నూహ్ జిల్లా
హర్యానా రాష్ట్రం లోని 21 జిల్లాలలో నూహ్ జిల్లా ఒకటి. గతంలో దీన్ని నూహ్ జిల్లా అనేవారు. గుర్‌గావ్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని, ఫరీదాబాద్ జిల్లా లోని హతిన్ మండలాన్నీ కలిపి 2005 ఏప్రిల్ 4న హర్యానా రాష్ట్రపు 20వ జిల్లాగా నూహ్ రూపొందింది. తరువాత 2008లో హతిన్ ఉపవిభాగాన్ని పల్వల్ జిల్లాకు తరలించారు.
నూహ్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
ముఖ్య పట్టణం | నూహ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,860 కి.మీ2 (720 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,89,406 |
• జనసాంద్రత | 590/కి.మీ2 (1,500/చ. మై.) |
• Urban | 4.64% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 56 |
• లింగ నిష్పత్తి | 906 |
సగటు వార్షిక వర్షపాతం | 594 మి.మీ. |
సరిహద్దులు
మార్చుసరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | గురుగావ్ జిల్లా |
తూర్పు సరిహద్దు | ఫరీదాబాద్, పాల్వాల్ జిల్లాలు. |
పశ్చిమ సరిహద్దు | రెవారి |
వైశాల్యం | 1859.61 చ.కి.మీ |
జిల్లా కేంద్రం | నుహ్ పట్టణం |
జనసంఖ్య | 10,89,406 |
ప్రజలు | మియో (వ్యవసాయ ఆధారితం) |
విభాగాలు
మార్చునూహ్ జిల్లాలో నుహ్, తయోరు, నాగినా, ఫిరోజ్పూర్, ఝిర్కా, పుంహన మండలాలు, 431 గ్రామాలు, 297 పంచాయితీలు ఉన్నాయి. హతిన్ మండలం పాల్వాల్ జిల్లాకు తరలించక ముందు జిల్లాలో 512 గ్రామాలు, 365 పంచాయితీలు ఉన్నాయి.
భౌగోళికం
మార్చునూహ్ జిల్లా మట్టి మెత్తగా తేలికగా ప్రత్యేకంగా ఇసుక కలిసిన బంకమట్టి, సాధారణ బంకమట్టి ఉంటుంది. ఎగువ పర్వతాలు అధికంగా వృక్షరహితంగా ఉంటాయి.
పట్టణాలు
మార్చు- ఫిరోజ్పూర్ ఝిర్క
- నుహ్
- నాగినా
- పినాంగ్వన్
- పునహన
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,089,406,[1] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | రోడో ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 420వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 729 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 37.94%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 906:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 56.1%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
2001 గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
అనుసరించి - జనసంఖ్య | 9,93,617 |
నగర ప్రజలు | 46,122 (4.64%) |
గ్రామీణ ప్రజలు | 9,47,495 (95.36%) |
ఇందులో పురుషుల సంఖ్య | 5,24,872 |
స్త్రీలసంఖ్య | 4,68,745 |
షెడ్యూల్డ్ ప్రజలు | 78,802 |
మొత్తం కుటుంబాలు | 1,42,822 |
గ్రామప్రాంత కుటుంబాలు | 1,35,253 (95%) |
నగరప్రాంత కుటుంబాలు | 7569 (5%) |
బి.పి.ఎల్ కుటుంబాలు | 53125 |
ఆర్ధికం
మార్చుజిల్లా ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వృత్తులు. జిల్లాలో అధికంగా నివసిస్తున్న మెయోలు (ముస్లిములు) వ్యవసాయం ప్రధానవృత్తిగా జీవితం సాగిస్తున్నారు. మియో ప్రజలకు ఒకింత అహకారం ఉంటుంది. నూహ్‌లో వ్యవసాయం అధికంగా వర్షాధారితంగా ఉంటుంది. పర్వతశ్రేణిలోని వ్యవసాయక్షేత్రాలు (స్మాల్ పాకెట్స్)లకు మాత్రం కాలువల ద్వారా నీరు అందించబడింది. హర్యానారాష్ట్ర ఇతరజిల్లాల వ్యవసాయ ఉత్పత్తి కంటే నూహ్ జిల్లా వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉంటింది. పాల ఉత్పత్తి సంబంధిత జంతువుల పెంపకం ప్రజాజీవితంలో ఆర్థికకరంగంలో రెండవ స్థానంలో ఉంది. ఆరావళి పర్వతప్రాంతంలో నివసిస్తున్న ప్రజలలో కొంతమంది మేకలు, గొర్రెల పెంపకం జివనోపాధిగా ఉంది. ఋణసంబంధిత వ్యవహారాలు పాలను తక్కువ ధరలకు వ్యాపారులకు విక్రయించవలసిన అవసరం కలిగిస్తున్న కారణంగా వారి ఆదాయం తగ్గుతూ ఉంటుంది. హర్యానా రాష్ట్రం లోని ఇతర జిల్లాల వ్యవసాయ ఉత్పత్తి కంటే నూహ్ జిల్లా ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. స్వాతంత్ర్యం తరువాత కూడా జిల్లా వెనుకబడి ఉంది. దేశ రాజధానికి 145 కి.మీ దూరంలో మాత్రమే ఉన్న నూహ్ జిల్లాకు అభివృద్ధిపధకాలు తగినంతగా అందుబాటులో లేవు.
