నెక్కంటి సుబ్బారావు

నెక్కంటి సుబ్బారావు రైతు, రైతు శాస్త్రవేత్త. వరి వంగడాలను తన మడుల్లో ప్రయోగాత్మకంగా పండించి, ఏ రకం మన వాతావరణానికి, భూసారానికి ఉపయోగపడుతుందో పరిశోధనలు చేసే రైతుశాస్త్రవేత్త.[1] ఐఆర్ 8 రకం వరి వంగడాన్ని తయారుచేసి ప్రపంచ కరువు తగ్గటానికి దోహదపడ్డారు.(ఈనాడు 5.12.2016).

నెక్కంటి సుబ్బారావు

బాల్యం-విద్యాభ్యాసం మార్చు

నెక్కంటి సుబ్బారావు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట. అతను ఎస్.ఎస్.ఎల్.సి.(సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేషన్, నేటి పదోతరగతి) పూర్తిచేసాడు. ఆపైన 1967లో నేరుగా వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టాడు.[1]

వ్యవసాయ రంగం మార్చు

వ్యవసాయరంగంలో అతని ప్రయోగాలకు, మంచి ఫలితాలకు సుప్రసిద్ధుడయ్యాడు.

పరిశోధనలు మార్చు

1967లో ఆనాటి కొత్త వంగడమైన ఐఆర్8ను వ్యవసాయ శాస్త్రవేత్తలు సాగుచేసి కేవలం 18 బస్తాల ఫలసాయాన్ని మాత్రమే తీయగలిగారు. అన్ని రకాల రసాయనిక ఎరువులను ప్రయోగించినా ఇంత తక్కువ ఫలితం దక్కడంతో వారు హతాశులయ్యారు. సుబ్బారావు అదే వంగడాన్ని రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా అదునుమీద వ్యవసాయం చేశారు. ఆయన పొలంలో ఐఆర్8 40 బస్తాలకు పైగా పండింది. సారవంతమైన గోదావరి డెల్టాలో రసాయన ఎరువులు వేయనక్కరలేదని, ఈ రకాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు సార్వాలో ఊడ్చారని, తాను విషయాన్ని అవగాహన చేసుకుని దాళ్వాలో పంటవేయడంతో ఇంతటి ఫలసాయాన్ని సాధించానని చెప్తారు. అతను ప్రయోగం రికార్డులను సాధించడంతోపాటుగా ఆ వంగడాన్ని ఏ జాగ్రత్తలు తీసుకుని వేయాలో తెలిపేందుకు మార్గదర్శిని అయింది. ఆ రంగంలో అటువంటి ప్రారంభం పొందాకా ఎన్నో ప్రయోగాలు చేశారు.[1] 2014 అక్టోబరు నెలలో ఫిలిప్పైన్స్‌లో ఉన్న అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ)ను సందర్శించిన 200 మంది రైతుల్లో అతను ఒకరు. అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన 200మంది రైతుల బృందంలోనూ సుబ్బారావు వ్యక్తిగతంగా తన ప్రతిభను చూపాడు. వారిలో కేవలం ఆయనొక్కరే అతికొద్ది నెలల నుంచి ప్రయోగాత్మకంగా పండిస్తున్న గ్రీన్ సూపర్ రైస్ రకాన్ని సందర్శించాడు. గ్రీన్ వరి వంగడాల్లో 7రకాల సూపర్ రైస్ వంగడాల్ని భారతదేశ స్థితిగతులలో ప్రయోగాత్మకంగా నెక్కంటి సుబ్బారావు వేసి పండించారు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 రాంబాబు, పతంగి (7 జనవరి 2015). "ఆచంట శిగలో ఆకుపచ్చని సిరి". వై.ఎస్.భారతి. సాక్షి. Retrieved 17 February 2015.