నూహ్

హర్యానా రాష్ట్రం లోని పట్టణం

నూహ్ హర్యానా లోని పట్టణం, నూహ్ జిల్లా ముఖ్య పట్టణం. [1] ఇది గుర్గావ్ - సోహ్నా - ఆల్వార్ జాతీయ రహదారి-248 పై గుర్‌గావ్ నుండి 45 కి.మీ. దూరంలో ఉంది.

నూహ్
नूँह
మేవాత్
పట్టణం
నూహ్ is located in Haryana
నూహ్
నూహ్
Coordinates: 28°07′N 77°01′E / 28.12°N 77.02°E / 28.12; 77.02
దేశం India
రాష్ట్రంహర్యాణా
జిల్లానూహ్
Elevation
199 మీ (653 అ.)
జనాభా
 (2011)
 • Total10,767
Demonymమేవాతీ
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-HR
Vehicle registrationHR-27
http://www.mewat.gov.in

భౌగోళికం

మార్చు

నూహ్ 28°07′N 77°01′E / 28.12°N 77.02°E / 28.12; 77.02 వద్ద [2] సముద్ర మట్టానికి 199 మీటర్ల ఎత్తున ఉంది. ఇది న్యూ ఢిల్లీ నుండి 70 కి.మీ.దూరంలో, హర్యానాలోని నైరుతి ప్రాంతంలో ఉంది.

వాతావరణం

మార్చు

నగరంలో శీతోష్ణస్థితిలో తీవ్రమైన హెచ్చు తగ్గులుంటాయి. అత్యల్ప ఉష్ణోగ్రత: 0-1 oC ఉండగా అత్యధిక ఉష్ణోగ్రత: 44-45 oC ఉంటుంది.

జనాభా

మార్చు

2001 జనగణన ప్రకారం,[3] నూహ్ జనాభా 11,038. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. నూహ్ అక్షరాస్యత 54%, ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 63% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 44%. జనాభాలో 20% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

రవాణా

మార్చు

నూహ్ గుర్గావ్ - సోహ్నా - అల్వార్ జాతీయ రహదారి 248 పై గుర్‌గావ్ నుండి 45 కి.మీ. దూరంలో ఉంది.

పట్టణం నుండి గుర్గావ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ ల లోని పలు ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి. రాజస్థాన్, హర్యానా ప్రభుత్వ బస్సులు కూడా నడుస్తున్నాయి. పట్టణంలో హర్యానా రోడ్‌వేస్ వారి డిపో ఉంది. ఢిల్లీ నుండి అల్వార్ వెళ్ళే హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వ బస్సులు నూహ్ గుండానే వెళ్తాయి.

సమీప రైల్వే స్టేషన్లు పల్వల్ (32 కిమీ), గుర్‌గావ్ (45 కిమీ). వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లో భాగంగా అల్వార్ నుంచి పీర్తలా, పల్వల్ సమీపంలోని అసోతి వరకు కొత్త రైలు మార్గం వేస్తున్నారు. ఈ మార్గం నుహ్ పట్టణానికి కొద్దిగా తూర్పున వెళుతుంది. అక్కడ నూహ్ రైల్వే స్టేషను కూడా ఏర్పడుతుంది. మానేసర్ లేదా పల్వల్ వెళ్ళే వెస్ట్రన్ పెరిఫెరీ ఎక్స్‌ప్రెస్ వే నుహ్ నుండి 14 కి.మీ. దూరంలో వెళ్తుంది. సమీప విమానాశ్రయం న్యూ ఢిల్లీలో ఉంది.

ప్రస్తావనలు

మార్చు
  1. "Gurgaon is now 'Gurugram', Mewat renamed Nuh: Haryana government". The Indian Express. 12 April 2016. Retrieved 12 April 2016.
  2. Falling Rain Genomics, Inc - Nuh
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.


"https://te.wikipedia.org/w/index.php?title=నూహ్&oldid=3122158" నుండి వెలికితీశారు