వ్యవసాయం
మార్చు2001 గణాంకాలను అనుసరించి నూహ్ జనసంఖ్య 993617 కాగా వీరిలో 46122 (4.65%) నగరాలలో నివసిస్తున్నారు. వీరిలో 947495 (95.36%) ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు. నూహ్ జిల్లాలో సరాసరి కుటుంబ సభ్యుల సంఖ్య 7. మెయోలు (ముస్లిములు) అధికంగా నివసిస్తున్న నూహ్ జిల్లాలో వీరు అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.
జంతువుల పెంపకం
మార్చుజిల్లాలో ప్రజల జీవనోపాధిలో జంతువుల పెంపకం రెండవ స్థానంలో ఉంది. ఆరావళి వంటి పర్వతశ్రేణిలో నివసిస్తున్న ప్రజలు మేకలు, గొర్రెలను పెంచుతూ ఉన్నారు.
వాతావరణం
మార్చునూహ్ జిల్లా సబ్- ట్రాపికల్, సెమీ - అరిడ్ వాతావరణం ఉంటుంది. వేసవిలో వాతావరణం వేడిగా ఉంటుంది. వర్షాకాలంలో తప్ప మిగిలిన కాల ంలో గాలిలో తేమ జిల్లాలో సాధారణం. సంవత్సరంలో మే- జూన్ మాసాలు అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన మాసాలుగా ఉన్నాయి. వేసవి ఉష్ణోగ్రత 30-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. శీతాకాలంలో 2-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. వేసవిలో గాలితో కూడిన వాయువులు బలంగా వీస్తుంటాయి.
వర్షపాతం
మార్చువార్షిక వర్షపాతం ప్రతిసంసంవత్సరం వ్యత్యాసంగా ఉంటుంది. వర్షాకాలంలోనే అధికశాతం వర్షపాతం ఉంటుంది. జూలైమాసంలో వర్షపాతం అధికంగా ఉంటుంది. జూన్- సెప్టెంబరు వరకు వర్షాకాలం ఉంటుంది. ఈ కాలంలో 80% వర్షపాతం ఉంటుంది. సరాసరి వర్షపాతం 336-440 మి.మీ ఉంటుంది.
గాలిలో తేమ
మార్చుసంవత్సరంలో అత్యధికభాగం వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది. నూహ్ జిల్లాలో వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఏప్రిల్ - మే మాసాలలో గాలిలో తేమ 20% ఉంటుంది.
గాలి
మార్చువర్షాకాలంలో ఆకాశం అధికంగా మేఘావృతమై ఉంటుంది.ఈ కాలంలో వేగంగా గాలులు విస్తుంటాయి. వర్షాకాలం తరువాత, శీతాకాలాలలో గాలి మందంగా వీస్తుంది.
ప్రత్యేకత
మార్చునూహ్ జిల్లాలో ఉరుములతో కూడిన తుఫాన్, ధూళి తుఫాన్అధికంగా ఉంటుంది. వీటికి ఏప్రిల్- జూన్ మద్య తోడుగా ప్రఛండ వాయువుల తాకిడి అధికంగా ఉంటుంది. కొన్ని సమయాలలో ఉరుములతో కూడిన తుఫాన్ వెంట బలమైన వర్షపాతం ఉంటుంది. ఒక్కోసారి వడగళ్ళు కూడా పడుతుంటాయి. శీతాకాలంలో కొన్ని మార్లు హిమపాతం కూడా అధికంగా ఉంటుంది. .
ఇవికూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cyprus 1,120,489 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567