్ " నూర్జహాన్ జీవితగాధ ఆధారంగా 3 నవలలు వ్రాసాడు. తాజ్ మహల్ ట్రియాలజీ అనబడే అవి " ది ట్వంటియత్ వైఫ్" (2002), ది ఫీస్టాఫ్ రోజెస్, (2003), " షాడో ప్రింసెస్ " (2010).
  • " నూర్జహాన్ డాటర్ "ను తనుశ్రీ పొద్దార్ చేత లిఖించబడింది. ఇది దివంగత చక్రవర్తి భార్యగా నూర్జహాన్, ఆమె కుమార్తెల జీవిత గమనాన్ని వివరిస్తుంది.
  • ఆమె జీవితం ఆధారం చేసుకుని పలు పద్యాలు వ్రాయబడ్డాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Nath 1990, p. 64
  2. 2.0 2.1 2.2 2.3 Gold 2008, p. 148
  3. 3.0 3.1 Chandra 1978, p. 4
  4. 4.0 4.1 Nath 1990, p. 66
  5. Mahajan 1970
  6. Nath 1990, p. 67
  7. Nath 1990, pp. 71–72
  8. Chandra 1978, p. 45
  9. Nath 1990, p. 58
  10. 10.0 10.1 Findly, Ellison Banks (1993). Nur Jahan : Empress of Mughal India. Oxford University Press. p. 32. ISBN 9780195360608.
  11. Mohammad Shujauddin, Razia Shujauddin (1967). The Life and Times of Noor Jahan. Caravan Book House. p. 25.
  12. Nath 1990, p. 72
  13. Chandra 1978, p. 46
  14. Nath 1990, p. 73
  15. Gold 2008, p. 150
  16. Mahajan 1970, p. 140
  17. Chandra 1978, p. 27
  18. Nath 1990, p. 79
  19. Mahajan 1970, p. 141
  20. Nath 1990, p. 83
  21. Chandra 1978, p. 72
  22. 22.0 22.1 Gold 2008, p. 151

మూలాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

Iran India relations span centuries marked by meaningful interactions.

వెలుపలి లింకులు

మార్చు