నేరేడుచర్ల పురపాలకసంఘం

నేరేడుచర్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] నేరేడుచర్ల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం లోని హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

నేరేడుచర్ల పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండలం నేరేడుచర్ల
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ చందమల్ల జయబాబు
 - వైస్ చైర్‌పర్సన్‌ చల్లా శ్రీలత
వైశాల్యము
 - మొత్తం 24.84 km² (9.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 14,853
 - పురుషుల సంఖ్య 7,547
 - స్త్రీల సంఖ్య 7,306
 - గృహాల సంఖ్య 2,862
పిన్ కోడ్ - 508218
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న నేరేడుచర్ల, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం మార్చు

నేరేడుచర్ల 24.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°53′10″N 79°41′35″E / 16.886°N 79.693°E / 16.886; 79.693 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 14853 మంది కాగా, అందులో 7547 మంది పురుషులు, 7306 మంది మహిళలు ఉన్నారు. 2862 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 1 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చందమల్ల జయబాబు చైర్‌పర్సన్‌గా, చల్లా శ్రీలత వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు మార్చు

  1. కొణతం వెంకట్ రెడ్డి
  2. రణపంగ నాగయ్య
  3. షేక్ షానాజ్
  4. షేక్ బాషా
  5. అలక సరిత
  6. తాల్లూరి సాయిరామ్
  7. చందమల్ల జయబాబు (చైర్‌పర్సన్‌)
  8. కొండమగుండ్ల సరిత
  9. బానోతు లలిత
  10. నూకల సుగుణ
  11. బచ్చలకూరి ప్రకాష్
  12. బైరెడ్డి జితేందర్ రెడ్డి
  13. చల్లా శ్రీలత (వైస్ చైర్‌పర్సన్‌)
  14. వేమూరి నాగవేని
  15. కుంకు సులోచన

మూలాలు మార్చు

  1. "Neredcherla Municipality". neredcherlamunicipality.telangana.gov.in. Retrieved 2021-04-05.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 5 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 5 April 2021.
  4. "Basic Information of Municipality, Neredcherla Municipality". neredcherlamunicipality.telangana.gov.in. Retrieved 2021-04-05.
  5. "Council, Neredcherla Municipality". neredcherlamunicipality.telangana.gov.in. Retrieved 2021-04-05.
  6. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 5 April 2021.

వెలుపలి లంకెలు మార్చు